న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చెలరేగిన రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా.. ఆసీస్ ముందు భారీ లక్ష్యం!

India vs Australia: Hardik Pandya and Ravindra Jadeja record partnership takes India to 302 for 5

కాన్‌బెర్రా: రవీంద్ర జడేజా(50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 నాటౌట్), హార్దిక్ పాండ్యా(76 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 92 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా ముందు భారత్ 303 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ ఇద్దరి విధ్వంసానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ(78 బంతుల్లో 5 ఫోర్లతో 63)క్లాసిక్ ఇన్నింగ్స్ తోడవడంతో భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 302 పరుగులు చేసింది.

152 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్.. ఒకానొక దశలో 250 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ చివర్లో జడేజా-పాండ్యా ద్వయం 6వ వికెట్‌కు అజేయంగా 150 పరుగుల భాగస్వామ్యం అందించడంతో కోహ్లీసేన 300 పరుగుల మార్క్‌ను అందుకుంది. ఆసీస్ బౌలర్లలో అగర్ రెండు వికట్లు తీయగా.. హజల్ వుడ్, జంపా, అబాట్ తలో వికెట్ తీశారు.

ఓపెనింగ్ జోడీ విఫలం..

ఓపెనింగ్ జోడీ విఫలం..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేనకు ఈ మ్యాచ్‌లో కూడా శుభారంభం దక్కలేదు. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ఓపెనింగ్ జోడీని మారుస్తూ టీమిండియా మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం కూడా ఫలించలేదు. గత రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన మయాంక్ అగర్వాల్‌పై వేటువేసిన టీమ్‌మెనేజ్‌మెంట్ అతని స్థానంలో శుభ్‌మన్ గిల్(33)‌కు అవకాశం కల్పించింది. కానీ అతను కూడా ఆకట్టుకోలేకపోయాడు. ఆదిలోనే శిఖర్ ధావన్(16) వికెట్ కోల్పోగా.. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్‌తో శుభ్‌మన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరూ 56 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో కుదురుకుంటుండగా.. అగర్ దెబ్బతీశాడు. గిల్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించి పెవిలియన్‌కు చేర్చాడు.

అయ్యర్, రాహుల్ రాణించలే..

అయ్యర్, రాహుల్ రాణించలే..

ఆ తర్వాత అయ్యర్, కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే బాధ్యతను తీసుకున్నారు. రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన అయ్యర్.. జంపా బౌలింగ్‌లో లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే కేఎల్ రాహుల్ ఎల్బీగా వెనుదిరగడంతో భారత్ 123 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో పాండ్యాతో కలిసిన విరాట్ 64 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ కొద్దిసేపటికే హజల్ వుడ్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరగడంతో భారత్ 152 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. తొలుత అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో రివ్యూకు వెళ్లిన ఆసీస్.. ఫలితం సాధించింది.

చెలరేగిన పాండ్యా, జడేజా..

చెలరేగిన పాండ్యా, జడేజా..

ఈ క్లిష్ట స్థితిలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా సూపర్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. తొలుత నిదానంగా ఆడిన ఈ జోడీ అనంతరం చెలరేగింది. ఆసీస్ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడుతూ వారికి చుక్కలు చూపించింది. తొలుత 55 బంతుల్లో హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ చేయగా.. ఆ తర్వాత 43 బంతుల్లో జడేజా అర్థ సెంచరీ సాధించాడు. అబాట్ వేసిన 48వ ఓవర్‌ను జడేజా చీల్చిచెండాడు. హ్యాట్రిక్ బౌండరీలతో హాఫ్ సెంచరీ అందుకున్న అతను ఆ వెంటనే మరో భారీ సిక్సర్ కొట్టి 19 పరుగులు పిండుకున్నాడు. దాంతో ఓ దశలో స్వల్ప స్కోర్‌కే పరిమితం అవుతుందనుకున్న భారత్.. భారీ స్కోర్ చేసింది. జడేజా-పాండ్యా ధాటికి చివరి 5 ఓవర్లలో 76 పరుగులు వచ్చాయి.

Story first published: Wednesday, December 2, 2020, 13:02 [IST]
Other articles published on Dec 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X