న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అనుష్క శర్మ X సునీల్ గవాస్కర్ డబుల్ మీనింగ్ వివాదం: బాలీవుడ్ బ్యూటీ తప్పులేదన్న రవిశాస్త్రి!

IPL 2020: Ravi Shastri opens up on Gavaskar-Anushka controversy

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 ప్రారంభంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ భారత క్రికెట్ దిగ్గజం, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. తన భర్త వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ ఆటలోకి తనను లాగడం ఎంత వరకు సబబని బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ సైతం సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. తనపై గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు చాలా అసహ్యంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాను ఎక్కడా హద్దులు దాటి వ్యాఖ్యలు చేయలేదని, తన కామెంట్స్‌ను వక్రీకరించారని గవాస్కర్ సైతం వివరణ ఇచ్చుకున్నాడు. అయితే సోషల్ మీడియాలో కొంత మంది ఆకతాయిలు చేసిన పనికి.. ముందు వెనుకా ఆలోచించకుండా దిగ్గజ క్రికెట‌ర్‌ను ఎలా తప్పుబడుతావని, అతని వయసుకైనా గౌరవం ఇవ్వాలని మాజీ క్రికెటర్లు అప్పట్లో అనుష్క శర్మకు చురకలంటించారు. ఈ వివాదంపై తాజాగా స్పందించిన టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ వ్యవహారంలో అనుశ్క శర్మ తప్పులేదన్నాడు.

ఆ హక్కు అనుష్కకు ఉంది..

ఆ హక్కు అనుష్కకు ఉంది..

తాజాగా టైమ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి ముందు ఈ విషయాన్ని ప్రస్తావించగా.. సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనా? లేదా? అని తాను చెప్పలేనని, ఆ చర్చ జోలికి కూడా పోనన్నాడు. అయితే అనుష్క శర్మ బాధపడితే స్పందించే హక్కు ఆమెకు ఉందని స్పష్టం చేశాడు. ‘గవాస్కర్ వ్యాఖ్యలకు అనుష్క హర్ట్ అయితే ఆ బాధను వ్యక్తపరిచే హక్కు ఆమెకు ఉంది. అయితే ఇక్కడ గవాస్కర్ చేసిన కామెంట్స్ సరైనవా? కాదా? అని మాత్రం నేను చెప్పలేను. ఆ చర్చ జోలికి కూడా పోను'అని పేర్కొన్నాడు.

అనుష్క బంతులతో..

అనుష్క బంతులతో..

ఐపీఎల్ తొలి అంచె‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలను కొంత మంది ఆకతాయిలు వక్రీకరించారు. సరైన ప్రాక్టీస్ లేని కారణంగానే కోహ్లీ విఫలమవుతున్నాడని, లాక్‌డౌన్ కారణంగా విరాట్.. అనుష్క బౌలింగ్‌ను మాత్రమే ఎదుర్కొన్నాడని గవాస్కర్ తెలిపాడు. లాక్‌డౌన్‌లో ఈ జోడీ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఓ టెర్రస్ వీడియో నెట్టింట హల్‌చల్ చేసింది. ఈ వీడియోలో అనుష్క బౌలింగ్ చేయగా.. కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అయితే ఈ వీడియోను ఉద్దేశించే గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కానీ ఆకతాయిలు.. అనుష్క బౌలింగ్‌కు బదులు అనుష్క బంతులతో ప్రాక్టీస్ చేశాడని డబుల్ మీనింగ్ వచ్చేలా రాసుకొచ్చారు. దాంతో తీవ్ర దుమారం రేగింది.

మిస్టర్ సునీల్ గవాస్కర్..

మిస్టర్ సునీల్ గవాస్కర్..

అభిమానుల అర్ధం పర్ధంలేని ట్రోలింగ్‌ను సీరియస్‌గా తీసుకున్న అనుష్క ముందు వెనుకా ఆలోచించకుండా గవాస్కర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మిస్టర్ సునీల్ గవాస్కర్ మీ వ్యాఖ్యలు చాలా అసహ్యకరంగా ఉన్నాయి. భర్త గేమ్‌ను నిందించడానికి భార్యను లాగుతూ.. డబుల్ మీనింగ్ వాఖ్యలు ఎందుకు చేస్తారు? 2020 వచ్చినా.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ నన్ను క్రికెట్‌లోకి లాగుతూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి కామెంట్స్ ఎప్పుడు ఆగుతాయో? 'అని ఇన్‌స్టా వేదికగా ఈ బాలీవుడ్ బ్యూటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎక్కడా తప్పుగా మాట్లాడా..?

ఎక్కడా తప్పుగా మాట్లాడా..?

విరాట్ కోహ్లీని తాను విమర్శించలేదని, అతని సతీమణి అనుష్క శర్మ పట్ల అసహ్యకర వ్యాఖ్యలు చేయలేదని అప్పట్లో సునీల్ గవాస్కర్ కూడా వివరణ ఇచ్చుకున్నాడు. ‘ఎక్కడ ఆమెను నిందించా.. ఇందులో ఎక్కడ సెక్సిస్ట్ వ్యాఖ్యలు ఉన్నాయి. కోహ్లీ పక్కింటి వారు తీసిన వీడియో గురించి మాత్రమే మాట్లాడాను. లాక్‌డౌన్‌లో విరాట్‌కు ప్రాక్టీస్ లేదు. అతని ఇంటి కంపౌండ్‌లో అనుష్కశర్మతో కలిసి ప్రాక్టీస్ చేశాడు. ఆమె బౌలింగ్‌ను మాత్రమే ఎదుర్కొన్నాడు. ఆ వీడియోలో ఉన్నది అదే. నేను దాని గురించే మాట్లాడాను. విరాట్ వైఫల్యాలను నేను ఎక్కడా విమర్శించలేదు. ఆ వీడియోలో విరాట్‌కు అనుష్క బౌలింగ్ చేసిందని మాత్రమే చెప్పాను'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

ఖచ్చితంగా ఇది చివరి మ్యాచ్ కాదు.. వచ్చే సీజన్ ఆడటంపై క్లారిటీ ఇచ్చిన ధోనీ! (వీడియో)

Story first published: Sunday, November 1, 2020, 18:14 [IST]
Other articles published on Nov 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X