న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కలిపిన క్వారంటైన్.. రవిశాస్త్రి పాత్ర కూడా కీలకం!

 India vs England: Quarantine helps Virat Kohli and Rohit Sharma rejuvenate their relationship

హైదరాబాద్: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ముందువరకు ఎడమోహం పెడ మోహంగా ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలను క్వారంటైన్ ఒక్కటి చేసిందంట.! వీరి మధ్య సంబంధాలు మెరుగుపడటంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా కీలక పాత్ర పోషించాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి చెందిన ఓ అధికారి తాజాగా వెల్లడించాడు. ఇక విరాట్-రోహిత్ మధ్య గతేడాదిగా విభేధాలున్నాయని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మైదానంలో వారి వ్యవహారశైలి కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. గతేడాది ఐపీఎల్ సమయంలో కనీసం ఒకరి ముఖం మరొకరు చూసుకోకపోవడం, ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ ఎందుకు రాలేదో తనకు తెలియదని విరాట్ చెప్పడం వీరి మధ్య మాటల్లేవనే విషయాన్ని స్పష్టం చేశాయి.

 క్వారంటైన్ కలిపింది..

క్వారంటైన్ కలిపింది..

అయితే ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియా ఆటగాళ్లంతా ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉన్నారు. అప్పుడే రోహిత్-విరాట్ మధ్య బంధాలు మెరుగుపడ్డాయని, మనస్పర్థలన్నీ తొలిగిపోయి ఎప్పటిలా మంచి ఫ్రెండ్స్ అయ్యారని బీసీసీఐకి చెందిన ఓ అధికారి న్యూస్ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ముఖ్యంగా ఈ ఇద్దరిని కలిపేందుకు కోచ్ రవిశాస్త్రి చాలా కష్టపడ్డాడని చెప్పుకొచ్చాడు. 'రోహిత్-కోహ్లీ మధ్య ఇటీవలే మంచి బంధం ఏర్పడింది. వారి మధ్య ఉన్న భేధాభిప్రాయాలన్నీ తొలిగిపోయాయి. ప్రస్తుతం వారి మధ్య మంచి సింక్ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వారి ఆట, టీమ్, అప్‌కమింగ్ చాలెంజెస్ పట్ల ఇద్దరూ బాధ్యతాయుతంగా ఉన్నారు.'అని సదరు అధికారి పేర్కొన్నారు.

 నాన్సెన్స్‌ను ఆపేందుకే..

నాన్సెన్స్‌ను ఆపేందుకే..

'ఈ ఇద్దరి పట్ల బయట జరిగే ప్రచారం అందర్ని కలవరపెడుతుంది. ఇతర క్రికెట్ నిపుణుల్లానే విరాట్, రోహిత్ మధ్య భేధాభిఫ్రాయాలు ఉండటం సహజం. కానీ ఇటీవల వీరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ వచ్చింది. ఎన్నడూ లేని విధంగా ప్రతి విషయంపై స్పష్టతతో కనిపిస్తున్నారు. అది మనందరికి కనబడుతుంది కూడా. బయట వీరి గురించి జరిగే చర్చ వారి సంబంధాలను దెబ్బతీస్తాయనే విషయాన్ని గ్రహించిన ఈ ఇద్దరూ.. వారి గురించి ఎంత తక్కువ చర్చ జరిగితే అంత మంచిదని భావించారు. అందుకే వారి మధ్య ఎలాంటి విభేదాల్లేవని విషయాన్ని తెలిసేలా మైదానంలో ప్రవర్తిస్తున్నారు.

 అందుకే పదే పదే చర్చ..

అందుకే పదే పదే చర్చ..

ఈ క్రమంలోనే టీ20, వన్డే సిరీస్‌ల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కలిసి పదే పదే చర్చించాడు. కీలక సమయంలో ఫీల్డింగ్ సెటప్, బౌలింగ్ మార్పులపై రోహిత్‌తో కలిసి వ్యూహాలు రచించాడు. ఇలా వారు క్లోజ్‌గా ఉండటం ముందే జరిగింది. కానీ తమ మధ్య ఎలాంటి విభేదాల్లేవని విషయాన్ని తెలియజేయడం కోసం రోహిత్-విరాట్ మైదానంలో అలా ప్రవర్తించారు. ఈ భేధాభిప్రాయాల చర్చకు ముగింపుపలకాలని భావించారు.'అని సదరు అధికారి పేర్కొన్నాడు.

టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో..

టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో..

విరాట్‌ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మ.. టీమిండియాకు రెండు కళ్లు. ప్రతిభాపాటవాల్లో, జట్టును నడిపించడంలో ఎవరికి వారే సాటి. అంతర్జాతీయ వేదికపై భారత జట్టు అఖండ విజయాలు అందుకోవాలన్నా.. ఐసీసీ ట్రోఫీల్ని ముద్దాడాలన్నా వీరిద్దరూ సమన్వయంతో పనిచేయడం అత్యంత అవసరం. ఒకరికొకరు సహకరించుకోవడం మరెంతో కీలకం. ఈ క్రమంలోనే వీరి మధ్య మంచి సమన్వయం ఉండేలో కోచ్ రవిశాస్త్రి కృషి చేశాడు. దానికి క్వారంటైన్‌ను వాడుకొని ఫలితాన్ని రాబట్టాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో ఆఖరి టీ20లో వీరి మధ్య ఉన్న సమన్వయం ఆకట్టుకుంది. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ స్వేచ్చగా ఆడేలా అండగా నిలబడటం, ఫీల్డింగ్ సమయంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఇద్దరు మ్యాచ్ పరిస్థితులపై పదే పదే చర్చించుకోవడం చర్చనీయాంశమైంది

Story first published: Tuesday, March 30, 2021, 15:44 [IST]
Other articles published on Mar 30, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X