న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా క్రికెటర్లు 150 రోజులు ఫ్యామిలీకి దూరం.. కారణం ఇదే!!

Indian players likely to stay away from family for over 150 days after the start of IPL 2020

ముంబై: కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా నాలుగు నెలలకు పైగా ఇంట్లోనే గడిపిన భారత క్రికెటర్లు ఇకపై ఫుల్ బీజీ కానున్నారు. వారి పునరాగమనం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 రూపంలో జరగనుంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ఐపీఎల్‌ ప్రారంభం కానుంది. ఆపై ఆస్ట్రేలియా టూర్‌ ఉంది. ఐపీఎల్ 2020 సీజన్ కోసం ఆగస్టు మూడో వారంలో భారత్ నుంచి బయల్దేరనున్న క్రికెటర్లు.. ఆ తర్వాత అక్కడి నుంచే ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనున్నారు. ఇక జనవరి మూడో వారం తర్వాతే భారత్ గడ్డపై అడుగుపెట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఐదు నెలలు ఫ్యామిలీకి దూరంగా ఉండనున్నారు.

 నెల రోజుల ముందే ఐపీఎల్‌ క్యాంప్ కోసం:

నెల రోజుల ముందే ఐపీఎల్‌ క్యాంప్ కోసం:

ఐపీఎల్‌ 2020 ప్రణాళికలో భాగంగా క్రికెటర్లు ఆగష్టు ఆరంభంలోనే అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో జరిగే జాతీయ శిబిరంలో చేరాలని భావిస్తున్నారు. ఆ తర్వాత వారు తమ ఫ్రాంచైజీలతో ఐపీఎల్‌ క్యాంప్ కోసం యుఎఈకి వెళతారు. దాదాపు నెల రోజుల ముందే అంటే.. ఆగస్టు 20 నాటికి క్రికెటర్లు యూఏఈకి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ క్వారంటైన్‌లో ఉంచి ఆటగాళ్లను మ్యాచ్‌లకు సిద్ధం చేస్తారు. ఇక కొన్ని ఫ్రాంచైజీలు ఆగష్టు మొదటి, రెండో వారంలోనే దుబాయ్‌ వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నాయి.

 53 రోజులు ఐపీఎల్:

53 రోజులు ఐపీఎల్:

ఐపీఎల్ 2020 సీజన్‌ని 51 రోజుల విండోలో మొత్తం 60 మ్యాచ్‌లతో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన బీసీసీఐ.. పూర్తి స్థాయిలో షెడ్యూల్‌పై కసరత్తు చేస్తోంది. మెుదట్లో టోర్నీ వ్యవధి 51 రోజులు నిర్ణయించారు. కానీ దాన్ని రెండు రోజులు పొడగించి 53 రోజుల పాటు టోర్నీని నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 2న జరిగే ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో తేదీలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ముందుగా నవంబర్ 8న ఫైనల్ మ్యాచ్ అనుకున్నప్పటీకి దాన్ని నవంబర్ 10కి మార్చేందుకు బోర్డు సన్నహాలు చేస్తోంది.

 68 రోజులు ఆస్ట్రేలియాలో:

68 రోజులు ఆస్ట్రేలియాలో:

నవంబర్​ 10న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ జరిపితే.. అక్కడ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లొచ్చని బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనున్న భారత్ జట్టు అక్కడ తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తోంది. డిసెంబర్‌ 3 నుంచి 7 వరకు టెస్ట్‌ సిరీస్‌, జనవరి 17 వరకు వన్డే సిరీస్‌ నిర్వహించాలని భావిస్తున్నారు. మొత్తంగా దాదాపు 68 రోజులు భారత క్రికెటర్లు ఆస్ట్రేలియాలోనే గడపనున్నారు. ఇటు ఐపీఎల్‌, అటు ఆస్ట్రేలియా టూర్ పూర్తి బయో-సెక్యూర్ వాతావరణంలో నిర్వహించబోతుండటంతో‌ భారత క్రికెటర్లు దాదాపు 5 నెలలు ఫ్యామిలీలకు దూరంగా ఉండనున్నారు.

 మ్యాచ్‌ల మధ్య ఏం చేస్తారంటే:

మ్యాచ్‌ల మధ్య ఏం చేస్తారంటే:

సాధారణంగా ఐపీఎల్‌లో మ్యాచ్‌ ముగిశాక ఆయా జట్లు మరో వేదిక వద్దకు చేరుకుంటాయి. దీంతో విమానాల్లో ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. సాధన చేశాక ఖాళీ సమయంలో విశ్రాంతి తీసుకుంటారు. లేదంటే బయటకు వెళ్తారు. షాపింగ్‌ చేయడం, ఉద్యానవనాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంటారు. ప్రస్తుత కరోనా కాలంలో ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. మ్యాచ్‌ లేని రోజుల్లో ఆటగాళ్లు బయటకు వెళ్లేందుకు అవకాశం లేదు. అందుకోసమే ఖాళీ సమయంలో క్రికెటర్లతో ఏం చేయిస్తే బాగుంటుంది అంటూ ఫ్రాంచైజీలు ఆలోచిస్తున్నాయట. క్రికెటర్లతో కలసి వీడియో గేమ్‌లు ఆడించాలన్నది యాజమాన్యాల ప్రాథమిక ప్రణాళికగా తెలుస్తోంది.

వీరేంద్ర సెహ్వాగ్‌కి అరుదైన గౌరవం.. సెలక్షన్ ఫ్యానల్‌లో చోటు!!

Story first published: Saturday, August 1, 2020, 12:16 [IST]
Other articles published on Aug 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X