న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భవిష్యత్తు క్రికెట్‌కు ప్రమాదకరం అంటూ.. ఐపీఎల్‌పై అక్కసు వెళ్లగక్కిన ఇంజమామ్

Inzamam-ul-Haq Says If the IPL happens instead of the T20 World Cup, questions will be raised

కరాచీ: భారత క్యాష్ రిచ్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టీ20పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ తన అక్కసును వెళ్లగక్కాడు. ఇప్పటికే ఐపీఎల్ జరగవద్దని ఆసియా కప్, పీఎస్ఎల్ పేరిట పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కుతంత్రాలు చేస్తుండగా.. టీ20 లీగ్‌లు భవిష్యత్తు క్రికెట్‌కు ప్రమాదకరమని ఇంజమామ్ కొత్తరాగాన్ని అందుకున్నాడు. ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే ఆ విండోలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఐపీఎల్ 2020 సీజన్ నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్న విషయం తెలిసిందే.

ఆసీస్‌కు చిక్కులు తప్పవు..

ఆసీస్‌కు చిక్కులు తప్పవు..

అయితే టీ20 ప్రపంచకప్ వాయిదా వేసి ఆ విండోలో ఐపీఎల్ నిర్వహిస్తే ఆస్ట్రేలియాకు చిక్కులు తప్పవని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ హెచ్చరించాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)ని శాసించే భారత్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయన్న ఇంజమామ్.. అలా జరిగితే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయన్నాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన ఈ పాక్ మాజీ కెప్టెన్.. అంతర్జాతీయ టోర్నీలను పక్కన పెట్టి దేశవాళీ లీగ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఐసీసీని ప్రశ్నించాడు. తద్వారా యువతరానికి ఇస్తున్న సందేశం ఏంటని నిలదీశాడు.

అనేక ప్రశ్నలు..

అనేక ప్రశ్నలు..

‘ఐపీఎల్, భారత్-ఆస్ట్రేలియా సిరీస్ షెడ్యూల్‌కు క్లాష్ అవుతందనే నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేస్తున్నారనే రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక ఆస్ట్రేలియా కూడా ప్రస్తుత కరోనా నేపథ్యంలో మెగాటోర్నీ నిర్వహించలేమంటే ఐసీసీ కూడా ఆమోదిస్తుంది. కానీ ఇదే సమయంలో ఓ ప్రైవేట్ లీగ్ జరిగితే మాత్రం అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. భారత క్రికెట్ బోర్డు 8 జట్లను సమన్వయం చేస్తూ టోర్నీని నిర్వహించినప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియాకు సాధ్యం కాదా? అనే ప్రశ్న వస్తుంది.'అని ఈ పాక్ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు.

ప్రాధాన్యత దేనికి..

ప్రాధాన్యత దేనికి..

అంతర్జాతీయ టోర్నీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇంజమామ్ ఐసీసీకి సూచించాడు. లేకుంటే యువ ఆటగాళ్లంతా దేశవాళీ లీగ్‌లకే ఆకర్షితులయ్యే ప్రమాదం ఉందని, ఇది క్రికెట్‌కు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆందోళన వ్యక్తం చేశాడు. ‘టీ20 లీగ్స్ కన్నా అంతర్జాతీయ క్రికెట్‌కే ప్రాధాన్యత ఇవ్వండి. లేకుంటే యువ ఆటగాళ్లంతా అంతర్జాతీయ మ్యాచ్‌లను కాదని టీ20 లీగ్‌లపై దృష్టిపెట్టే ప్రమాదం ఉంది. ఓ దేశవాళీ లీగ్ కోసం ఆసియా కప్ షెడ్యూల్‌పై అభ్యంతరం వ్యక్తమైందనే సమాచారం నా దృష్టికి వచ్చింది.'అని ఇంజమామ్ ఐపీఎల్ నిర్వహణపై పరోక్షవ్యాఖ్యలు చేశాడు.

ఐసీసీ ప్రకటనే...

ఐసీసీ ప్రకటనే...

ఇక మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్.. కరోనా పుణ్యమా ఏప్రిల్ 15కు అనంతరం నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దేశంలో అన్‌లాక్ కొనసాగుతుండటంతో.. లీగ్ నిర్వహణపై బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్‌ నిర్వహించేందుకు సిద్ధమేనని గంగూలీ సంకేతమిచ్చాడు. అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాల్ని పరిశీలిస్తున్నామని గత నెలలోనే పేర్కొన్నాడు. అవసరమైతే విదేశాల్లో కూడా నిర్వహిస్తామన్నారు.

ధోనీ కెప్టెన్సీని మాటల్లో వర్ణించలేం.. చిన్న పట్టణం నుంచి వచ్చి ఎంతో సాధించాడు: పాక్ మాజీ క్రికెటర్

Story first published: Monday, July 6, 2020, 20:22 [IST]
Other articles published on Jul 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X