న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020 Final, MI vs DC: రాణించిన పంత్, అయ్యర్.. ముంబై టార్గెట్ 157

 Shreyas Iyer and Rishabh Pant fifties

దుబాయ్: శ్రేయస్ అయ్యర్(50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 65 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు రిషభ్ పంత్( 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) బాధ్యతాయుత హాఫ్ సెంచరీ తోడవడంతో కీలక ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబై ఇండియన్స్ ముందు 157 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక క్వాలిఫయర్ 1 తరహాలోనే టాప్-3 బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 156 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బౌల్ట్(3/30) ఢిల్లీ పతనాన్ని శాసించగా.. కౌల్టర్ నీల్ రెండు, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీశారు. ఓ దశలో స్వల్ప స్కోర్‌కే పరిమితమవుతుందనుకున్న ఢిల్లీకి పంత్, అయ్యర్ 96 భాగస్వామ్యాంతో పోరాడే స్కోర్ అందించారు.

ఫస్ట్ బాల్‌కే..

ఫస్ట్ బాల్‌కే..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కే మార్కస్‌ స్టాయినీస్(0) కీపర్‌ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో పరుగుల ఖాతా తెరవకుండానే ఢిల్లీ వికెట్ కోల్పోయింది. అతని తర్వాతి ఓవర్లోనే రహానే(2) కూడా కీపర్ క్యాచ్‌గానే పెవిలియన్ చేరగా.. జయంత్‌ యాదవ్‌ వేసిన నాలుగో ఓవర్లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న శిఖర్‌ ధావన్(15) బౌల్డ్‌ అయ్యాడు. దాంతో 22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే అయ్యర్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను ఇషాన్ కిషాన్ జార విడిచాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి ఢిల్లీ మూడు వికెట్లకు 41 రన్స్ చేసింది.

ఆదుకున్న పంత్, అయ్యర్..

ఆదుకున్న పంత్, అయ్యర్..

అనంతరం ధాటిగా ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డు వేగాన్ని పెంచింది. మంచి బౌలర్లను గౌరవించిన ఈ జోడీ.. చెత్త బంతులను బౌండరీలకు తరలించింది. కృనాల్ పాండ్యా వేసిన 10వ ఓవర్‌లో పంత్ రెండు సిక్స్‌లు బాదడంతో 16 పరుగులు వచ్చాయి. ఈ స్థితిలో రోహిత్.. బుమ్రాను తెచ్చి కట్టడి చేశాడు. అయితే పొలార్డ్ వేసిన మరసటి ఓవర్‌లో పంత్ ఫోర్ కొట్టగా.. అయ్యర్ సిక్స్ బాదాడు. కౌల్టర్ నైల్ వేసిన 15 ఓవర్‌ మూడో బంతిని బౌండరీ తరలించిన పంత్.. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అతనికిదే ఫస్ట్ ఫిఫ్టీ. అదే జోరులో మరుసటి బంతిని ఫోర్ కొట్టిన పంత్.. ఫైన్ లెగ్ మీద మరో షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 96 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఆఖర్లో తడబాటు..

ఆఖర్లో తడబాటు..

హెట్‌మైర్ క్రీజులోకి రాగా.. బుమ్రా బౌలింగ్‌లో ఫోర్ కొట్టి అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే హెట్‌మైర్(5) భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. వరుసగా వికెట్లు కోల్పోవడం ఢిల్లీ స్కోర్ వేగం తగ్గింది. 19వ ఓవర్‌లో 6 పరుగులు మాత్రమే చేసిన ఢిల్లీ.. ఆఖరి ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులే చేయడంతో ఢిల్లీ 156 పరుగులకే పరిమితమైంది.

Story first published: Tuesday, November 10, 2020, 21:44 [IST]
Other articles published on Nov 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X