India vs Australia: విరాట్ కోహ్లీ లేకపోతే.. టీమిండియా‌కు మంచిదే: గవాస్కర్

ముంబై: నవంబరు 27 నుంచి ఆస్ట్రేలియాతో వరుసగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌లని భారత్ ఆడనుంది. తొలి టెస్టు ముగిసిన వెంటనే కెప్టెన్ కోహ్లీ భారత్ వచ్చేయనున్నాడు. జనవరిలో కోహ్లీ సతీమణి అనుష్క శర్మ బిడ్డకి జన్మనివ్వబోతుండటంతో.. ప్రసవ సమయంలో ఆమె చెంత ఉండాలని విరాట్ ఆశిస్తున్నాడు. బీసీసీఐ కూడా అతనికి పితృత్వ సెలవుల్ని కేటాయించింది. పితృత్వ సెలవులపై కోహ్లీ ఆసీస్‌తో చివరి మూడు టెస్టులకు దూరమవ్వడం భారత జట్టుకు తీరని లోటని మాజీలు అందరూ అంటున్నారు. అయితే కోహ్లీ లేకపోవడం టీమిండియా‌కు మంచిదే అని భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ అంటున్నాడు.

కోహ్లీ ఆడని ప్రతీ మ్యాచ్‌లో భారత్ గెలిచింది:

కోహ్లీ ఆడని ప్రతీ మ్యాచ్‌లో భారత్ గెలిచింది:

తాజాగా సునీల్ గవాస్కర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'మనం ఓసారి గణాంకాలను పరిశీలిస్తే.. విరాట్‌ కోహ్లీ ఆడని ప్రతీ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. ధర్మశాలలో ఆస్ట్రేలియాపై, అఫ్గానిస్థాన్‌ మీద ఒక టెస్టు. నిదహాస్‌ ట్రోఫీ, 2018 ఆసియా కప్‌ ఇలా ఎప్పుడు చూసినా.. కోహ్లీ లేని మ్యాచ్‌ల్లో భరత్ గెలుపొందింది. కోహ్లీ లేనప్పుడు ఇతర ఆటగాళ్లు బాగా ఆడడానికి ప్రయత్నిస్తారు. అతడు లేని లోటును భర్తీ చేయాలని అర్థం చేసుకుంటారు. అందుకే టీమిండియా రాణిస్తోంది' అని వివరించాడు.

రహానె బ్యాట్‌తో రాణించాలి:

రహానె బ్యాట్‌తో రాణించాలి:

కెప్టెన్‌ విరాట్ కోహ్లీ గైర్హాజరీతో అజింక్య రహానె, ఛెతేశ్వర్‌ పుజారాకు కష్టమవుతుందని సునీల్ గవాస్కర్ అన్నాడు. అనుభవజ్ఞులైన వాళ్లిద్దరూ బ్యాట్‌తో రాణించాల్సి ఉంటుందని తెలిపాడు. కెప్టెన్సీ బాధ్యత రహానెకు ఉపయోగ పడుతుందని కూడా చెప్పాడు. కోహ్లీ లేనప్పుడు జట్టును ఎవరు నడిపించాలనే విషయంపై సెలెక్షన్‌ కమిటీ స్పష్టతతో ఉందని టీమిండియా మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. గవాస్కర్ టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. 34 సెంచరీలతో 10 వేలకు పైగా రన్స్ చేశాడు.

పుజారాను వదిలేయాలి:

పుజారాను వదిలేయాలి:

చివరగా ఛెతేశ్వర్‌ పుజారాను వదిలేయాలని, ఎలా ఆడాలనే విషయంపై అతడికి ఎవరూ సూచనలు చేయాల్సిన అవసరం లేదని లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. పుజారాను స్వేచ్ఛగా ఆడనివ్వాలన్నాడు. ఎలా ఆడాలో వీరేందర్ సెహ్వాగ్‌కు ఎప్పుడూ చెప్పనట్లు..

పూజారా పరుగులు, సెంచరీలు చేస్తున్నంత వరకు ఎలా ఆడాలో ఎవరూ చెప్పకూడదన్నాడు. పుజారా నిలకడగా ఆడుతున్నాడు కాబట్టి అది టీమిండియాకు కలిసొచ్చే అంశం అని సన్నీ చెప్పుకొచ్చాడు.

ఐదు వందలకు పైగా పరుగులు:

ఐదు వందలకు పైగా పరుగులు:

2018-19లో కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాను 2-1తో కోహ్లీసేన చిత్తు చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో పుజారా కీలక పాత్ర పోషించాడు. మూడు శతకాలు బాది ఐదు వందలకు పైగా పరుగులు సాధించాడు. అయితే ఆ సమయంలో వార్నర్, స్మిత్ నిషేధానికి గురై జట్టుకు దూరమయ్యారు. కానీ ఇప్పుడు వారిద్దరితో పాటు లబుషేన్ ఆసీస్‌ జట్టులో ఉండటంతో భారత్‌ సిరీస్ గెలవడం అంత సులువు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా తొలి టెస్టు తర్వాత కోహ్లీ స్వదేశానికి తిరిగి రావడం భారత్‌కు ప్రతికూలంగా మారుతుందని అంటున్నారు.

అసలేం జరుగుతుందో అర్ధం కావడం లేదు.. అందుకే ఇప్పుడు ఎన్‌సీఏలో ఉన్నా: రోహిత్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, November 21, 2020, 16:27 [IST]
Other articles published on Nov 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X