న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాంటింగ్ ఎఫెక్ట్.. ఈసారి అశ్విన్ మన్కడింగ్ చేయలేదు.. నవ్వులు పూయించాడు (వీడియో)

IPL 2020, RCB vs DC: Watch Ravichandran Ashwin gives mankad warning to Aaron Finch

దుబాయ్‌: ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ ఎఫెక్ట్ ఏమో లేక గతేడాది జరిగిన రచ్చ కారణంగానో కానీ రవిచంద్రన్ అశ్విన్ ఈ సారి మన్కడింగ్ (నాన్‌ స్టైకర్‌ ఎండ్‌లో బ్యాట్స్‌మన్‌ క్రీజ్‌ దాటినప్పుడు చేసే రనౌట్‌) చేయలేదు. కానీ తన చర్యతో నవ్వులు పూయించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 59 పరుగులతో ఘన విజయాన్నందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా ఆ జట్టు ఓపెనర్ ఆరోన్ ఫించ్‌కు అశ్విన్ అదిరిపోయే ఝలక్ ఇచ్చాడు. దాంతో మైదానంలో నవ్వులుపూసాయి.

ఇంతకేం జరిగిందంటే..

197 పరుగుల భారీ లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీని కట్టడి చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. పవర్ ప్లే స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్‌ను మూడో ఓవర్‌లోనే దింపాడు. ఈ ఓవర్‌లో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ఆరోన్ ఫించ్ బంతి వేయక ముందే క్రీజును దాటడాన్ని పసిగట్టిన అశ్విన్.. అతనికి మన్కడింగ్ ఝలక్ ఇచ్చాడు. నాలుగో బంతికి తన యాక్షన్ పూర్తి చేసిన అశ్విన్.. బాల్ వేయకుండా అలా చూస్తూ నిలబడిపోయాడు. ఇక అప్పటికే క్రీజు దాటిన ఫించ్ బాల్ ఏమైందన్నట్లు అయోమయానికి గురయ్యాడు. వెంటనే అశ్విన్‌ను చూసి బిత్తరపోయాడు.

పాంటింగ్ వైపే అందరి చూపులు..

పాంటింగ్ వైపే అందరి చూపులు..

ఇక మన్కడింగ్‌ను తప్పుబట్టిన రికీ పాంటింగ్.. ఇది క్రీడాస్పూర్తిగా విరుద్దమని, తన కోచ్‌గా ఉన్నన్ని రోజులు దీన్ని అనుమతించనని లీగ్‌కు ముందు చెప్పాడు. ఈ విషయంపై అశ్విన్‌‌కు కూడా నచ్చజెప్పిన పాంటింగ్.. బ్యాట్స్‌మెన్‌కు 5 పరుగుల పెనాల్టీ విధించే నిబంధనను తీసుకురావాలన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ మన్కడింగ్‌ అవకాశాన్ని వదిలేయడంతో టీవీ కెమెరాలన్నీ ఒక్కసారిగా డగౌట్‌లోని పాంటింగ్‌వైపు మళ్లాయి. కామెంటేటర్లు వ్యంగ్యస్త్రాలు సంధించారు. అశ్విన్ మన్కడింగ్ వార్నింగ్‌తో కామెంట్రీ బాక్స్‌లో జోక్స్‌ పేలాయి. ఇక పాంటింగ్ కూడా చిరునవ్వులు చిందించాడు.

గతేడాది వివాదం..

గతేడాది వివాదం..

గతేడాది ఐపీఎల్‌లో రాజస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ను ‘మన్కడింగ్‌' ద్వారా ఔట్‌ చేసి రవిచంద్రన్‌ అశ్విన్‌ వివాదానికి తెరలేపాడు. అప్పుడు అశ్విన్‌ కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. అప్పట్లో దీనిపై తీవ్ర దుమారం రేగింది. ఇది క్రీడా స్పూర్తికి విరద్దుమని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అశ్విన్‌పై ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాను మాత్రం నిబంధనల్లో ఉన్నది చేసానని ఈ సీనియర్ స్పిన్నర్ సమర్దించుకున్నాడు. క్రీడా స్పూర్తికి విరుద్దమైతే నిబంధనల్లో నుంచి తీసేయండంటూ గట్టిగా కౌంటరిచ్చాడు. అప్పటి నుంచి మన్కడింగ్ అంటే అశ్విన్.. అశ్విన్ అంటే మన్కడింగ్‌లా మారిపోయింది. ఈ నిబంధనను తీసేయాలనే డిమాండ్ కూడా వ్యక్తమైంది.

ఆల్‌రౌండ్ షో..

ఆల్‌రౌండ్ షో..

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. మార్కస్ స్టొయినిస్‌ (26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్‌) చెలరేగగా... పృథ్వీషా (23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు 42) రాణించాడు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన హైదరాబాద్‌ బౌలర్‌ మహ్మద్ సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసి ఓడింది. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (39 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 43) తప్ప ఎవరూ కనీసం 20 పరుగులైనా చేయలేకపోయారు. కగిసో రబడ (4/24) బెంగళూరు పతనాన్ని శాసించాడు. మరో పేసర్‌ నోర్జ్‌కు రెండు వికెట్లు దక్కాయి. పొదుపుగా బౌలింగ్‌ చేసిన స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

కోహ్లీ బాటలోనే రాహుల్.. వ్యక్తిగతమే తప్పా జట్టుకు పనికొచ్చిందేమీ లేదు.. నెట్టింట పేలుతున్న సెటైర్స్!

Story first published: Tuesday, October 6, 2020, 8:11 [IST]
Other articles published on Oct 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X