For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia 2020: ఫస్ట్ వన్డే ముందు కోహ్లీసేనను కలవరపెడుతున్న సిడ్నీ రికార్డ్స్!

India vs Australia 2020: Virat Kohli and team has worst record in Sydney cricket ground

సిడ్నీ: కరోనా బ్రేక్ అనంతరం ఆస్ట్రేలియాతో ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడబోతున్న భారత జట్టును ఓ చెత్త రికార్డు కలవరపెడుతోంది. సిడ్నీ వేదికగా శుక్రవారం జరిగే తొలి వన్డేతో కోహ్లీసేన సుదీర్ఘ పర్యటన మొదలవ్వనుంది. అయితే ఈ మ్యాచ్ జరగనున్న సిడ్నీ మైదానంలో భారత్‌కు చెత్త రికార్డు ఉంది. ఈ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు ఆడిన భారత్ 14 మ్యాచ్‌ల్లో ఓడి రెండింటిలో మాత్రమే గెలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు అచ్చిరాని గ్రౌండ్ ఏదైనా ఉందంటే అది ఈ మైదానమే.

ఇక ఆస్ట్రేలియా అంటేనే రెచ్చిపోయే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఈ మైదానంలో పూర్తిగా తడబడ్డాడు. ఓవరాల్‌గా ఆసీస్ గడ్డపై మంచి గణంకాలను నమోదు చేసిన విరాట్ ఈ మైదానంలో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. కంగారుల గడ్డపై వన్డేల్లో ఇప్పటి వరకు 50.17 సగటుతో 1154 రన్స్ చేసిన విరాట్.. సిడ్నీలో మాత్రం ఐదు ఇన్నింగ్స్‌ల్లో 9 సగటుతోనే రన్స్ చేశాడు. ఇందులో అత్యధికం 21 కావడం గమనార్హం.

ఈ గణంకాలు భారత అభిమానులను కలవరపెడుతున్నాయి. కరోనా బ్రేక్ అనంతరం జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు ఓటమి తప్పదా? అనే సందేహాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఈ లెక్కలను భారత ఆటగాళ్లు సరిచేస్తారని, కోహ్లీసేన బోణీ కొడుతుందని మరికొందరూ అభిప్రాయపడుతున్నారు. బలం, బలగం.. తెగింపు, తెగువ.. సమాన స్థాయిలో ఉండే ఈ రెండు జట్ల పోరాటంలో ఈసారి పైచేయి ఎవరిదో? మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌లో కంగారు పెట్టేదెవరో? చూడాలి.

2018-19 సీజన్లో 2-1 తేడాతో వన్డే సిరీస్‌ గెలిచిన భారత్‌‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆస్ట్రేలియా తహతలాడుతోంది. ఆ సీజన్‌లో వన్డే సిరీస్‌తోపాటు టెస్టు సిరీస్‌ను గెలిచిన భారత్.. 1-1తో టీ20 సిరీస్‌ను సమం చేసింది. సొంత గడ్డపై భారత్‌ చేతిలో ఒక్క సిరీస్‌లోనూ ఆస్ట్రేలియా గెలవకపోవడం అదే తొలిసారి.
దీంతో ఈసారి ఎలాగైనా లెక్క సరి చేయాలనే కసితో ఆస్ట్రేలియా బరిలో దిగుతోంది.

Story first published: Thursday, November 26, 2020, 18:47 [IST]
Other articles published on Nov 26, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+