DC vs RR: టీ20ల్లో శిఖర్ ధావన్ అరుదైన ఘనత.. నాలుగో భారత ఆటగాడిగా గుర్తింపు!

దుబాయ్: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన ధావన్.. టీ20 క్రికెట్‌లో 7500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తద్వార ఈ ఘనతను అందుకున్న నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందాడు.
ధావన్ కన్నా ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేశ్ రైనా ఈ రికార్డు నమోదు చేశారు. 288 మ్యాచ్‌ల్లో 41.61 యావరేజ్, 5 సెంచరీలతో 9156 పరుగులు చేసిన కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా.. 335 మ్యాచ్‌ల్లో 6 సెంచరీలతో 8858 రన్స్ చేసిన రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక రైనా 319 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలతో 8392 రన్స్ చేశాడు.
267 మ్యాచ్‌ల్లో 264 ఇన్నింగ్స్‌లు ఆడిన ధావన్.. కోహ్లీ తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న రెండో భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ మైలురాయికి 5 పరుగుల దూరంలో ఉన్న ధావన్.. కార్తీక్ త్యాగీ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ఈ ఘనతను అందుకున్నాడు. ఇక ఓవరాల్‌గా 14వ స్థానంలో ఉన్న ధావన్ సెంచరీ లేకుండా ఈ ఫీట్ సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. షోయబ్ మాలిక్ కూడా సెంచరీ లేకుండా ఈ మైలురాయిని అధిగమించాడు. భారత్ తరఫున 61 టీ20ల్లో 1588 పరుగులు చేసిన గబ్బర్.. 166 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 4785 రన్స్ చేశాడు.
ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ 13 పరుగులతో అద్భుత విజయాన్నందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), శ్రేయస్ అయ్యర్(43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీయగా.. జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు పడగొట్టాడు. కార్తీక్ త్యాగి, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీశారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేసింది. బెన్ స్టోక్స్(35 బంతుల్లో 6 ఫోర్లతో 41), రాబిన్ ఊతప్ప(27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో తుషార్, నోర్జ్ రెండేసి వికెట్లు తీయగా.. రబడా, అశ్విన్, అక్సర్ పటేల్ తలో వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications