న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MI vs RR: రాజస్థాన్‌తో మ్యాచ్.. రైనా రికార్డులపై కన్నేసిన రోహిత్!!

IPL 2020, MI vs RR: Rohit Sharma on verge of surpassing Suresh Rainas record

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. రోజు రాత్రి 7.30గంటలకు ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లు తలపడనున్నాయి. వరుసగా రెండు ఓటములతో ఢీలాపడిన రాజస్థాన్.. బలమైన ముంబైతో తలపడనుంది. రోహిత్‌ శర్మ సారథ్యంలోని ముంబై గత రెండు మ్యాచ్‌ల్లోఅన్ని విభాగాల్లోనూ గొప్పగా రాణించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఆ జట్టు అనూహ్య ప్రదర్శన చేస్తోంది. ముఖ్యంగా రోహిత్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌ ద్వారా రోహిత్ ఓ రెండు రికార్డులపై కన్నేశాడు.

హాఫ్ సెంచరీ చేస్తే:

హాఫ్ సెంచరీ చేస్తే:

రాజస్థాన్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేస్తే.. ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన తొలి భారత క్రికెటర్‌గా నిలవనున్నాడు. ఇప్పటికే 38 అర్ధ శతకాలతో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా రికార్డ్‌ని రోహిత్ సమం చేశాడు. ఈరోజు ఓ అర్ధ శతకంతో బాదితే రైనాను అధిగమించనున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మొదటి స్థానంలో ఉన్నాడు. వార్నర్ 45 హాఫ్ సెంచరీలు బాదాడు.

194 మ్యాచ్‌లతో:

194 మ్యాచ్‌లతో:

ఐపీఎల్‌లో సురేష్ రైనా మొత్తంగా 193 మ్యాచ్‌లాడాడు. ఇప్పటికే 193 మ్యాచ్‌లతో అతని రికార్డ్‌ని సమం చేసిన రోహిత్ శర్మ.. ఈ రోజు ఆ రికార్డును బ్రేక్ చేయనున్నాడు. 194 మ్యాచ్‌లతో రోహిత్ రెండో స్థానంలో నిలవనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 195 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2020లోనే మహీ ఈ రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్ 2020లో ఐదు మ్యాచ్‌లాడిన రోహిత్ 176 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

రైనా ఆడిఉంటే:

రైనా ఆడిఉంటే:

'మిస్టర్ ఐపీఎల్' సురేష్ రైనా వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌ 13వ సీజన్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తన మేనత్త కుటుంబం దారుణ హత్యకు గురవడంతో యూఏఈ నుంచి రైనా.. ఉన్నపళంగా భారత్ వచ్చాడు. సమస్యలు సద్దుమణిగిన అనంతరం రైనా మళ్లీ యూఏఈ వెళుతాడు అని వార్తలు వచ్చినా.. అవేమి నిజం కాలేదు. ఒకవేళ రైనా ఐపీఎల్ 2020 ఆడి ఉంటే.. ఈ ఏడాది కూడా తన రికార్డును పదిలంగా ఉంచుకునేవాడు.

IPL 2020, MI vs RR Preview: Mumbai Indians Face Struggling Rajasthan Royals | Oneindia Telugu
ఐదు మ్యాచుల్లో మూడు విజయాలు:

ఐదు మ్యాచుల్లో మూడు విజయాలు:

ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో దూసుకెళుతోంది. ఆడిన ఐదు మ్యాచుల్లో మూడు విజయాలు సాధించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగి మొదటి మ్యాచ్‌లోనే ఓడినా.. తిరిగి పుంజుకొని టాప్‌గేర్ అందుకుంది. జట్టు బ్యాట్స్‌మెన్‌, బౌలర్లతో పాటు ఆల్‌రౌండర్లతో సమతూకంగా ఉంది. రాజస్థాన్‌తో మ్యాచ్‌కు ముంబై జట్టులో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు.

ఎంఎస్ ధోనీ వారసుడు రిషబ్‌ పంత్‌ మాత్రమే: టీమిండియా మాజీ పేసర్

Story first published: Tuesday, October 6, 2020, 18:07 [IST]
Other articles published on Oct 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X