న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: ఆఖరి టెస్ట్‌కు టీమిండియాలో భారీ మార్పులు.. గిల్‌‌, రహానే, సుందర్‌‌పై వేటు?

India Vs England: Probable India XI for 4th Test, No Jasprit Bumrah
Ind vs Eng 2021,4th Test : Pitch For 4th Test Will Be Similar To Last Two Tests - Ajinkya Rahane

అహ్మద్: వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్‌‌ బెర్త్‌‌ ఊరిస్తోన్న వేళ భారత జట్టు.. ఇంగ్లండ్‌‌తో తుది సమరానికి సిద్ధమవుతోంది. స్పిన్‌‌ ట్రాక్‌‌తో ప్రత్యర్థికి కలలో కూడా ఊహించని షాకిచ్చిన కోహ్లీ సేన అదే మొతెరాలో మరోసారి బరిలోకి దిగనుంది. వ్యక్తిగత కారణాలతో సీనియర్‌‌ పేసర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా ఈ మ్యాచ్‌‌కు దూరమవ్వగా.. భారత తుది జట్టులో పలు మార్పులు చేయడం తప్పనిసరైంది. పిచ్‌‌పై ఇంకా రచ్చ కొనసాగుతున్న నేపథ్యంలో నాలుగో‌ టెస్ట్‌‌కు ఎలాంటి వికెట్‌‌ను సిద్దం చేస్తున్నారు? బుమ్రా ప్లేస్‌‌ను భర్తీ చేసేదేవరు ? కోహ్లీసేన ప్లాన్‌‌ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

కోహ్లీ సేన ఈ సిరీస్‌‌‌‌ను 2-1 లేదా 3-1తో గెలిస్తే లార్డ్స్‌‌‌‌ వేదికగా జరగబోయే మెగా ఫైనల్లో న్యూజిలాండ్‌‌‌‌తో తలపడుతుంది. అలా కాకుండా ఇంగ్లండ్‌‌‌‌ 2-2తో సిరీస్‌‌‌‌ను సమం చేస్తే మాత్రం ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్‌‌‌‌ చేరుతుంది. అందువల్ల ఈ టెస్టును టీమిండియా లైట్‌‌‌‌ తీసుకోవడానికి లేదు. బుమ్రాకు రీప్లేస్‌‌‌‌మెంట్‌‌‌‌తోపాటు ఓపెనింగ్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌, మూడో స్పిన్నర్‌‌‌‌ స్థానాలు నాలుగో‌‌‌ టెస్ట్‌‌‌‌కు ముందు మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ముందున్న సవాళ్లు. ఇది కాక, బ్యాటింగ్‌‌‌‌లో వరుసగా ఫెయిలవుతున్న వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ అజింక్యా రహానే స్థానంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం‌‌‌ కనిపిస్తోంది.

రహానేపై వేటు వేస్తారా ?

రహానేపై వేటు వేస్తారా ?

నాలుగో టెస్ట్‌‌‌‌ తుది జట్టు‌‌‌ విషయంలో వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ అజింక్యా రహానేపై కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తిగా మారింది. బ్యాటింగ్‌‌‌‌లో వరుసగా విఫలమవుతున్న రహానేకు కోహ్లీ అండగా నిలుస్తున్నాడు. మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో ఆసీస్‌‌‌‌పై సెంచరీ, చెన్నైలో జరిగిన సెకండ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీ మినహా గత 17 ఇన్నింగ్స్‌‌‌‌ల్లో రహానే రాణించింది లేదు. అజింక్యా వైఫల్యం వల్ల టాపార్డర్‌‌‌‌తోపాటు మిడిలార్డర్‌‌‌‌పై ఒత్తిడి‌‌‌ పెరుగుతోంది. అందువల్ల రహానేకు‌‌‌ బదులుగా కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ను ఆడిస్తే మంచిదని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయాపడుతున్నారు.

ఐదో నంబర్‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌కు వచ్చే రాహుల్‌‌‌‌కు.. ఇటు టాపార్డర్‌‌‌‌ను అటు లోయరార్డర్‌‌‌‌ను సమన్వయం చేసుకుంటూ ఇన్నింగ్స్‌‌‌‌ నిర్మించే సత్తా ఉంది. పైగా, ఆసీస్‌‌‌‌ సిరీస్‌‌‌‌ నుంచి రాహుల్‌‌‌‌ బెంచ్‌‌‌‌కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో అతనికి అవకాశమిచ్చేందుకు వైస్​ కెప్టెన్‌‌‌‌పై వేటు వేసే సాహసం కోహ్లీ, శాస్త్రి చేస్తారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.

మయాంక్‌‌‌‌కు చాన్స్.

మయాంక్‌‌‌‌కు చాన్స్.

టీమిండియా బ్యాటింగ్‌‌‌‌ లైనప్‌‌‌‌లో పెద్దగా సమస్యల్లేవు. అయితే, ఓపెనింగ్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌పై కాస్త చర్చ జరుగుతోంది. రోహిత్‌‌‌‌ శర్మ, శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ ఈ సిరీస్‌‌‌‌లో ఇప్పటిదాకా ఓపెనర్లుగా బరిలోకి దిగారు. రోహిత్‌‌‌‌ ఫర్వాలేదనిపిస్తున్నా.. గిల్‌‌‌‌ మాత్రం తడబడుతున్నాడు. చెన్నైలో జరిగిన సెకండ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌తోపాటు మొతెరాలో జరిగిన మూడో టెస్ట్‌‌‌‌లోనూ నిరాశపరిచాడు. అందువల్ల మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ టాపార్డర్‌‌‌‌లో మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌ను ఆడించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా టూర్‌‌‌‌లో విఫలమవ్వడంతో మయాంక్‌‌‌‌ బెంచ్​కు పరిమితమయ్యాడు. కానీ సొంతగడ్డపై మయాంక్‌‌‌‌కు మంచి రికార్డు ఉంది. అతను టెస్టుల్లో ఇప్పటిదాకా సాధించిన మూడు సెంచరీలు భారత్‌లో చేసినవే. ఈ నేపథ్యంలో గిల్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ను మయాంక్‌‌‌‌తో భర్తీ చేసే అవకాశం‌‌‌ కనిపిస్తోంది.

బుమ్రా ప్లేస్‌లో ఉమేశ్‌. .

బుమ్రా ప్లేస్‌లో ఉమేశ్‌. .

వ్యక్తిగత కారణాలతో స్టార్ పేసర్‌ జస్‌ ప్రీత్‌ బుమ్రా నాలుగో‌ టెస్ట్‌‌కు దూరమయ్యాడు. దీంతో పేసర్ల కోటాలో ఓ ప్లేస్‌ ఖాళీ అవ్వగా.. సీనియర్‌‌ బౌలర్‌‌ ఉమేశ్‌ యాదవ్‌ రేసులోకి వచ్చాడు. ఫోర్త్‌‌ టెస్ట్‌‌కు బ్యాటింగ్‌ ఫ్రెండ్లీ వికెట్‌ రెడీ చేస్తే సిసలైన పేసర్ ఉమేశ్‌ ఫైనల్‌ ఎలెవన్‌‌లో ఉండటం ఖాయం. పిచ్‌ నుంచి ఎక్స్‌‌ట్రా పేస్‌ రాబట్టగల ఉమేశ్‌ ఇంగ్లిష్‌ ప్లేయర్లను కట్టడి చేస్తాడనే అంచనాలున్నాయి. ఈ కారణం వల్లే మహ్మద్‌ సిరాజ్‌ నుంచి పోటీ ఉన్నప్పటికీ ఉమేశ్‌‌కే మేనేజ్‌మెంట్‌ ఓటేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా, సొంతగడ్డపై తిరుగులేని రికార్డు ఉన్న ఉమేశ్‌ .. పాత బాల్‌‌తో రివర్స్‌‌ స్వింగ్‌ కూడా రాబట్టగలడు. అలాగని సిరాజ్‌ను తక్కువ చేయడానికి లేదు. ముగ్గురు పేసర్ల వ్యూహంతో బరిలోకి దిగితే ఇషాంత్‌, సిరాజ్, ఉమేశ్‌ తుది జట్టులో ఉంటారు. లేకుంటే సిరాజ్‌కు కోహ్లీ అవకాశం ఇస్తాడా? లేదా? అనేది చూడాలి.

సుందర్‌‌‌పై వేటు..‌‌..

సుందర్‌‌‌పై వేటు..‌‌..

స్పిన్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ వాషింగ్టన్‌‌‌‌ సుందర్‌‌‌‌పై ఈ మ్యాచ్‌‌‌‌లో వేటు పడే అవకాశం ఉంది. బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌గా రాణిస్తున్న సుందర్‌‌‌‌ బౌలర్‌‌‌‌గా ప్రభావం చూపలేకపోతున్నాడు. గత ఐదు ఇన్నింగ్స్‌‌‌‌లో 76.4 ఓవర్లు వేసిన సుందర్‌‌‌‌ 53.8 యావరేజ్‌‌‌‌తో ఐదు వికెట్లే తీశాడు. వికెట్ల సంగతి ఎలా ఉన్నా రన్స్‌‌‌‌ కూడా కట్టడి చేయలేకపోవడంతో థర్డ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ రోల్‌‌‌‌కు న్యాయం జరగడం లేదు. అశ్విన్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ తుది జట్టులో ఉండటం ఖాయం కాగా, ఇండియా ముగ్గురు స్పిన్నర్ల వ్యూహాన్ని కొనసాగిస్తే కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లోకి రావొచ్చు.

స్పిన్‌‌‌‌ వికెట్లతో వరుసగా రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఇంగ్లండ్‌‌‌‌ను చిత్తు చేసిన టీమిండియా ఆఖరి టెస్టు కోసం ఎలాంటి పిచ్‌‌‌‌ను ఎంచుకుంటుందనేదానిపై ఆసక్తి నెలకొంది. బ్యాటింగ్‌‌‌‌ ఫ్రెండ్లీ వికెట్‌‌‌‌ రెడీ చేస్తున్నట్టు బీసీసీఐ వర్గాలు లీక్స్‌‌‌‌ ఇచ్చాయి. రోహిత్‌‌‌‌, రహానె తదితరులు మాత్రం ఇండియా అంటేనే స్పిన్‌‌‌‌ వికెట్ల అని ఇప్పటికీ అంటున్నారు. ఈ లెక్కన ఆఖరాటకూ ఇండియా స్పిన్‌‌‌‌ వికెట్‌‌‌‌నే ఎంచుకునే అవకాశం ఉంది.

Story first published: Wednesday, March 3, 2021, 13:33 [IST]
Other articles published on Mar 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X