For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్.. షేర్ ఆయేగా!

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫ్రాంచైజీకి గుడ్‌న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఎషాన్ మలింగా ఐపీఎల్ 2026 సీజన్ ఆడేందుకు మార్గం సుగుమమైంది. ఐపీఎల్ 2026 సీజన్ ఆడేందుకు ఎషాన్ మలింగాకు శ్రీలంక క్రికెట్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో అతను త్వరలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరనున్నాడు.

ఎషాన్ మలింగా రాకతో బౌలింగ్ విభాగం బలం పెరగనుంది. అయితే ఎషాన్ మలింగా రాకపై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ సందర్భంగా ఎషాన్ మలింగా భుజానికి గాయమైంది. ఈ గాయం కారణంగానే అతను ఇటీవల జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి దూరమయ్యాడు. అప్పటి నుంచి అతను శ్రీలంక క్రికెట్ బోర్డు పర్యవేక్షణలో రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు.

IPL 2026 Good News For SRH Sri Lanka Cricket Issues NOC to Eshan Malinga uncertainty over Hasaranga Pathirana and Thushara

ఎషాన్ మలింగా తన గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. క్రిక్‌బజ్ తెలిపిన వివరాల ప్రకారం మార్చి 28న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగే తొలి మ్యాచ్‌లోనే ఎషాన్ మలింగా బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగా, కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ మతీశ పతిరణకు ఇంకా ఫిట్‌నెస్ టెస్ట్ కాలేదని క్రిక్‌బజ్ పేర్కొంది. అటు ఆర్‌సీబీ పేసర్ నువాన్ తుషారాపై ఇంకా ఎలాంటి అప్‌డేట్ రాలేదని తెలిపింది.

మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ ముమ్మరంగా సాధన చేస్తోంది. తమ హోమ్ గ్రౌండ్ ఉప్పల్‌లో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లు ఆడుతూ తమ వ్యూహాలను సిద్దం చేసుకుంటుంది. అలాగే ఫ్యాన్స్ మీట్ కార్యక్రమాలతో హైప్ క్రియేట్ చేస్తోంది. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టు బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. అయితే ఎషాన్ మలింగా రాకతో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ కష్టాలు కొంత తీరనున్నాయి. ఎషాన్ మలింగా రాకపై ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షేర్ ఆయేగా అంటూ కామెంట్ చేస్తున్నారు. గతేడాది SRH తరపున 7 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మలింగా.. ఈసారి కూడా అదే జోరు కొనసాగిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Story first published: Tuesday, March 24, 2026, 7:55 [IST]
Other articles published on Mar 24, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+