న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పుణెలో మూడో వన్డే: టాస్ గెలిచిన భారత్, మూడు మార్పులతో బరిలోకి

India vs West Indies, 3rd ODI in Pune: Kohli Wins the Toss, India to Bowl First With New Look Pace Attack

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య శనివారం మూడో వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు వికెట్ అనుకూలంగా ఉంద‌ని, చేజింగ్‌కు ఈ పిచ్ అనుకూలంగా ఉంటుంద‌ని టాస్ అనంతరం కోహ్లీ తెలిపాడు.

మూడు మార్పుల‌తో బ‌రిలోకి దిగిన టీమిండియా

ఈ మ్యాచ్‌లో భారత జట్టు మూడు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. ఉమేశ్ యాద‌వ్‌, ష‌మీ, జ‌డేజాల స్థానంలో భువ‌నేశ్వ‌ర్‌, బుమ్రాతో పాటు ఖ‌లీల్ అహ్మాద్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ముగ్గురు పేస‌ర్ల‌తో భార‌త్ ఈ మ్యాచ్‌లో బ‌రిలోకి దిగుతోంది. మరోవైపు తాము టాస్ గెలిస్తే, మొద‌ట బౌలింగ్‌ చేసేవాళ్ల‌మ‌ని విండీస్ కెప్టెన్ హోల్ట‌ర్ తెలిపాడు.

కోహ్లీ మనిషి కాదు, నిజంగా పరుగుల యంత్రమే: హర్భజన్

ఒక మార్పుతో బరిలోకి విండిస్ జట్టు

ఒక మార్పుతో బరిలోకి విండిస్ జట్టు

విండీస్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. లెగ్ స్పిన్నర్ దేవేంద్ర బిషూ స్థానంలో ఆల్‌రౌండర్ ఫాబియన్ అలెన్ వన్డే ఆరంగేట్రం చేస్తున్నాడు. ఇప్పటికే సిరీస్‌లో 1-0 ఆధిక్యంతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి తేడాను మరింత పెంచాలని భావిస్తుండగా, విండీస్ మాత్రం సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది.

ఇప్పటికే 1-0 ఆధిక్యంలో టీమిండియా

ఈ సిరిస్‌లో జరిగిన తొలి వన్డేలో భారీ లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించిన టీమిండియా.. అచ్చొచ్చిన విశాఖలో జరిగిన రెండో మ్యాచ్‌ను టైగా ముగించింది. దీంతో మూడో వన్డేలో టీమిండియా పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ భారత బౌలింగ్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోవడంతో భువీ, బుమ్రాను జట్టులోకి తీసుకున్నారు.

జట్ల వివరాలు:

భారత్‌: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), అంబటి రాయుడు, రిషభ్‌ పంత్‌, ఎంఎస్‌ ధోనీ, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, యజ్వేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, జస్ర్పీత్‌ బుమ్రా.

వెస్టిండిస్: హేమరాజ్‌, కీరన్‌ పావెల్‌, షాయ్‌ హోప్‌, హెట్‌మయెర్‌, మార్లన్‌ శామ్యూల్స్‌, రోవ్‌మన్‌ పావెల్‌, హోల్డర్‌ (కెప్టెన్‌), ఆష్లే నర్స్‌, ఫాబియన్ అలెన్, మెక్‌కాయ్‌, కీమర్‌ రోచ్‌.

1
44268
Story first published: Saturday, October 27, 2018, 13:38 [IST]
Other articles published on Oct 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X