న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ లెక్కన హర్భజన్ కన్నా అశ్వినే బెస్ట్ ఆఫ్ స్పిన్నర్: గౌతం గంభీర్

India vs England: Harbhajan Singh or Ravichandran Ashwin? Gautam Gambhir picks India’s best off-spinner

న్యూఢిల్లీ: బౌలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రవిచంద్రన్ అశ్విన్ కన్నా హర్భజన్ సింగే టీమిండియా బెస్ట్ ఆఫ్ స్పిన్నర్ అని మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. అయితే ఓవరాల్‌ ప్యాకెజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అశ్విన్ గొప్ప బౌలరని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఇంగ్లం‌డ్‌తో జరుగుతున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో ఈ తమిళనాడు ఆల్‌రౌండర్ 400 వికెట్ల మైలు రాయి అందుకున్న విషయం తెలిసిందే. మూడో టెస్ట్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్, ఓలి పోప్, జోఫ్రా ఆర్చర్‌లను పెవిలియన్‌కు చేర్చి ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.

అంతేకాకుండా అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో బౌలర్‌గా గుర్తింపు పొందాడు. శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీ ధరన్ తర్వాత అశ్వినే వేగంగా 400 వికెట్ల క్లబ్‌లో చేరాడు. దాంతో టీమిండియా ఆఫ్ స్పిన్నర్లలో అశ్విన్ గొప్పా లేక హర్భజన్ బెస్టా? అనే ప్రశ్న చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఈ డిబేట్‌పై స్పందించిన గంభీర్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.

 అశ్విన్‌కు డీఆర్‌ఎస్..

అశ్విన్‌కు డీఆర్‌ఎస్..

తన వరకు అశ్విన్ కన్నా హర్భజనే గొప్ప బౌలరని, కానీ ఓవరాల్‌గా మాత్రం అశ్వినే బెస్ట్ స్పిన్నరని తెలిపాడు. 'తరాలను పోల్చడం కొంచెం కష్టమే. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నా వరకు అయితే హర్భజన్ గొప్ప స్పిన్నర్ అని చెబుతా. ఎందుకుంటే అతను కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు అద్భుతంగా రాణించాడు. ప్రస్తుత తరంలో మాత్రం అశ్విన్ గొప్ప బౌలర్. అయితే డీఆర్‌ఎస్ లేని కాలంలో హర్భజన్ వికెట్లు తీశాడు..

భజ్జీకి దూస్రా

భజ్జీకి దూస్రా

అదేవిధంగా హర్భజన్ బౌలింగ్‌కు దుస్రా అడ్వాంటేజ్ ఉంది. కానీ అశ్విన్‌కు అది లేదు. ఫింగర్ స్పిన్నర్లు దూస్రా వేయరాదు. అయినా అద్భుతమై వేరియేషన్స్‌తో అశ్విన్ బంతులు సంధిస్తాడు. ఇద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పడం కష్టమే. కానీ నేనైతే భజ్జీ గొప్ప స్పిన్నరని చెబుతా. ఒకవేళ ఓవరాల్ ప్యాకేజ్ విషయంలో చూస్తే మాత్రం అశ్విన్ బెస్ట్ అని చెబుతా. బౌలర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో భజ్జీ మంచి బౌలర్'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

 యువీతో ఏకీభవిస్తున్నా.. కానీ..

యువీతో ఏకీభవిస్తున్నా.. కానీ..

మొతెరా పిచ్‌ను విమర్శిస్తూ యువరాజ్ సింగ్ చేసిన ట్వీట్‌పై స్పందించిన గౌతమ్ గంభీర్ మా అతని వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని తెలిపాడు.'అవును.. ఇప్పుడు పిచ్‌లు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. మ్యాచ్‌లలో డీఆర్‌ఎస్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఒకవేళ అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ బౌలింగ్ చేసే టైమ్‌లో డీఆర్‌ఎస్ ఉండి ఉంటే..? కచ్చితంగా కుంబ్లే 1000, హర్భజన్ సుమారు 700 వికెట్లు పడగొట్టేవారు. మరీ ముఖ్యంగా.. భారత్ లాంటి స్పిన్ పిచ్‌లపై ఎక్కువగా బంతి బ్యాట్ ఎడ్జ్ తాకడం లేదా బ్యాట్స్‌మెన్ ఫ్యాడ్‌లను తాకడం జరుగుతుంటుంది.

కాబట్టి.. డీఆర్‌ఎస్ వారికి బాగా ఉపయోగపడేది. కుంబ్లే, భజ్జీ మరిన్ని వికెట్లు పడగొట్టేవారనే కోణంలో యువరాజ్ సింగ్‌ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. కానీ.. ఇలాంటి పిచ్‌లపై మాత్రమే ఆడింటే అన్ని వికెట్లు పడగొడతారనే అభిప్రాయంతో మాత్రం నేను ఏకీభవించను'' అని ట్విస్ట్ ఇచ్చాడు.

1000 వికెట్లు తీసేవారు..

1000 వికెట్లు తీసేవారు..

ఇక మొతెరా పిచ్‌పై యువరాజ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 'రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగియడం.. టెస్టు క్రికెట్‌కు మంచిది కాదు. ఒకవేళ ఇలాంటి పిచ్‌లపై అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ బౌలింగ్ చేసి ఉంటే..? వాళ్లు 1000 వికెట్లు(కుంబ్లే), 800 వికెట్లు (హర్భజన్ సింగ్) సాధించేవారు.'అని ట్వీట్ చేశాడు. దాంతో.. యువీపై మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా మండిపడ్డారు.

Story first published: Tuesday, March 2, 2021, 16:38 [IST]
Other articles published on Mar 2, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X