కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడంతో..
భారత్ 75 స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భారత్ vs రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం భారత క్రికెట్ బోర్డుకు లేఖ రాసినట్లు కూడా వార్తలు వచ్చాయి. బీసీసీఐ మాత్రం ఈ మ్యాచ్ నిర్వహించడం కష్టమని, భారత్‌తో పాటు మిగతా అంతర్జాతీయ జట్లు బీజీ షెడ్యూల్‌తో ఆడుతున్నాయని తెలిపినట్లు సమాచారం.

బిజీ షె2డ్యూల్ కారణంగా..
ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర క్రికెట్ బోర్డులు బీసీసీఐ విన్నపాన్ని పట్టించుకోవని, వారిని ఒప్పించడం కష్టమని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆటగాళ్లతో కాకుండా మాజీ క్రికెటర్లతో ఈ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ భావించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్‌సీ) ప్రారంభం కావడానికి ఒక్క రోజు ముందే భారత్ vs రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇక భారత జట్టులో గంగూలీ తో పాటు వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాలు ఆడనున్నారు. వీళ్లంతా గతంలో గంగూలీ సారథ్యంలో భారత జట్టుకు ఆడినవారే కావడం విశేషం.


జట్ల వివరాలు :
భారత్ : సౌరవ్ గంగూలీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థీవ్ పటేల్ (వికెట్ కీపర్), స్టువర్ట్ బిన్నీ, శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా (వికెట్ కీపర్), అశోక్ దిండా, ప్రజ్జాన్ ఓజా, అజయ్ జడేజా, ఆర్పీ సింగ్, జోగిందర్ శర్మ, రితేందర్ సింగ్ సోధి
రెస్ట్ ఆఫ్ వరల్డ్ : ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లెండి సిమన్స్, హెర్షెలీ గిబ్స్, జాక్వస్ కలిస్, సనత్ జయసూర్య, మాట్ ప్రియర్ (వికెట్ కీపర్), నాథన్ మెక్ కల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హమిల్టన్ మసకద్జ, మష్రఫీ మొర్తజా, అస్గర్ అఫ్ఘాన్, మిచెల్ జాన్సన్, బ్రెట్ లీ, కెవిన్ ఒబ్రెయిన్, దినేశ్ రామ్దిన్ (వికెట్ కీపర్)


Click it and Unblock the Notifications
