న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీని హడలెత్తిస్తున్న హజల్‌వుడ్.. రన్‌మెషిన్ వరుస సెంచరీల రికార్డుకు బ్రేక్

India vs Australia: Virat Kohli 11-year streak ends after India captain finishes without ODI hundred in 2020

కాన్‌బెర్రా: ప్చ్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(78 బంతుల్లో 63) మళ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడకుండానే వెనుదిరిగాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో హాఫ్ సెంచరీ చేసి దూకుడుగా కనిపించిన భారత్ కెప్టెన్.. మళ్లీ హజల్‌వుడ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఈ మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే విరాట్‌ను రెండు సార్లు ఔట్ చేసిన హజల్ వుడ్.. తాజాగా మూడో వన్డేలోనూ పెవిలియన్ చేర్చాడు. తనదైన బౌలింగ్‌తో కోహ్లీని ఇబ్బంది పెడుతున్నాడు. దాంతో 2009 నుంచి ప్రతీ ఏడాది విరాట్ చేస్తున్న సెంచరీల రికార్డుకు బ్రేక్ పడింది.

ఒకే తరహా బంతులతో..

ఒకే తరహా బంతులతో..

సిడ్నీ వేదికగా జరిగిన ఫస్ట్ వన్డేలోనూ హజల్ వుడ్ వేసిన షార్ట్ పిచ్ బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడబోయిన కోహ్లీ(21) ఫించ్‌కు చిక్కి వెనుదిరిగాడు. ఇక అదే వేదికపై జరిగిన రెండో వన్డేలోనూ సెంచరీకి సమీపిస్తున్న కోహ్లీ(89)ని అదే తరహా బంతితో మళ్లీ పెవిలియన్ చేర్చాడు. మిడ్ వికెట్ దిశగా ఆడిన భారీ షాట్‌ను సర్కిల్ లోపల ఉన్న హెన్రీక్స్ సూపర్ డైవ్‌తో అందుకున్నాడు. దాంతో విరాట్ శతకం చేయకుండానే వెనుదిరిగాడు.

రివ్యూకెళ్లి..

రివ్యూకెళ్లి..

ఇక తాజా మూడో వన్డేలో ఓపెనర్లు విఫలమైన వేళ ఆచితూచి ఆడిన విరాట్ 64 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 123 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించేందుకు క్రీజులోకి వచ్చి పాండ్యాతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కానీ మరోసారి హజల్ వుడ్ వేసిన వైడ్ షార్టర్‌ను కోహ్లీ పుల్ చేయబోగా.. బంతి బ్యాట్‌ను తాకుతూ కీపర్ చేతిలో పడింది. దాంతో ఆసీస్ ఆటగాళ్లు అప్పీలు చేయగా ఫీల్డ్ అంపైర్ తిరస్కరించగా.. సమీక్ష వెళ్లిన ఆసీస్ ఫలితం సాధించింది. దాంతో కోహ్లీ ఇన్నింగ్స్ ముగిసింది. అయితే మూడు మ్యాచ్‌ల్లో దాదాపు ఒకే తరహా బంతులతో వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మన్ అయిన కోహ్లీని హజల్ వుడ్ దెబ్బతీయడం చర్చనీయాంశమైంది.

ఈ ఏడాది ఒక్క సెంచరీ లేదు..

ఈ ఏడాది ఒక్క సెంచరీ లేదు..

ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయకుండానే విరాట్ వెనుదిరగడంతో అతని వరుస సెంచరీల రికార్డుకు బ్రేక్ పడింది. 2009 నుంచి 2019 వరకు ప్రతీ క్యాలండర్ ఇయర్‌లో విరాట్ కనీసం ఒక సెంచరీనైనా చేశాడు. కానీ ఈ ఏడాది మాత్రం ఒక్క సెంచరీ చేయలేదు. గతేడాది ఆగస్టులో వెస్టిండీస్ శతకం చేసిన విరాట్.. మళ్లీ సెంచరీ చేయలేదు. కరోనా కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నిలిచిపోవడం.. ఆడిన మ్యాచ్‌ల్లో సెంచరీ చేయకపోవడంతో విరాట్ వరుస సెంచరీల రికార్డుకు బ్రేక్ పడింది. ఈ జాబితా‌లో సచిన్ 19 ఏళ్లు వరుసగా సెంచరీలు చేసి టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత కోహ్లీ(11), నాథన్ అశ్లే(11) ఉన్నారు.

విరాట్ @12K

విరాట్ @12K

ఈ మ్యాచ్‌తో కోహ్లీ వన్డేల్లో 12 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. సచిన్‌ 300 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని దాటగా... కోహ్లీ తన 242వ ఇన్నింగ్స్‌లోనే అందుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డుకు 23 పరుగులు దూరంలో నిలిచిన విరాట్.. అబాట్ వేసిన 13వ ఓవర్‌ ఫస్ట్ బాల్‌కు మిడాఫ్ దిశగా ఆడి క్విక్ సింగిల్‌తో 12000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఈ ఘనతను అందుకున్న ఆరో బ్యాట్స్‌మెన్‌‌గా విరాట్ నిలిచాడు. సచిన్ టెండూల్కర్(18426), సంగక్కర(14234), పాంటింగ్(13704), జయసూర్య (13430), జయవర్దనే (12650) కోహ్లీ కన్నా ముందున్నారు. అయితే వీరందరి కన్నా తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే కోహ్లీ ఈ ఘనతను అందుకోవడం విశేషం.

Story first published: Wednesday, December 2, 2020, 13:07 [IST]
Other articles published on Dec 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X