న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెర్త్ టెస్టులో నేను చేసింది తప్పే: కోహ్లీ

India vs Australia: Virat Kohli opens up on his decision to snub Ravindra Jadeja for 2nd Test

పెర్త్: ఆస్ట్రేలియాను క్లీన్ స్వీప్ చేయాలని భావించిన టీమిండియా ఘోర పరాజయానికి లోనైంది. రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 146పరుగుల భారీ తేడాతో మ్యాచ్‌ను గెలిచింది. రెండో టెస్టు మూడో రోజు మొదలైన వివాదాన్ని నాలుగో రోజుకూ కొనసాగించిన ఇరు జట్ల కెప్టెన్లు చివరి రోజు వాదన పెట్టుకోలేదు. మ్యాచ్ అనంతరం తాను చేసిన తప్పిదాన్ని టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఒప్పుకున్నాడు. పెర్త్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో తన తప్పిదం కారణంగానే భారత్ జట్టు ఓడిపోయిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించాడు.

140 పరుగులకే కుప్పకూలిన భారత్

140 పరుగులకే కుప్పకూలిన భారత్

287 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా ఆటలో చివరిరోజైన మంగళవారం ఓవర్‌నైట్ స్కోరు 112/5తో రెండో ఇన్నింగ్స్‌‌ని కొనసాగించిన భారత్ జట్టు 140 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో.. 146 పరుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల సిరీస్‌ని 1-1తో సమం చేసింది.

3..4 టెస్టులకు భారత జట్టిదే, మయాంక్, పాండ్యాలకు చోటు

పేస్, బౌన్స్‌కి అతిగా అనుకూలిస్తుందంటూ అతి ప్రచారంతో

పేస్, బౌన్స్‌కి అతిగా అనుకూలిస్తుందంటూ అతి ప్రచారంతో

వాస్తవానికి పెర్త్‌లో నూతనంగా నిర్మించిన ఆప్టస్‌ స్టేడియం‌ పేస్, బౌన్స్‌కి అతిగా అనుకూలిస్తుందంటూ ఆస్ట్రేలియా అతిగా ప్రచారం చేసింది. దీనికి తోడు పిచ్‌పై పచ్చిక ఉండటంతో.. ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ అనుకూలం అని టీమిండియా భావించింది. కానీ.. తొలిరోజే ఆటగాళ్ల పాద ముద్రలతో పిచ్ గరుకుగా మారిపోయి.. అస్థిర బౌన్స్‌తో పాటు స్పిన్నర్ల‌కి సహకారం లభించింది.

రవీంద్ర జడేజాని పక్కన పెట్టడమే

రవీంద్ర జడేజాని పక్కన పెట్టడమే

పిచ్ స్పిన్నర్లకి కూడా అనుకూలించే అవకాశమున్నా.. ఇలా రవీంద్ర జడేజాని పక్కన పెట్టడం టీమిండియాని దెబ్బతీసిందంటూ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ అంగీకరించాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ 8/106 గణాంకాలతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌'గా నిలవడం గమనార్హం.

జడేజాని తీసుకోవాలనే ఆలోచనే రాలేదు.

జడేజాని తీసుకోవాలనే ఆలోచనే రాలేదు.

‘పెర్త్ పిచ్‌ని పరిశీలించిన తర్వాత.. నలుగురు ఫాస్ట్ బౌలర్లు జట్టులో ఉంటే చాలు అనుకున్నా. రవీంద్ర జడేజాని తీసుకోవాలనే ఆలోచనే రాలేదు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. నిజాయతీగా చెప్పాలంటే ఒక స్పిన్నర్‌ని తుది జట్టులో ఆప్షన్‌గా ఉంచుకోవాలనే ఆలోచనే లేకుండాపోయింది. డిసెంబరు 26 నుంచి జరగనున్న మెల్‌బోర్న్ టెస్టులో తప్పిదాలను దిద్దుకుని కచ్చితంగా జట్టుని గెలిపించే ప్రదర్శన చేస్తాం' అని విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు.

1
43624
Story first published: Tuesday, December 18, 2018, 11:53 [IST]
Other articles published on Dec 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X