న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంతమందికి గాయాలా? టీమిండియా ఫిజియోలు ఏం చేస్తున్నారు?

India vs Australia: Breakdown of India bowlers raises questions on physios workload management role

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్- గవాస్కర్ సిరీస్ కోసం ఏకంగా 20 మందిని ఆడించి టీమిండియా రికార్డు సృష్టించింది. ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు ఈ సిరీస్‌లోనే సంప్రదాయక ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశారు. ఈ లెక్కలు బాగానే ఉన్నా.. భారత రిజర్వ్ బెంచ్ బలంగానే కనిపిస్తున్నా.. కీలక ప్లేయర్లకు గాయాల వల్లే ఇంత మందిని బరిలోకి దింపాల్సి వచ్చింది.

ఆసీస్ పర్యటన మొదలైనప్పటి నుంచే టీమిండియా గాయాలతో ఇబ్బంది పడుతోంది. మూడో టెస్ట్‌లో ఏకంగా నలుగురు ప్లేయర్లు గాయపడటంతో ఆఖరి మ్యాచ్‌కు ఫిట్‌గా ఉన్న 11 మందిని ఎంచుకోవడమే సవాల్‌గా మారింది. ఇప్పుడు ఫోర్త్ టెస్ట్‌లో పేసర్ నవ్‌దీప్ సైనీ గ్రౌండ్‌ను వదిలి వెళ్లడంతో టీమిండియా సపోర్ట్ స్టాఫ్ పని తీరుపై సందేహాలు రేకిత్తిస్తున్నాయి.

ఫిజియోలపై విమర్శలు..

ఫిజియోలపై విమర్శలు..

ప్లేయర్ల ఇంజ్యూరీ మేనేజ్‌మెంట్‌తో పాటు వర్క్‌లోడ్ విషయంలో ట్రెయినర్లు ఫిజియోలు ఫెయిలయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గాయపడ్డ ప్లేయర్ల లిస్ట్ రోజురోజుకి పెరుగుతుండటం దీనికి మరింత బలం చేకూరుస్తోంది. జంబో స్క్వాడ్‌తో ఆసీస్ టూర్‌లో లాస్ట్ టెస్ట్‌కు వచ్చేసరికి ఫైనల్ ఎలెవెన్ సెలెక్షన్‌కు ఇబ్బంది పడింది. ఈ సిరీస్ సంగతి ఎలా ఉన్నా.. బౌలర్లంతా గాయాల బారినపడటంతో త్వరలో ప్రారంభమయ్యే ఇంగ్లండ్ సిరీస్‌కు జట్టు ఎంపిక ఎలా అనే ప్రశ్న వస్తోంది. తగినన్ని వనరులు లేకపోవడంతో ఆ సిరీస్‌కు టీమ్‌ను ఎంపిక చేయడం సెలెక్షన్ కమిటీకి కూడా సవాల్ కానుంది.

ఇంజ్యురీ మేనేజ్‌మెంట్ లోపం..

ఇంజ్యురీ మేనేజ్‌మెంట్ లోపం..

ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియా వెంట ప్రస్తుతం ఇద్దరు ఫిజియోలు. ఇద్దరు స్ట్రెంథ్ అండ్ కండిషనింగ్ కోచ్‌లు ఉన్నారు. సాధారణంగా ప్లేయర్ల గాయాలను ట్రామా(దెబ్బ తగలడం, మానసిక సమస్య), ఫిట్‌నెస్ లోపాలుగా విభజిస్తారు. ఆటగాళ్లు ఫీల్డ్‌లో గాయపడి మ్యాచ్‌కు దూరమైతే సపోర్ట్ స్టాఫ్ పని తీరును అనుమానించాల్సిన పని లేదు. కానీ ఫిట్‌నెస్ సంబంధిత కారణాలతో ప్లేయర్లు గాయపడుతుంటే మాత్రం ట్రెయినర్లదే బాధ్యతగా భావించవచ్చు. ఆసీస్‌తో జరిగిన మూడు టెస్ట్‌ల్లో భారత్ ఆరుగురు స్పెషలిస్ట్ బౌలర్లను ఉపయోగించింది. వీరంతా కలిసి మూడు మ్యాచ్‌ల్లో 442 ఓవర్లు వేశారు. ఇందులో అశ్విన్ అత్యధికంగా 134.1 ఓవర్లు వేశారు. బుమ్రా 117.4, రవీంద్ర జడేజా 37.3, ఉమేశ్ 39.4, సైనీ 29, సిరాజ్ 86 ఓవర్లు వేశారు.

ఆసీస్‌లో ఇబ్బంది లేదే..?

ఆసీస్‌లో ఇబ్బంది లేదే..?

మరోపక్క హేజిల్ వుడ్(98 ఓవర్లు), కమిన్స్ (111.1), స్టార్క్(98), నాథన్ లయన్(128) తొలి మూడు టెస్ట్‌ల్లో ఆసీస్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా నడిపించారు. బ్రిస్బేన్‌లోనూ బరిలోకి దిగారు. దీన్ని బట్టి రెండు జట్ల ప్లేయర్లలో ఫిట్‌నెస్ తేడాను అర్థం చేసుకోవచ్చు. మూడు టెస్ట్‌ల్లో భారత్ ఉపయోగించిన ఆరుగురు స్పెషలిస్ట్‌ల్లో ఐదుగురు ఇప్పటికే జట్టుకు దూరమయ్యారు. ఫిట్‌నెస్ సమస్యతో కొందరు, ఆన్ ఫీల్డ్ గాయాలతో మరికొందరు తప్పుకున్నారు. వీళ్లలో ఉమేశ్ యాదవ్, సైనీని పరిశీలిస్తే.. ఫిట్‌నెస్ అండ్ ఇంజ్యూరీ మేనేజ్‌మెంట్ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అశ్విన్ విషయంలో మాత్రం సపోర్ట్ స్టాఫ్ వైఫల్యం కనిపించడం లేదు. కొంతకాలంగా ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న అశ్విన్ ఇటీవల ఏ సిరీస్ పూర్తిగా ఆడింది లేదు. బ్యాక్ పెయిన్‌తో బాధపడుతూనే సిడ్నీ టెస్ట్‌లో పోరాడాడు. దీంతో చివరి టెస్ట్‌కు దూరమయ్యాడు.

దాదా దృష్టి పెట్టాలి..

దాదా దృష్టి పెట్టాలి..

ఇదికాక తొడకండరాల గాయానికి గురైన హనుమ విహారిది పూర్తిగా ఫిట్‌నెస్ సమస్యనే. ఈ గాయాల నేపథ్యంలో టీమిండియా ఫిజియోలు తమ పనితీరును ఆత్మపరిశీలన చేసుకోవాలని ఓ మాజీ ఫిజియో ఆగ్రహం వ్యక్తం చేశాడు. సపోర్ట్ స్టాఫ్ పనితీరుపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఉందన్నాడు.'షమీ, బుమ్రా, జడేజా‌కు అయిన గాయాల విషయంలో ఎవ్వరికీ ప్రశ్నలు లేవు. కానీ ఐపీఎల్‌లో పెద్దగా ఆడని ఉమేశ్ యాదవ్, హనుమ విహారీ‌ల గురించి అంతా ఆలోచన చేయాలి. నాలుగో టెస్ట్‌కు ముందు సైనీ కూడా ఈ టూర్‌లో పెద్దగా ఆడింది లేదు. అతను గాయంపై కూడా దృష్టిసారించాలి'అని మాజీ ఫిజియో పేర్కొన్నారు.

Story first published: Sunday, January 17, 2021, 10:19 [IST]
Other articles published on Jan 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X