న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ కెప్టెన్సీని మాటల్లో వర్ణించలేం.. చిన్న పట్టణం నుంచి వచ్చి ఎంతో సాధించాడు: పాక్ మాజీ క్రికెటర్

Former Pakistan pacer Waqar Younis lavishes praise on former India captain MS Dhoni

కరాచీ: భారత మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీపై పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ వఖార్ యూనిస్ ప్రశంసల జల్లు కురిపించాడు. రాంచీలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన అతను.. కెప్టెన్‌గా భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన తీరు అమోఘమని ఈ పాక్ మాజీ పేసర్ కొనియాడాడు. టీమిండియాను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి గంగూలీ ప్రయత్నిస్తే.. ధోనీ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాడన్నాడు. జట్టు కోసం, అలాగే కుటుంబం కోసం అతనెంతో చేశాడని మెచ్చుకున్నాడు.

భారత కెప్టెన్లపై ప్రశంసల జల్లు..

భారత కెప్టెన్లపై ప్రశంసల జల్లు..

తాజాగా ట్విటర్ వేదికగా అభిమానులతో చిట్‌చాట్ చేసిన వఖార్.. భారత క్రికెట్ సారథుల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నాడు. గంగూలీ ఉత్తమ సారథి అని, భారత జట్టులో నూతనోత్తేజాన్ని తీసుకొచ్చి వారిలో విజయకాంక్షను రగిలించాడని కొనియాడాడు. ఈ నేపథ్యంలోనే ధోనీ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి టీమిండియా స్వరూపాన్ని మార్చేశాడన్నాడు. ఇప్పుడు కోహ్లీ కూడా మహీ వేసిన బాటలోనే జట్టును ముందుకు నడిపిస్తున్నాడని పేర్కొన్నాడు.

మాములు విషయం కాదు..

మాములు విషయం కాదు..

‘భారత క్రికెట్‌ జర్నీలో కొత్త పోకడలకు సౌరవ్ గంగూలీ బీజం వేయగా.. ధోనీ ఆ ప్రయాణాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. అతను రెండు ప్రపంచకప్‌లు గెలిచిన చాంపియన్. తన కోసం, జట్టు కోసం, కుటుంబం కోసం మహీ ఎంతో చేశాడు. ధోనీ ఎంత గొప్ప ఆటగాడంటే.. భారత జట్టును అతను నడిపించిన విధానాన్ని మాటల్లో వర్ణించలేం. అతను మంచి క్రికెటరే కాకుండా పరిస్థితులను అర్థం చేసుకునే గొప్ప సారథి. అలాగే అద్భతమైన వ్యక్తి. చిన్న పట్టణం నుంచి వచ్చి ఎంతో పైకి ఎదిగాడు. భారత్‌ లాంటి పెద్ద దేశంలో జట్టును సుదీర్ఘకాలం నడిపించడం వెలకట్టలేనిది' అని వకార్‌ పొగడ్తలతో ముంచెత్తాడు.

కోహ్లీకి సాటిలేరు..

కోహ్లీకి సాటిలేరు..

ఇక ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. అతను అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్నాడని, మరీ ముఖ్యంగా తన ఫిట్‌నెస్‌తో ప్రపంచ క్రికెట్‌ దృష్టిని ఆకర్షిస్తున్నాడని పేర్కొన్నాడు. ‘ప్రస్తుత క్రికెట్‌లో ఎలాంటి ఫార్మాట్‌లోనైనా కోహ్లీ తన నాయకత్వంతో అదరగొడుతున్నాడు. ఇక ఫిట్‌నెస్‌ విషయంలో ఎవరూ అతనికి పోటీ రాలేరు. అతనే అత్యుత్తమ ఆటగాడని నిరూపించుకోవాలని పరితపిస్తాడు'అని వకార్‌ ప్రశంసించాడు.

Story first published: Monday, July 6, 2020, 19:35 [IST]
Other articles published on Jul 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X