న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెపాక్‌లో CSK vs MI: యావరేజిలో ధోనినే టాప్, ముంబై గెలిచేనా?

IPL 2019: Key Battles – Chennai Super Kings vs Mumbai Indians

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి చెపాక్‌లోని ఎమ్ఎ చిదంబరం స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించి సీఎస్‌కే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... ముంబై ఇండియన్స్ 12 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ సీజన్‌ను సీఎస్‌కే ఘనంగా ప్రారంభించింది. మొదటి 8 మ్యాచ్‌ల్లో ఏడింట గెలిచింది. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. మంగళవారం సొంతగడ్డపై సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచి ఫామ్‌లోకి వచ్చింది. ఈ సీజన్ ఆరంభం నుంచీ సీఎస్‌కే కెప్టెన్ ధోని అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

ముంబై గెలిస్తేనే ప్లేఆఫ్‌ అవకాశాలు మెరుగు

ముంబై గెలిస్తేనే ప్లేఆఫ్‌ అవకాశాలు మెరుగు

ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌‌లో విజయం సాధించి ప్లేఆఫ్‌ అవకాశాలను మరింతగా మెరుగు పర్చుకోవాలని చెన్నై చూస్తుండగా... ముంబై మాత్రం ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో ఎగబాకాలని చూస్తోంది. దీంతో శుక్రవారం నాటి మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో ధోని విజృంభించే అవకాశం లేకపోలేదు.

ధోని యావరేజి ఎవరికీ లేదు

ధోని యావరేజి ఎవరికీ లేదు

ఈ సీజన్‌లో ధోనికి ఉన్న యావరేజి మరే ఇతర ఆటగాడికి లేదు. ఈ సీజన్‌లో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌లోనూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ధోని మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో ధోని కంటే ముందు ఆండ్రీ రసెల్‌ 392 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా పంత్‌ 336 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

314 పరుగులతో మూడో స్థానంలో

314 పరుగులతో మూడో స్థానంలో

ధోని 314 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. మరోవైపు ఈ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్న సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ కన్నా ధోని యావరేజే మెరుగ్గా ఉండటం విశేషం. ఇప్పటివరకు ఏడు ఇన్నింగ్స్‌లో 314 పరుగులతో 104.66 యావరేజిని కలిగి ఉన్నాడు. వార్నర్‌ పది ఇన్నింగ్స్‌లో 574 పరుగులతో 71.75 యావరేజిని కలిగి ఉన్నాడు.

హెడ్ టు హెడ్ రికార్డు

హెడ్ టు హెడ్ రికార్డు

Total: 27

CSK: 12

MI: 15

ముంబై ఇండియన్స్:

ముంబై ఇండియన్స్:

క్వింటన్ డీకాక్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ(కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, బెన్ కటింగ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, మయాంక్ మార్కండే, రాహుల్ చాహర్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా

చెన్నై సూపర్ కింగ్స్

షేన్ వాట్సన్, డుప్లెసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్

Story first published: Friday, April 26, 2019, 18:40 [IST]
Other articles published on Apr 26, 2019
Read in English:
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X