న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్.. 17 సంవత్సరాల రికార్డును భారత్ కొనసాగించేనా?

India vs West Indies: India look to maintain 17-year unbeaten streak in Test cricket against West Indies

ఆంటిగ్వా: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లు కైవసం చేసుకున్న భారత్.. టెస్టు సిరీస్‌నూ సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఈ టెస్ట్ సిరీస్ గెలిస్తే వెస్టిండీస్‌లో రెండు టెస్ట్ సిరీస్‌లు గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలవనున్నాడు. అంతేకాకుండా ప్రస్తుత పర్యటనలో 17 ఏళ్ల భారత అజేయ రికార్డును కూడా కొనసాగించాలని కోహ్లీ చూస్తున్నాడు. భారత్ 2002 నుండి వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లను కోల్పోలేదు. 17 ఏళ్ల పాటు పదిలంగా ఉన్న ఆ రికార్డును అలానే కొనసాగించాలని కోహ్లీ ఆరాటపడుతున్నాడు.

<strong>10వ స్థానంలో తెలుగు టైటాన్స్.. ఇప్పటికైనా పుంజుకునేనా?</strong>10వ స్థానంలో తెలుగు టైటాన్స్.. ఇప్పటికైనా పుంజుకునేనా?

 1971లో తొలి టెస్ట్ సిరీస్ విజయం:

1971లో తొలి టెస్ట్ సిరీస్ విజయం:

2002 నుండి వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను కోల్పోనప్పటికీ హెడ్-టు-హెడ్ సిరీస్ రికార్డులలో భారత్ వెనుకబడి ఉంది. 1948-49 నుండి 23 టెస్ట్ సిరీస్‌లలో ఇరుజట్లు పోటీపడ్డాయి. ఇందులో విండీస్ 12 సార్లు, భారత్ 9 సార్లు గెలిచింది. అజిత్ వాడేకర్ నేతృత్వంలోని భారత జట్టు 1971లో తొలి టెస్ట్ సిరీస్ విజయంను అందుకుంది. అది కరేబియన్‌లో భారతదేశం సాధించిన తొలి టెస్ట్ విజయం. 5 టెస్ట్ సిరీస్‌లో రెండవ టెస్టును భారత్ గెలవగా.. మిగతా మ్యాచ్‌లన్నీ డ్రాగా ముగిసాయి.

35 సంవత్సరాల తర్వాత:

35 సంవత్సరాల తర్వాత:

వెస్టిండీస్‌లో మళ్లీ టెస్ట్ సిరీస్ గెలవడానికి భారత్‌కు 35 సంవత్సరాలు పట్టింది. కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో 4 టెస్టుల సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో భారత్ గెలిచి.. సిరీస్ గెలుచుకుంది. హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే జట్టుకు విజయాన్ని అందించారు. 2011లో ధోనీ సేన వెస్టిండీస్‌లో పర్యటించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో గెలుచుకుంది. 2016లో విరాట్ సేన మళ్లీ అక్కడ సిరీస్ నెగ్గాడు. ఇపుడు గెలిస్తే రికార్డే.

ధోనీ రికార్డుకు చేరువలో:

ధోనీ రికార్డుకు చేరువలో:

టెస్టుల్లో భారత్‌కు అత్యధిక విజయాలు సాధించిపెట్టిన ధోనీ (60 మ్యాచ్‌ల్లో 27) రికార్డుకు కోహ్లీ (46 మ్యాచ్‌ల్లో 26) చేరువయ్యాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో భారత్‌ గెలిస్తే.. ధోనీని కోహ్లీ సమం చేస్తాడు. ఇక రెండో టెస్ట్ కూడా గెలిస్తే రికార్డుల్లోకి ఎక్కుతాడు. ఈ జాబితాలో సౌరభ్‌ గంగూలీ (49 మ్యాచ్‌ల్లో 21) మూడో స్థానంలో ఉన్నాడు.

రేపే ఫలితాలు: ఇంటర్వ్యూలకు హాజరైన బంగర్‌, శ్రీధర్‌, అరుణ్‌, జాంటీ రోడ్స్‌

మరో సెంచరీ సాధిస్తే:

మరో సెంచరీ సాధిస్తే:

కెప్టెన్‌ అయ్యాక టెస్ట్ ఫార్మాట్లో ఇప్పటికే 18 సెంచరీలు సాధించిన విరాట్‌ కోహ్లీ.. మరో సెంచరీ సాధిస్తే 19 సెంచరీలతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న రికీ పాంటింగ్‌ను అందుకోనున్నాడు. కెప్టెన్‌గా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌లో గ్రేమ్‌ స్మిత్‌ (25) అగ్రస్థానంలో ఉన్నాడు. అంతేకాదు టెస్టు విజయాలలో కూడా స్మిత్‌ (109 మ్యాచ్‌ల్లో 53 విజయాలు) అందరికంటే ముందున్నాడు.

Story first published: Wednesday, August 21, 2019, 15:37 [IST]
Other articles published on Aug 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X