న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: రెండో టెస్ట్‌కు స్పిన్ పిచ్.. జట్టు ఎంపికపై కోహ్లీ పునరాలోచన!

India vs England: Second Test pitch in Chennai might offer more turn

చెన్నై: దాదాపు ఏడాది బ్రేక్‌‌‌‌ అనంతరం సొంతగడ్డపై బరిలోకి దిగిన టీమిండియా అంతర్జాతీయ‌‌‌ క్రికెట్‌‌‌‌ను భారీ ఓటమితో ప్రారంభించింది. నాలుగు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో భాగంగా ఇంగ్లండ్‌‌‌‌తో జరిగిన ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో చిత్తుగా ఓడింది. ఆస్ట్రేలియాపై సాధించిన విజయంతో ఫుల్‌‌‌‌ జోష్‌లో ఉన్న భారత్‌కు జో రూట్‌‌‌‌ అండ్‌‌‌‌ టీమ్‌‌‌‌ పెద్ద షాకే ఇచ్చింది. చిదంబరం స్టేడియంలో ఫ్లాట్‌‌‌‌ వికెట్‌‌‌‌పై జరిగిన ఆ మ్యాచ్‌‌‌‌లో టాస్‌‌‌‌ కూడా కీరోల్‌‌‌‌ పోషించింది. మ్యాచ్‌లో ఏ దశలోనూ ఆధిపత్యం చలాయించే అవకాశం రాలేదు. శనివారం ఇరుజట్ల మధ్య మళ్లీ చెపాక్‌‌‌‌ స్టేడియంలోనే రెండో టెస్ట్‌‌‌‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఫ్రెండ్లీ వికెట్‌‌‌‌ ఆశిస్తోంది.

తొలి రోజు నుంచే టర్న్‌‌‌‌?

తొలి రోజు నుంచే టర్న్‌‌‌‌?

తొలి‌‌‌ టెస్ట్‌‌‌‌కు పూర్తిగా ఫ్లాట్‌‌‌‌ వికెట్‌‌‌‌ ఇచ్చిన తమిళనాడు క్రికెట్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందుకోసం బీసీసీఐ హెడ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ పిచ్స్‌‌‌‌ అండ్‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌ కమిటీ చీఫ్‌‌‌‌ తపోష్‌‌‌‌ చటర్జీతో కలిసి టీఎన్‌‌‌‌సీఏ క్యురేటర్‌‌‌‌ వి.రమేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ పని చేస్తున్నారు. స్పోర్టివ్‌‌‌‌ వికెట్‌‌‌‌ తయారు చేసి టాస్‌‌‌‌కు ప్రాధాన్యం తగ్గించాలని చూస్తున్నారు. ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ ఆడిన పిచ్‌‌‌‌ పక్కనే ఉన్న గ్రీన్‌‌‌‌ వికెట్‌‌‌‌పై సెకండ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ ఆడించాలని భావిస్తున్నారు. అయితే, మ్యాచ్‌‌‌‌ ప్రారంభమయ్యే లోపు దానికి నీళ్లు పడతారా? లేదో చూడాలి. ఫస్ట్‌‌‌‌ డే నుంచి టర్న్‌‌‌‌ లభించే వికెట్‌‌‌‌ను ఎంచుకుంటే విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే విదేశాల్లో చాలా జట్లు‌‌‌ పేస్‌‌‌‌కు అనుకూలించే గ్రీన్‌‌‌‌ వికెట్లను ఎంచుకున్నప్పుడు లేని సమస్య భారత్‌లో ఫస్ట్‌‌‌‌ డే నుంచి టర్న్‌‌‌‌ లభించే పిచ్‌‌‌‌లపై ఆడించినప్పుడు ప్రశ్నించడం ఎందుకన్న వాదన ఎప్పటి నుంచో ఉంది.

నదీమ్‌పై వేటు తప్పదు..

నదీమ్‌పై వేటు తప్పదు..

ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ ఓటమి అనంతరం టీమిండియా తుది జట్టు సెలెక్షన్‌‌‌‌పై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ను కాదని షాబాజ్‌‌‌‌ నదీమ్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ ఇవ్వడం ఏంటనే ప్రశ్నలు ఎదురయ్యాయి. సీనియర్‌‌‌‌ రవిచంద్రన్‌‌‌‌ అశ్విన్‌‌‌‌తో కలిసి బరిలోకి దిగిన యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ షాబాజ్‌‌‌‌ నదీమ్‌‌‌‌, వాషింగ్టన్‌‌‌‌ సుందర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో తేలిపోయారు. ఈ నేపథ్యంలో సెకండ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌కు జట్టులో పలు మార్పులు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ రెండు ఇన్నింగ్స్‌‌‌‌లు కలిపి 59 ఓవర్లు వేసిన నదీమ్‌‌‌‌ 233 రన్స్‌‌‌‌ ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. దీనికితోడు నోబాల్స్‌‌‌‌ ఎక్కువగా వేసిన నదీమ్‌‌‌‌.. తన బౌలింగ్‌‌‌‌ యాక్షన్‌‌‌‌లో చిన్న సమస్య ఉందని స్వయంగా ఒప్పుకున్నాడు. బాల్‌‌‌‌ వేసే ముందు చేసే జంప్‌‌‌‌ టైమింగ్‌‌‌‌లో తేడా ఉన్నట్లు గుర్తించానన్నాడు. దీంతో ఈ జార్ఖండ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ను సెకండ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌కు పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

అక్షర్‌కు చాన్స్..

అక్షర్‌కు చాన్స్..

అయితే, నదీమ్‌‌‌‌కు రీప్లేస్‌‌‌‌మెంట్‌‌‌‌ ఎవరనేది తేలాల్సి ఉంది. ఈ ప్లేస్‌‌‌‌ కోసం కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ రేస్‌‌‌‌లో ఉన్నారు. ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ అయిన అక్షర్‌‌‌‌.. మోకాలి నొప్పితో ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌కు అందుబాటులో లేడు. గాయం నుంచి కోలుకున్న అతను‌‌‌ ప్రస్తుతం మ్యాచ్‌‌‌‌ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సాధించాడు. నెట్స్‌‌‌‌లో పూర్తి స్థాయిలో ప్రాక్టీస్‌‌‌‌ చేస్తూ చాన్స్‌‌‌‌ కోసం ఎదురుచూస్తున్నాడు.

అయితే, కంప్లీట్‌‌‌‌ బౌలర్‌‌‌‌ అయిన కుల్దీప్‌‌‌‌, ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ అక్షర్‌‌‌‌లో మేనేజ్‌‌‌‌మెంట్ ఎవరికి ఓటేస్తోందో చూడాలి. నిజానికి ఫిట్‌‌‌‌గా ఉండుంటే అక్షర్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లోనే బరిలోకి దిగేవాడని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్‌‌‌‌ అధికారి అన్నారు. కెప్టెన్‌‌‌‌ కోహ్లీ, హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ రవిశాస్త్రి, బౌలింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌ భరత్‌‌‌‌ అరుణ్‌‌‌‌ ఆలోచన ఏంటో తెలియదని, వాళ్లపైనే సెలెక్షన్‌‌‌‌ ఆధారపడి ఉంటుందన్నాడు. బౌలర్‌‌‌‌గా ప్రభావం చూపలేకపోయిన సుందర్‌‌‌‌.. బ్యాటింగ్‌‌‌‌లో మెరవడం అతనికి కలిసొచ్చే అంశం. అయితే, మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు ప్లాన్‌‌‌‌కి వెళ్లినా.. హార్దిక్‌‌‌‌ పాండ్యాకు చాన్స్‌‌‌‌ ఇవ్వాలని భావించినా జట్టు కూర్పు పూర్తిగా మారిపోతుంది.

అశ్విన్‌‌‌‌ సేఫ్‌..

అశ్విన్‌‌‌‌ సేఫ్‌..

ఫస్ట్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ సెకండ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌ చేస్తుండగా గాయపడిన టీమిండియా సీనియర్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ రవిచంద్రన్‌‌‌‌ అశ్విన్‌‌‌‌ ఫిట్‌‌‌‌గా ఉన్నట్లు తెలుస్తోంది. జోఫ్రా ఆర్చర్‌‌‌‌ వేసిన షార్ట్‌‌‌‌ బాల్‌‌‌‌ అశ్విన్‌‌‌‌ భుజానికి బలంగా తాకింది. నొప్పితో విలవిల్లాడిన అశ్విన్‌‌‌‌కు ఫిజియో నితిన్‌‌‌‌ పటేల్‌‌‌‌ వెంటనే ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇచ్చారు. కానీ, ఆ ఇంజ్యురీ తీవ్రమైతే పరిస్థితేంటి అనే ఆందోళన కలిగింది. అయితే, అశ్విన్‌‌‌‌కు తగిలిన దెబ్బ తీవ్రమైంది కాదని, ముందస్తు స్కానింగ్స్‌‌‌‌ కూడా అవసరం లేదని జట్టు వర్గాలు చెబుతున్నాయి. సెకండ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ ముందు టీమిండియాకు ఇది గుడ్‌‌‌‌న్యూస్‌‌‌‌ అనే చెప్పొచ్చు.

Story first published: Thursday, February 11, 2021, 10:50 [IST]
Other articles published on Feb 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X