న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ మనిషి కాదు, నిజంగా పరుగుల యంత్రమే: హర్భజన్

India Vs West Indies 2018, 3rd ODI : Not Easy Being Virat Kohli : Harbhajan Singh
Not Easy Being Virat Kohli, Says Harbhajan Singh

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మనిషి కాదని, అతడు నిజంగానే పరుగుల యంత్రమేనని వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. క్రికెట్ పట్ల విరాట్ కోహ్లీ నిబద్ధత, కఠోర శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువేనని కోహ్లీ అన్నాడు. విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో వన్డేల్లో అత్యంత వేగవంతంగా 10 వేల పరుగుల మైలురాయిని కోహ్లీ అందుకున్న సంగతి తెలిసిందే.

ధోనిపై వేటు, కోహ్లీకి విశ్రాంతి, కెప్టెన్‌గా రోహిత్: టీ20 క్రికెట్‌ కెరీర్‌ ముగిసినట్లేనా? ధోనిపై వేటు, కోహ్లీకి విశ్రాంతి, కెప్టెన్‌గా రోహిత్: టీ20 క్రికెట్‌ కెరీర్‌ ముగిసినట్లేనా?

కోహ్లీ అంకితభావానికి, ఆటతీరుకు ఎవరైనా వందనం చేయాల్సిందేనని తాజాగా ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో హర్భజన్ సింగ్ చెప్పాడు. ఈ మధ్య కాలంలో తాను చూసి అత్యుత్తమ క్రికెటర్ కోహ్లీయే అని కితాబిచ్చాడు. దానంలో దిగిన ప్రతిసారి కోహ్లీ అద్భుతాలు సృష్టిస్తున్నాడని భజ్జీ తెలిపాడు.

"అంచనాలను అందుకుని రాణించే అరుదైన ఆటగాళ్లలో కోహ్లీ ఒకడు. విరాట్ కోహ్లీలా ఆటడం మరో ఆటగాడికి సాధ్యం కాదన్నాడు. జట్టు భారాన్ని తన భుజాలపై మోస్తున్నాడు. చాలా మంది దిగ్గజాలతో క్రికెట్ ఆడాననీ, ప్రస్తుత తరంలో మాత్రం కోహ్లీనే నెంబర్ వన్" అని హర్భజన్ ప్రశంసల వర్షం కురిపించాడు.

కాగా, ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో శుక్రవారం మూడో వన్డే జరగనుంది. ఈ సిరిస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు వన్డేల్లో టీమిండియా తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో విజయం సాధించగా... రెండో వన్డే టైగా ముగిసిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, October 27, 2018, 12:22 [IST]
Other articles published on Oct 27, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X