For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ బాటలోనే రాహుల్.. వ్యక్తిగతమే తప్పా జట్టుకు పనికొచ్చిందేమీ లేదు.. నెట్టింట పేలుతున్న సెటైర్స్!

Netizens troll KXIP as Watson and du Plessis orchestrate CSKs 10-wicket win in IPL 2020

హైదరాబాద్: చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కెప్టెన్ కేఎల్ రాహుల్‌‌ను ఏకీపారేస్తున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ బాటలోనే రాహుల్ నడుస్తున్నాడని, అతనిలానే వ్యక్తిగత ప్రదర్శనలు తప్పా జట్టుకు పనికొచ్చే ఆట ఆడటం లేదని విమర్శిస్తున్నారు. ప్రపంచం మొత్తాన్ని తానే మోస్తున్నట్లు రాహుల్ తెగ ఫీలవుతున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఆదివారం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 10 వికెట్లతో ఓటమిపాలైంది.

ముజీబ్‌ను తీసుకోకపోవడం..

ఇక బ్యాటింగ్‌లో అదరగొడుతున్న కింగ్స్ పంజాబ్.. బౌలింగ్‌లో తేలిపోతుందని, షమీ, బిష్ణోయ్ మినహా ఇతర బౌలర్లు విఫలమవుతున్నారని కామెంట్ చేస్తున్నారు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ తుది జట్టులోకి తీసుకోకపోవడం బుద్ది తక్కువ పనని మండిపడుతున్నారు. మ్యాక్స్‌వెల్ కూడా జట్టుకు కుదిబండగా మారడని, అతని స్థానంలో గేల్‌ను తీసుకుంటే కనీసం ధాటిగానైన ఆడుతాడని సలహాలిస్తున్నారు. ఓపెనర్లను ఔట్ చేయని జట్టు ఏం టీమ్ అని, మరేం బౌలింగ్ అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పాపం పంజాబ్ బౌలర్లు..

ఇక షేన్ వాట్సన్, ఫాఫ్ డూప్లెసిస్ 181 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీయడాని కింగ్స్ పంజాబ్ బౌలర్లు, కెప్టెన్ కేఎల్ రాహుల్ తెగ్గ కష్టపడ్డారని, పాపం వారికి ఆ అవకాశం దక్కలేదని ఎగతాళి చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్‌తో పంజాబ్‌ బౌలింగ్‌పై ట్రోలింగ్ చేస్తున్నారు. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్‌పై ఉన్న ఆరాటం.. జట్టును గెలిపించడంపై లేదని విమర్శిస్తున్నారు. ఇక ఏం చేసినా పంజాబ్‌కు విజయం దక్కడం లేదని, ఆ జట్టే అంతని నిట్టూరుస్తున్నారు.

సంతోషంలో చెన్నై అభిమానులు..

ఇక మూడు ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్నందుకోవడంతో ఆ జట్టు అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆనందాన్ని ఫన్నీ మీమ్స్‌తో వ్యక్తపరుస్తున్నారు. ‘వారెవ్వా వాట్సన్ నీ సత్తా చూపావోయ్'అని ఒకరంటే.. ఫాఫ్ వాట్సన్ సీఎస్‌కే ఆణిముత్యాలంటూ ఇంకొకరు కామెంట్ చేస్తున్నారు. వీరద్దరిది డెడ్లీ కాంబినేషన్, అభి మజా ఆగేయా అంటూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

దంచి కొట్టిన ఓపెనర్లు..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(52 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 63), నికోలస్ పూరన్(17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లతో 33) రాణించారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 181 పరుగులు చేసి 16 బంతులు ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు షేన్ వాట్సన్(53బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్స్‌లతో 83 నాటౌట్), ఫాఫ్ డూప్లెసిస్(53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 87 నాటౌట్) రికార్డు భాగస్వామ్యంతో దంచికొట్టారు. విజయంలో కీలక పాత్ర పోషించిన షేన్ వాట్సన్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

MI vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంప ముంచిన మూడు తప్పిదాలు!

Story first published: Monday, October 5, 2020, 12:32 [IST]
Other articles published on Oct 5, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+