న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత జట్టులో అతని ప్రాధాన్యతను తక్కువ అంచనా వేసారు: సునీల్ గవాస్కర్

India vs England: Sunil Gavaskar says Cheteshwar Pujara importance is underrated

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో చతేశ్వర్ పుజారా‌ ప్రాధాన్యతను చాలా తక్కువ అంచనా వేసారని, అతను టీమిండియా బ్యాటింగ్ లైనప్‌కు వెన్నుముకని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో భారత్ బ్యాటింగ్ వైఫల్యంతో మరోసారి ఈ విషయం స్పష్టమైందన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన పుజారా సెకండ్ ఇన్నింగ్స్‌లో విఫలమవడంతో భారత బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు క్యూ కట్టారని లిటిల్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ ఇన్నింగ్స్ బ్రేక్‌లో భారత బ్యాటింగ్ వైఫల్యంపై మాట్లాడిన గవాస్కర్.. పుజారా ప్రాధాన్యతకు రావాల్సిన గుర్తింపు రాలేదన్నాడు.

బలమైన పునాదీ..

బలమైన పునాదీ..

'పుజారా తన జిడ్డు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టు సహనాన్ని పరీక్షంచడమే కాకుండా భారత ఇన్నింగ్స్‌కు బలమైన పునాదీ వేస్తాడు. అతని నెమ్మదైన బ్యాటింగ్ మరో ఎండ్‌లో ఉన్న స్ట్రోక్ ప్లేయర్లకు ఎలాంటి దిగులు లేకుండా స్వేచ్చగా షాట్లు ఆడే అవకాశాన్నిస్తుంది. వరుసగా వికెట్లు కోల్పోయినా మరో ఎండ్‌లో పుజారా ఉన్నాడనే ధైర్యాన్ని ఇస్తుంది. ఇటీవల భారత్ సాధించిన విజయాలను గమనిస్తే పుజారా ప్రాధాన్యత ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది.

పుజారా వల్లే..

పుజారా వల్లే..

ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్ట్‌లో పంత్‌తో కలిసి పుజారా క్రీజులో నిలబడటంతోనే భారత్ ఓటమిని తప్పించుకొని డ్రాతో గట్టెక్కింది. బ్రిస్బేన్‌లో విజయం సాధించడానికి కూడా అతని నెమ్మదైన బ్యాటింగే కారణం. అతను క్రీజులో ఉండటంతో శుభ్‌మన్, పంత్ స్వేచ్చగా ఆడారు. కానీ ఇది గుర్తించకుండా అతని స్ట్రైక్ రేట్, పరుగుల గురించి మాట్లాడుతూ ఉంటారు. జట్టులో అతని ప్రాధాన్యతను కూడా తక్కువ అంచనా వేసారు. జట్టులో అతను చాలా కీలకమైన, విలువైన ఆటగాడు.

తక్కువ అంచనా వేయవద్దు..

తక్కువ అంచనా వేయవద్దు..

వికెట్లు త్వరగా కోల్పోయినా అతను ఇన్నింగ్స్‌ను నిలబెట్టగలడు. అదే అతన్ని ప్రత్యేక ఆటగాడిగా నిలబెట్టింది. ది వాల్, ది రాక్ ఏ పేరుతోనైనా పిలవండి. కానీ అతను భారత బ్యాటింగ్‌కు జిగురులాంటివాడనే విషయాన్ని మర్చిపోవద్దు.'అని గవాస్కర్ సూచించాడు. ఇంగ్లండ్‌తో ఫస్ట్ టెస్ట్‌లో కూడా తొలి ఇన్నింగ్స్‌లో పుజారా హాఫ్ సెంచరీ చేయడంతోనే భారత్ ఆ పరుగులైనా చేయగలిందన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో విఫలమవడంతో టపాటపా వికెట్లు కోల్పోయిందని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

ఓటమి ముంగిట భారత్..

ఓటమి ముంగిట భారత్..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో భారత్ ఓటమి ముంగిట నిలిచింది. 39/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో మంగళవారం ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్.. పేలవ ప్రదర్శన కనబర్చింది. ఏ మాత్రం ఊహించని రీతిలో టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ పెవిలియన్ బాటపట్టింది. శుభ్ మన్ గిల్(50), విరాట్ కోహ్లీ(72) పోరాడినా.. బ్యాటింగ్‌కు ప్రతి కూలంగా మారిన పిచ్‌పై ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగారు.

ముఖ్యంగా జేమ్స్ అండర్సన్ ఒకే ఓవర్‌లో శుభ్‌మన్, రహానేను ఔట్ చేసి నడ్డి విరిచాడు. ఆ తర్వాత పంత్, సుంధర్ కూడా నిరాశపరచగా.. విరాట్, అశ్విన్ పోరాడారు. కానీ అశ్విన్‌ను లీచ్.. కోహ్లీని స్టోక్స్ ఔట్ చేయడంతో భారత్ ఓటమి ఖాయామైంది. ప్రస్తుతానికి 55 ఓవర్లలో భారత్ 8 వికెట్లకు179 పరుగులు చేసింది. క్రీజులో నదీమ్, ఇషాంత్ ఉన్నారు.

Story first published: Tuesday, February 9, 2021, 13:34 [IST]
Other articles published on Feb 9, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X