India vs Australia: రిషభ్ పంత్ సేఫ్.. రవీంద్ర జడేజా ఔట్!

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో గాయపడ్డ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సిరీస్ మొత్తానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ గాయాలతో సిరీస్‌కు దూరమవ్వగా.. తాజాగా జడేజా సేవలను కోల్పోవడం భారత్‌కు ప్రతికూలంగా మారనుంది.

స్కార్క్ బౌలింగ్‌లో గాయం..

స్కార్క్ బౌలింగ్‌లో గాయం..

మూడో టెస్టు మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో జడేజా గాయపడ్డ విషయం తెలిసిందే. స్టార్క్ వేసిన బౌన్సర్ నేరుగా జడేజా ఎడమచేతి బొటనవేలికి తాకింది. నొప్పితో విలవిలవిలాడిన జడేజా.. ఫిజియో ప్రథమ చికిత్స తర్వాత బ్యాటింగ్ కొనసాగించాడు. తర్వాత ఆసీస్ ఇన్నింగ్స్ సందర్భంగా మైదానంలోకి అడుగుపెట్టలేదు. డ్రెస్సింగ్ రూమ్‌లోనే విశ్రాంతి తీసుకున్నాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతని బొటన వేలు ఫ్రాక్చర్ అయి ఉంటుందని టీమిండియా ఫిజియోలు భావిస్తున్నారు. అయితే జడేజాకు స్కానింగ్ చేయించినట్లు.. ఆ రిపోర్టుల ఆధారంగా అతను తదుపరి మ్యాచ్ ఆడేది లేనిది తేలుస్తుందని జట్టు వర్గాలు తెలిపాయి.

పంత్‌కు గాయం..

పంత్‌కు గాయం..

ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా గాయపడ్డాడు. గాయం తీవ్రతను తెలుసుకునేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ వెంటనే పంత్‌ను స్కానింగ్‌కు పంపించింది. దాంతో అతని స్థానంలో వృద్దిమాన్ సాహా వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. 36 పరగులు మాత్రమే చేసిన పంత్.. ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో గాయపడ్డాడు. 141 కిలోమీటర్ల వేగంతో అతను వేసిన బంతి నేరుగా పంత్ మోచేతికి బలంగా తాకింది.

నో ఫ్రాక్చర్..

నో ఫ్రాక్చర్..

కమిన్స్ వేసిన బంతి అతను మోచేతికి బలంగా తాకింది. ఇక నొప్పితో విలవిలలాడిన పంత్, ఫిజియో పర్యవేక్షణ తర్వాత బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ మునపటి జోరును కనబర్చలేకపోయాడు. నొప్పితో బాధపడుతూ బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. చివరకు హెజెల్ వుడ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే డాక్లర్ల సలహాతో పంత్‌ను స్కానింగ్‌కు తీసుకెళ్లారు. అయితే అతనికి ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదని, సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తాడని జట్టు వర్గాలు పేర్కొన్నాయి.

జడేజా సూపర్ పెర్ఫామెన్స్..

జడేజా సూపర్ పెర్ఫామెన్స్..

తొడకండరాల గాయం కారణంగానే తొలి టెస్ట్‌కు దూరమైన జడేజా.. మెల్‌బోర్న్ టెస్ట్‌లోనే బరిలోకి దిగాడు. మళ్లీ అంతలోనే గాయపడ్డాడు. ఇక ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించిన జడేజా.. సూపర్ ఫీల్డింగ్‌తో స్మిత్‌ను రనౌట్ చేశాడు. బ్యాటింగ్‌లోనూ ఒంటరి పోరాటం చేశాడు. మెల్‌బోర్న్ టెస్ట్‌లో కూడా రహానేతో కలిసి హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ త్రీ డైమన్షన్ గల జడేజా జట్టుకు దూరమవ్వడం భారత్‌కు ఎదురుదెబ్బే.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Saturday, January 9, 2021, 20:28 [IST]
Other articles published on Jan 9, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X