న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్సీ పోతుందని ఎన్నడు భయపడలేదు: శిఖర్ ధావన్

 India vs New Zealand: Shikhar Dhawan says I have matured as leader, can take tough decisions

వెల్లింగ్టన్: కెప్టెన్సీ బాధ్యతల నుంచి తనను తప్పిస్తారని ఎన్నడు భయపడలేదని టీమిండియా తాత్కలిక సారథి శిఖర్ ధావన్ అన్నాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు నడిపించనున్న ధావన్.. జట్టుతో కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడాడు. ఐపీఎల్ 2023 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్.. ధావన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపీఎల్ టైటిల్ గెలవడం పెద్ద కష్టమేమి కాదన్న ధావన్.. కివీస్‌తో వన్డే సిరీస్‌ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా ఎక్కువ మ్యాచ్‌లు ఆడితేనే కచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలుగుతామని వెల్లడించాడు.

 ఎక్కువ మ్యాచ్‌లు ఆడితేనే..

ఎక్కువ మ్యాచ్‌లు ఆడితేనే..

'కెప్టెన్‌గా ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే మనం కచ్చితమైన నిర్ణయాలు తీసుకొనేందుకు నమ్మకం కలుగుతుంది. ఇంతకుముందు బౌలర్‌కు ఇబ్బందిగా ఉన్నప్పటికీ అదనంగా ఓవర్‌ వేయించేవాడిని. కానీ ఇప్పుడు జట్టు అవసరాలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవడంలో పరిణితి సాధించా. నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందాలంటే జట్టును బ్యాలెన్స్‌ చేసుకుంటూ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. ఎవరైనా ఆటగాడు ఒత్తిడికి గురైతే.. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడేసి సంతోషంగా ఉండేలా చూడాలి.

 బౌలర్‌గా చికాకుగా ఉన్నప్పుడు..

బౌలర్‌గా చికాకుగా ఉన్నప్పుడు..

ఉదాహరణకు బౌలర్‌ విషయానికొస్తే.. అతడి బౌలింగ్‌ను ప్రత్యర్థులు బాదేస్తున్నారనుకోండి.. అప్పుడు సదరు బౌలర్ కాస్త కోపం మీద ఉంటాడు. అందుకే ఆ సమయంలో కాకుండా పరిస్థితి చల్లబడిన తర్వాత నెమ్మదిగా మాట్లాడాలి. ఇదంతా నాయకత్వం వహించే స్థాయిని బట్టి ఉంటుంది. ఐపీఎల్‌లో అయితే ఎక్కువ మంది అంతర్జాతీయ ఆటగాళ్లే ఉంటారు. అదే రంజీ ట్రోఫీలో అయితే మరోలా ఆటగాళ్లతో వ్యవహరించాల్సి ఉంటుంది.'అని చెప్పుకొచ్చాడు.

సహజంగా ఆడేలా..

సహజంగా ఆడేలా..

పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీపై స్పందిస్తూ.. 'గతంలో చేసిన తప్పిదాల నుంచి నేర్చుకొని మా జట్టును తీర్చిదిద్దుతా. అయితే గత ప్రదర్శనలనే తలచుకొంటూ ఉండాల్సిన అవసరం లేదు. తప్పకుండా మా సహాయక సిబ్బందితో కలిసి జట్టులో ఆటగాళ్లందరూ సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటా. అయితే వారి సహజమైన ఆటను ఆడటంతోపాటు బాధ్యతలను అర్థమయ్యేలా చెప్పడం చాలా ముఖ్యం. అందుకే రిలాక్స్‌గా ఉంచడంతోపాటు లక్ష్యం వైపు దృష్టిసారించేలా చేస్తా. ఐపీఎల్‌లో ఆడటం చాలా మందికి కల. అలాంటి డ్రీమ్‌ నెరవేర్చుకునే క్రమంలో సంతోషం తప్ప ఒత్తిడి అనేది ఉండదు. ట్రోఫీని గెలవడం మరీ కష్టమైందేమీ కాదు. అయితే అదే సమయంలో సారథ్యం పోతుందన్న ఆందోళన కూడా లేదు'అని పేర్కొన్నాడు.

Story first published: Wednesday, November 23, 2022, 20:05 [IST]
Other articles published on Nov 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X