Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహేష్ బాబు కాదు.. అతనే నా ఫేవరేట్ తెలుగు హీరో: అభిషేక్ శర్మ (వీడియో)

సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ తన ఫేవరేట్ తెలుగు హీరో‌ను మార్చేసాడు. ఇన్నాళ్లు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును తన ఫేవరేట్ తెలుగు హీరోగా చెప్పుకొచ్చిన అభిషేక్ శర్మ.. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు చెప్పాడు.

ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఫ్యాన్స్ మీట్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్‌, నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్, హెన్రీచ్ క్లాసెన్‌, జయదేవ్ ఉనాద్కత్‌లతో కలిసి అభిషేక్ శర్మ సందడి చేశాడు. ఈ సందర్భంగా అభిమానులతో తెలుగు హీరోల గురించి అభిషేక్ శర్మ ముచ్చటించాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు‌కు జై కొట్టి ఫ్యాన్స్‌ను అలరించాడు. 'మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా కమిట్ అయిపోతా'అని డైలాగ్ చెప్పిన అభిషేక్ శర్మ.. జై బాబు అని నినాదాలు చేశాడు.

Not Mahesh Babu SRH Star Abhishek Sharma Reveals Allu Arjun as His Favorite Telugu Hero

ఇక టాలీవుడ్ హీరోల్లో ఎవరితో క్రికెట్ ఆడాలనుకుంటున్నారని హోస్ట్ అడగ్గా.. అభిషేక్ శర్మ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు చెప్పాడు. దాంతో భాయ్ ఫ్యాన్స్ గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నారు. మహేష్ బాబు ఇష్టమని చెప్పే అభిషేక్ శర్మ.. అల్లు అర్జున్ పేరు చెప్పడంతో కాటేరమ్మ కొడుకు తన ఫేవరేట్ హీరోను మార్చేసాడని నెట్టింట చర్చ జరుగుతుంది. అయితే అందరి అభిమానులను సంతోషపర్చాలనే ఉద్దేశంతోనే అభిషేక్ శర్మ.. అల్లు అర్జున్ పేరు చెప్పాడని ఇతర హీరోల ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫ్యాన్స్ మీట్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో అభిషేక్ శర్మకు ఫ్యాన్స్ పులి అనే ట్యాగ్ ఇచ్చారు. ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. 42 బంతుల్లో 94 పరుగులు చేశాడు. శుక్రవారమే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కలిసిన అభిషేక్ శర్మ.. శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్-ఏ తరఫున బరిలోకి దిగాడు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Story first published: Monday, March 23, 2026, 14:34 [IST]
Other articles published on Mar 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+