3..4 టెస్టులకు భారత జట్టిదే, మయాంక్, పాండ్యాలకు చోటు


న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో ఆఖరి రెండు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇవాళ ప్రకటించింది. తొలి టెస్టుకు ముందు ఆడిన వార్మప్ మ్యాచ్‌లో గాయానికి గురైన యువ క్రికెటర్ పృథ్వీ షా సిరీస్ మొత్తానికి దూరమైయ్యాడు. రాహుల్, విజయ్ విఫలం అవుతున్న తరుణంలో.. బాక్సింగ్ డే టెస్టుకు పృథ్వీ షా అందుబాటులో ఉంటాడని భావించారు. కానీ గాయం తీవ్రత దృష్ట్యా అతణ్ని స్వదేశానికి పంపేయాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. చీలమండ గాయం నుంచి తిరిగి కోలుకోకపోవడంతో అతడికి విశ్రాంతినిచ్చారు. షా స్థానంలో జట్టులోకి వచ్చిన మరో యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఓపెనర్‌గా అవకాశం కల్పించే దిశగా సెలక్టన్ కమిటీ అతణ్ని జట్టులోకి ఎంపిక చేసింది.

మూడో టెస్టు మ్యాచ్ కోసం హార్దిక్ పాండ్య
డిసెంబరు 26 నుంచి జరగనున్న మూడో టెస్టు మ్యాచ్ కోసం హార్దిక్ పాండ్య ఎంపికైనట్లుగా తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగిన ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై మ్యాచ్ ఆడుతూ పాండ్య గాయపడ్డాడు. బౌలింగ్ చేస్తుండగా.. వెన్నుకి గాయమైంది. పాండ్య కనీసం నడవలేకపోవడంతో.. అతణ్ని స్ట్రెచర్ సాయంతో మైదానం బయటకు తీసుకెళ్లారు. గాయం నుంచి కోలుకున్న హార్దిక్ హార్దిక్ ఫిట్‌నెస్ నిరూపించుకున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా బరోడా తరఫున బరిలో దిగిన అతడు.. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో 73 పరుగులు చేశాడు.
'కోహ్లీ బెస్ట్ బ్యాట్స్‌మన్‌యే కాదు.. చెత్త ప్రవర్తన కలిగిన.

భారత్-ఆసీస్ 1-1తో సమంగా
రెండో టెస్టులో భారత్ భారీ వ్యత్యాసంతో ఓటమికి గురైంది. తదుపరి టెస్టుకు టీమ్ మేనేజ్‌మెంట్ జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. మూడో టెస్టు డిసెంబర్ 26న మెల్‌బోర్న్‌లో ప్రారంభంకాగా..జనవరి 3న ఆరంభంకానున్న ఆఖరిదైన నాలుగో టెస్టుకు సిడ్నీ ఆతిథ్యమిస్తోంది. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి టెస్టులో కోహ్లీ జట్టు గెలవగా రెండో టెస్టు పెర్త్‌లో మ్యాచ్‌ను గెలిచిన ఆసీస్ సమం చేసుకుంది.

మూడు.. నాలుగు టెస్టులకు సిద్ధమవుతోన్న టీమిండియా
Virat Kohli (captain), M Vijay, KL Rahul, Cheteshwar Pujara, Ajinkya Rahane (vice-captain), Hanuma Vihari, Rohit Sharma, Rishabh Pant (wicket-keeper), Parthiv Patel (wicket-keeper), R Ashwin, Ravindra Jadeja, Kuldeep Yadav, Mohammed Shami, Ishant Sharma, Umesh Yadav, Jasprit Bumrah, Bhuvneshwar Kumar, Hardik Pandya, Mayank Agarwal
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications