న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో 11 పరుగులు చేస్తే: లారా రికార్డుకి ఎసరు పెట్టిన క్రిస్ గేల్

India vs West Indies: Chris Gayle on the verge of breaking Brian Lara’s two massive records in Guyana ODI

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ప్రస్తుత వరల్డ్ టీ20 ఛాంపియన్స్‌గా ఉన్న వెస్టిండిస్‌ను ఆరు టీ20ల్లో వరుసగా ఓడించిన ఘనతను టీమిండియా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఫోకస్ వన్డే సిరిస్‌కు మళ్లింది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి వన్డేలో గుయానా వేదికగా గురువారం ప్రారంభం కానుంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు వన్డే సిరిస్‌పై కన్నేసింది. ప్రపంచకప్‌ తర్వాత జరిగిన తొలి టీ20 సిరీస్‌లో అంచనాల్ని మించి రాణించిన టీమిండియా... అదే ఉత్సాహంలో కరేబియన్ గడ్డపై వన్డేల్లో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. టీ20 సిరిస్‌కు దూరమైన వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ వన్డే సిరిస్‌కు అందుబాటులోకి వచ్చాడు.

<strong>గౌరవం భావిస్తున్నా: కోహ్లీతో ఫొటో దిగేందుకు వివ్ రిచర్డ్స్ ఆసక్తి </strong>గౌరవం భావిస్తున్నా: కోహ్లీతో ఫొటో దిగేందుకు వివ్ రిచర్డ్స్ ఆసక్తి

ఈ సిరిస్‌లో ప్రత్యేక ఆకర్షణగా గేల్

ఈ సిరిస్‌లో ప్రత్యేక ఆకర్షణగా గేల్

దీంతో ఈ సిరిస్‌లో గేల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. వెస్టిండిస్ తరుపున ఇప్పటివరకు 295 వన్డేలు ఆడిన యూనివర్స్ బాస్ ఈ ఫార్మాట్‌లో విండిస్ మాజీ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా రికార్డుని బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. గుయనా వేదికగా జరగనున్న తొలి వన్డేలో క్రిస్ గేల్ మరో 11 పరుగులు చేస్తే విండిస్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.

మళ్లీ మొదటికొచ్చిన No. 4 సమస్య: కేఎల్ రాహుల్ ఖాయమైనట్టేనా?

10348 పరుగులతో అగ్రస్థానంలో లారా

10348 పరుగులతో అగ్రస్థానంలో లారా

ఈ జాబితాలో బ్రియాన్ లారా 295 వన్డేల్లో 10348 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో 19 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, క్రిస్ గేల్ సైతం 295 వన్డేల్లో 10338 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇందులో 25 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ గనుక 111 పరుగులు చేస్తే మరో రికార్డుని తన ఖాతాలో వేసుకుంటాడు.

వన్డేల్లో అత్యధిక పరుగులు

వన్డేల్లో అత్యధిక పరుగులు

టీమిండియాపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వెస్టిండిస్ క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధిస్తాడు. ప్రస్తుతం క్రిస్ గేల్ 1247 పరుగులతో ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. వెస్టిండిస్ మాజీ క్రికెటర్ డెస్మండ్ హేన్స్(1357) పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో పాటు తొలి వన్డేలో క్రిస్ గేల్ మరో 67 పరుగులు చేస్తే ప్రొవిడెన్స్ స్టేడియం అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ గుర్తింపు పొందుతాడు.

రోహిత్ Vs గేల్: ఇనిస్టాగ్రామ్‌లో ఫోటో, కొత్త విషయం వెలుగులోకి!

మూడో స్థానంలో క్రిస్ గేల్

మూడో స్థానంలో క్రిస్ గేల్

ప్రస్తుతం క్రిస్ గేల్(248) పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, తొలి వన్డేకు ముందు వెస్టిండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ మాట్లాడుతూ క్రిస్ గేల్ తిరిగి జట్టులోకి రావడంపై సంతోషం వ్యక్తం చేశాడు. క్రిస్ గేల్ అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు. 39 ఏళ్ల క్రిస్ గేల్‌కు బహుశా ఇదే ఆఖరి టోర్నీ కావొచ్చు.

ఈ సిరిస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

ఈ సిరిస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు క్రిస్ గేల్ వీడ్కోలు పలుకుతానని ప్రకటించాడు. అయితే, తన నిర్ణయాన్ని మార్చుకుని స్వదేశంలో టీమిండియాతో జరగబోయే వన్డే సిరిస్ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతానని చెప్పాడు. దీంతో ఈ సిరీస్‌తో గేల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు.

Story first published: Thursday, August 8, 2019, 15:00 [IST]
Other articles published on Aug 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X