న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Indian Team for SA: కవలవరపెడుతున్న గాయాల బెడద.. టీ20 సిరీస్ నుంచి మరో స్టార్ పేసర్ ఔట్!

 Indian Squad For RSA: Harshal Patel Out Of Playing 11 Due To Injury

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఐర్లాండ్‌, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉండగా.. ఇంగ్లండ్‌లో గతేడాది మిగిలిపోయిన చివరి టెస్ట్‌తో పాటు పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌లకు ముందు టీమిండియాను గాయాల బెడద వేదిస్తోంది. రోజు రోజుకి గాయాల బారిన పడిన టీమిండియా ఆటగాళ్ల సంఖ్య పెరుగుతోంది. తాజాగా యువ పేసర్ హర్షల్ పటేల సైతం ఇంజ్యూరీ ప్లేయర్ల జాబితాలో చేరాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఆర్‌సీబీ బౌలర్ చేతికి గాయమైంది. దాంతో ఆ మ్యాచ్‌లో అతను ఒకే ఒక్క ఓవర్ వేసాడు.

డౌట్ మాత్రమే..

డౌట్ మాత్రమే..

హర్షల్ పటేల్ గాయంపై స్పష్టత లేదని, ఆర్‌సీబీ టీమ్‌తో తాము టచ్‌లో ఉన్నామని సెలెక్షన్ కమిటీలో ఓ సభ్యుడు ఇన్‌సైడ్ స్పోర్ట్స్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌కు తెలిపాడు.'ఆర్‌సీబీ మెడికల్ టీమ్‌తో మేం టచ్‌లో ఉన్నాం. రెండు, మూడు రోజుల్లో అతని గాయానికి సంబంధించిన అప్‌డేట్ మాకు అందనుంది. ప్రస్తుతం అతను సౌతాఫ్రికాతో టీ20 సీరిస్ ఆడటం సందేహంగా మారింది. అంతే తప్పా పూర్తిగా తప్పుకోలేదు. అతని రికవరీని బట్టి మేం తుది నిర్ణయం తీసుకుంటాం'అని సదరు అధికారి పేర్కొన్నాడు.

4 వారాల సమయం..

4 వారాల సమయం..

హర్షల్ పటేల్‌కు చేతి వేళ్ల మధ్య గాయమైంది. సాధారణంగా ఈ గాయం నుంచి కోలుకోవడానికి 4 వారాల టైమ్ పడుతుంది. అది కూడా ఎన్ని కుట్లు పడ్డాయనేదానిపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ హర్షల్ పటేల్ గాయంపై క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే అతను సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడటం సందేహంగా మారింది. అతను త్వరలోనే ఎన్‌సీఏలో రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దీపక్ చాహర్ (తొడ కండరాల గాయం), రవీంద్ర జడేజా (పక్కటెముకల్లో గాయం), సూర్యకుమార్ (మజిల్ ఇంజ్యూరీ), రహానే (తొడ కండరాల) గాయాలతో బాధపడుతున్నారు. పృథ్వీ షా ఇటీవలే టైఫాయిడ్ నుంచి కోలుకోని అన్ ఫిట్‌గా ఉన్నాడు.

ఫిట్‌నెస్ టెస్ట్ పాసైతేనే..

ఫిట్‌నెస్ టెస్ట్ పాసైతేనే..

ఇక పృథ్వీ షా అనారోగ్యం నుంచి కోలుకున్నా.. అతను టీమిండియా ఫిట్‌నెస్ ప్రమాణాలను అందుకోవాల్సిందేనని సదరు సెలెక్షన్ కమిటీ మెంబర్ స్పష్టం చేశాడు. 'పృథ్వీ షాకు అతని ఫ్రాంచైజీ ఎలాంటి ఫిట్‌నెస్ టెస్ట్ పెట్టిందో మాకు తెలియదు. కానీ టీమిండియా ఫిట్‌నెస్ ప్రమాణాలను అతను అందుకోవాలి. టెస్ట్ పాసైతే జట్టులోకి వస్తాడు. లేదంటే అతను క్లియర్ చేసేవరకు పక్కనపెట్టాల్సి వస్తది'అని చెప్పుకొచ్చాడు.

మే 23న సమావేశం..

మే 23న సమావేశం..

అయితే టీమిండియా ఆడే అప్‌కమింగ్ మూడు సిరీస్‌ల కోసం రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసేందుకు చేతన్ శర్మ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ మే 23న సమావేశం కానుంది. మే 25న జట్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సెలెక్షన్‌కు ముందు సెలెక్షన్ కమిటీ కెప్టెన్ రోహిత్ శర్మతో ప్రత్యేకంగా సమావేశం కానుంది. సీనియర్ ఆటగాళ్ల విశ్రాంతి గురించి ప్రత్యేకంగా చర్చించనుంది. రెగ్యూలర్ ఆటగాళ్లను ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేసి.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.

సౌతాఫ్రికాతో జూన్ 9 నుంచి 19 వరకు జరిగే 5 టీ20ల సిరీస్‌కు ఐపీఎల్‌లో సత్తా చాటిన ఆటగాళ్లు, అనుభవం కలిగిన ప్లేయర్లతో కూడిన జట్టును ఎంపిక చేయాలనుకుంటుంది. తొలి మ్యాచ్‌కు ముందు ఈ సిరీస్‌కు ఎంపికైన ఆటగాళ్లంతా ఎన్‌సీఏలో ఏర్పాటు చేసిన క్యాంప్‌కు జూన్ 4న హాజరు కావాల్సి ఉంటుంది.

Story first published: Saturday, May 21, 2022, 13:58 [IST]
Other articles published on May 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X