ఐపీఎల్ 2026 సీజన్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నయా రూల్స్‌ను ప్రకటించింది. ఆటగాళ్లు, సిబ్బంది ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని పేర్కొంది. ఈ రూల్స్‌ను అతిక్రమిస్తే మందలింపుతో పాటు భారీ జరిమానాలు ఉంటాయని హెచ్చరించింది. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఐపీఎల్ 2026 సీజన్‌కు తెరలేవనుంది. ఈ క్రమంలోనే బీసీసీఐ ఈ సీజన్‌లో పాటించాల్సిన నయా రూల్స్ జాబితాను టీమ్ మేనేజర్లకు అందజేసింది.
1. ఓపెన్ నెట్స్‌కు అనుమతి లేదు. నెట్స్‌లోనే ప్రాక్టీస్ చేయాలి.
2. ఒక జట్టు తన ప్రాక్టీస్‌ను ముందుగానే ముగించినప్పటికీ.. ఆ జట్టుకు కేటాయించిన పిచ్‌లను రెండో జట్టు వాడుకోవడానికి అనుమతి లేదు.
3. మ్యాచ్ రోజున ప్రాక్టీస్‌కు అనుమతి లేదు. ఎలాంటి ప్రాక్టీస్ సెషన్లు ఉండవు.
4. మ్యాచ్ రోజున మైదానంలో ఎలాంటి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించకూడదు.
5. ప్రాక్టీస్ రోజుల్లో డ్రెస్సింగ్ రూమ్ ఆటగాళ్లు, అక్రిడిటేషన్ ఉన్న సిబ్బందిని మాత్రమే మైదానంలోకి అనుమతిస్తారు.
ఆటగాళ్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇతర వాహనల్లో రావాలి. వారికి మైదానంలోకి అనుమతి లేదు. హాస్పిటాలిటీ ఏరియా నుంచి మాత్రమే ప్రాక్టీస్‌ను చూడాలి. ఫ్రాంచైజీలు త్రోడౌన్ స్పెషలిస్ట్‌లు, నెట్ బౌలర్ల జాబితాను బీసీసీఐ ఆమోదం కోసం సమర్పించాలి.
6.ఆటగాళ్లు ప్రాక్టీస్ కోసం టీమ్ బస్సునే ఉపయోగించాలి. జట్లు రెండు బ్యాచ్‌లుగా ప్రయాణించవచ్చు. ప్రాక్టీస్ సంబంధిత అభ్యర్థనల కోసం వెన్యూ మేనేజర్‌ను సంప్రదించాలి.

సిబ్బంది తప్పనిసరిగా తమ అక్రిడిటేషన్ కార్డులను కలిగి ఉండాలి. మొదటిసారి మర్చిపోతే హెచ్చరిక, రెండోసారి రిపీట్ చేస్తే జరిమానా విధిస్తారు.
హిట్టింగ్ నెట్లు ఉన్నప్పటికీ, ఆటగాళ్లు ఎల్‌ఈడీ బోర్డులపై బంతులు కొట్టకుండా జాగ్రత్త వహించాలి.
ఆటగాళ్లు, సిబ్బంది ఎల్‌ఈడీ బోర్డుల ముందు కూర్చోకూడదు. సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు ఎక్కడ కూర్చోవాలో స్పాన్సర్‌షిప్ టీమ్ మార్క్ చేస్తుంది.
ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్: సంబంధిత ఆటగాళ్లు తప్పనిసరిగా ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లను ధరించాలి.
ప్రెజెంటేషన్ రూల్స్: పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో ఫ్లాప్పీ హ్యాట్స్, స్లీవ్‌లెస్ జెర్సీలు ధరించకూడదు. రూల్స్ ఉల్లంఘిస్తే జరిమానా తప్పదు.
సపోర్ట్ స్టాఫ్: ఐపీఎల్ 2025 తరహాలోనే.. మ్యాచ్ రోజున డాక్టర్‌తో కలిపి కేవలం 12 మంది సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
జెర్సీ నంబర్లు మార్చాలనుకుంటే 24 గంటల ముందే లీగ్‌కు సమాచారం ఇవ్వాలి.
బీసీసీఐ ముందస్తు అనుమతితో గరిష్టంగా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుకోవచ్చు. కానీ అవి సైడ్ వికెట్లపైనే జరగాలి. లైట్ల కింద ఆడితే 3.30 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు.
తొలి హోమ్ మ్యాచ్: ఫ్రాంచైజీ తన తొలి హోమ్ మ్యాచ్‌కు నాలుగు రోజుల ముందు నుంచి మెయిన్ స్క్వేర్‌పై ప్రాక్టీస్ చేయకూడదు. అవసరమైతే స్టేట్ అసోసియేషన్ సహకారంతో ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసుకోవాలి.