న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జస్‌ప్రీత్ బుమ్రాను ఇమిటేట్ చేసిన జోఫ్రా ఆర్చర్ (వీడియో)

IPL 2020, RR vs MI: Watch Jofra Archer Shares A Laugh After Copying Jasprit Bumrahs Action

అబుదాబి: ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను రాజస్థాన్ రాయల్స్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఇమిటేట్ చేశాడు. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఆర్చర్.. బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను కాపీ చేశాడు. బుమ్రా తరహాలో బంతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని మెల్లగా రనప్‌ తీసుకునే యాక్షన్‌ను ఆర్చర్‌ అనుకరించాడు. ఆ క్రమంలోనే తన నవ్వును ఈ ఇంగ్లండ్ పేసర్ ఆపులేకపోయాడు. దీన్ని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. బుమ్రాను ఆర్చర్‌ అనుసరించే యత్నం చేశాడని క్యాప్షన్‌ను ఇచ్చారు.

అయితే గతంలో కూడా చాలా మంది విభిన్న శైలి కలిగిన బుమ్రా బౌలింగ్‌‌ను అనుకరించారు. అప్పట్లో చాలా వీడియోలు హల్‌చల్ చేశాయి. తాజాగా ఆర్చర్ ఇమిటేషన్ కూడా క్రికెట్‌ ఫ్యాన్స్‌ను అలరించింది. ఈ సీజన్‌లో వీరిద్దరూ ప్రస్తుతం టాప్‌-5లో కొనసాగుతున్నారు. ఆర్చర్‌-బుమ్రాలు తలో 17 వికెట్లు సాధించారు. ఆర్చర్‌ 12 మ్యాచ్‌ల్లో 6.71 ఎకానమీతో 17 వికెట్లు సాధించగా, బుమ్రా 11 మ్యాచ్‌ల్లో 7.52 ఎకానమీతో 17 వికెట్లు తీశాడు.

ఈ మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 196 పరుగుల భారీ టార్గెట్‌ను రాజస్తాన్‌ సునాయాసంగా ఛేదించింది. తమ బ్యాటింగ్‌లో పవర్‌ చూపెట్టిన రాజస్తాన్‌.. ముంబై ఇండియన్స్‌ను రప్ఫాడించింది. బెన్‌ స్టోక్స్‌(107 నాటౌట్‌; 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ శాంసన్‌(54 నాటౌట్‌; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్స్‌లు)లు చెలరేగిపోవడంతో రాజస్తాన్‌ 18.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది. ఈ జోడి అజేయంగా 152 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో రాజస్తాన్‌ అలవోకగా విజయం సాధించింది.

RCB vs CSK: అంబటి రాయుడికి దసరా సెగ.. మ్యాచ్ మధ్యలో వాష్‌రూమ్‌కు పరుగు.. ఆటకు ఆలస్యం!RCB vs CSK: అంబటి రాయుడికి దసరా సెగ.. మ్యాచ్ మధ్యలో వాష్‌రూమ్‌కు పరుగు.. ఆటకు ఆలస్యం!

Story first published: Monday, October 26, 2020, 22:05 [IST]
Other articles published on Oct 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X