న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో క్రిస్ గేల్ అరుదైన ఘనత.. సెంచరీ చేజారినా క్రీడా స్పూర్తి చాటిన యూనివర్స్ బాస్!

IPL 2020, KXIP vs RR: Chris Gayle becomes first player to smash 1000 T20 sixes

బుదాబి: యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనతను అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో 8 సిక్సర్లతో వీరవిహారం చేసిన ఈ కింగ్స్ పంజాబ్ పవర్ హిట్టర్.. టీ20 ఫార్మాట్‌లో 1000 సిక్స్‌లు పూర్తి చేసుకున్నాడు. కార్తీక్ త్యాగీ వేసిన 19వ ఓవర్ ఐదో బంతిని భారీ సిక్సర్‌గా మలిచిన గేల్ ఈ మైలురాయిని అందుకున్నాడు. తద్వార ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

మరెవరూ అందుకోలేని రికార్డు..

ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌లన్నీ ఆడే గేల్.. అత్యధిక సిక్సర్ల జాబితాలో వెయ్యి సిక్సర్ల‌తో అగ్రస్థానంలో ఉంటే.. ఇతర బ్యాట్స్‌మన్ కనీసం అతని దరిదాపుల్లో కూడా లేరు. యూనివర్స్ బాస్ తర్వాత వెస్టిండీస్‌కే చెందిన కీరన్ పొలార్డ్ 690 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉండగా.. బ్రెండన్ మెక్ కల్లమ్ (485), షేన్ వాట్సన్ (467), ఆండ్రీ రస్సెల్ (447), ఏబీ డివిలియర్స్ (417) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇక గేల్ నెలకొల్పిన ఈ రికార్డును మరెవరూ అందుకోలేరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

సెంచరీ చేజారినా..

జోఫ్రా ఆర్చర్ వేసిన ఆఖరి ఓవర్‌లో మూడో బంతిని భారీ సిక్సర్ కొట్టిన గేల్.. 99 పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు. కానీ ఆ మరుసటి బంతికే క్లీన్ బౌల్ట్ అయ్యాడు. ఆర్చర్ వేసిన అద్భుత యార్కర్‌ను అంచనా వేయలేకపోయిన గేల్.. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో తీవ్ర నిరాశకు గురైన యూనివర్స్ బాస్ అసహనంతో బ్యాట్‌ను నేలకు కొట్టాడు. అయితే ఆ వెంటనే బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు షేక్ హ్యాండ్ ఇస్తూ అద్భుత బంతని కొనియాడుతూ క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. ఈ సీన్ క్రికెట్ లవర్స్‌ను ఆకట్టుకుంది. అటు కామెంటేటర్లు కూడా ఇది కదా క్రీడాస్పూర్తి అంటే.. బాస్ బాసే అని కొనియాడారు.

ప్చ్.. పంజాబ్ ఓడింది

ప్చ్.. పంజాబ్ ఓడింది

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్లతో అద్భుత విజయాన్నందుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. క్రిస్ గేల్(63 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సలతో 99), కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) రాణించారు. అనంతరం రాజస్థాన్ రాయల్స్ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసి సునాయసంగా గెలుపొందింది.

బెన్ స్టోక్స్ (26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50), సంజూ శాంసన్(25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48) ధాటైన ఇన్నింగ్స్‌‌తో రాణించగా.. చివర్లో స్టీవ్ స్మిత్(20 బంతుల్లో 5 ఫోర్లు 31 నాటౌట్), జోస్ బట్లర్ (11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 22 నాటౌట్) చెలరేగారు. పంజాబ్ బౌలర్లలో అశ్విన్, జోర్డాన్‌లకు చెరొక వికెట్ దక్కింది. ఈ ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకోగా.. రాజస్థాన్ తమ అవకాశాలను మెరుగుపర్చుకుంది.

అన్ని ఫార్మాట్లలో అప్‌కమింగ్ టాప్ మోస్ట్ ఆల్‌రౌండర్ అతనే: గౌతమ్ గంభీర్

Story first published: Friday, October 30, 2020, 23:32 [IST]
Other articles published on Oct 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X