న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శుభారంభాన్ని నిలబెట్టుకోలేదు.. మ్యాచ్ అక్కడే చేజారింది: కోహ్లీ

India vs Australia 1st T20I: Rishabh Pant’s dismissal was turning point, says Virat Kohli

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా బుధవారం ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు గెలుపు ముంగిట అనూహ్యంగా తడబడింది. దీంతో.. ఆస్ట్రేలియా చేతిలో 4 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. 3 టీ20ల సిరీస్‌లో 0-1తో వెనకబడింది. వర్షం కారణంగా 17 ఓవర్లకి కుదించిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ టార్గెట్‌ని 174 పరుగులుగా నిర్ణయించారు. బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో టీమిండియా ఓటమికి గురైంది.

గెలుపుకి చాలా దగ్గరగా రాగలిగాం.

గెలుపుకి చాలా దగ్గరగా రాగలిగాం.

మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లి మాట్లాడాడు. ‘గెలుపుకి చాలా దగ్గరగా రాగలిగాం. స్టేడియంలోని అభిమానులు దీన్ని బాగా ఎంజాయ్ చేసుంటారు. వీక్షకులతో పాటు ఆటగాళ్లని కూడా ఉత్కంఠకి గురిచేసింది. ఛేదనలో భారత్‌కి మెరుగైన ఆరంభమే లభించినా నిలబెట్టుకోలేకపోయాం. మిడిల్ ఓవర్లలో తడబడ్డాం. అయినా ఆఖర్లో రిషబ్ పంత్ - దినేశ్ కార్తీక్ జోడీ దూకుడుగా ఆడటం చూసి మ్యాచ్‌లో గెలుస్తామని ఆశించాం. కానీ.. రిషబ్ పంత్ ఔటవడంతో.. మళ్లీ మ్యాచ్‌పై పట్టు చేజారిపోయింది' అని వెల్లడించాడు.

తొలి టీ20లోనే చాహల్ జాబితాలోకి చేరిన కృనాల్

కార్తీక్‌.. పంత్‌తో కలిసి భారీ షాట్లతో

కార్తీక్‌.. పంత్‌తో కలిసి భారీ షాట్లతో

ఈ క్రమంలో ఛేదనకు దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ (76: 42 బంతుల్లో 10ఫోర్లు, 2సిక్సులు), దినేశ్ కార్తీక్ (30: 13 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్సు), రిషబ్ పంత్ (20: 15 బంతుల్లో 1ఫోర్, 1సిక్సు) దూకుడుగా ఆడినా.. భారత్ ఆఖరికి 169/7కే పరిమితమైంది. ఇలా శిఖర్ ధావన్ ఔటయ్యే సమయానికి భారత్ జట్టు 11.4 ఓవర్లలో 105/4తో నిలిచింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్‌.. రిషబ్ పంత్‌తో కలిసి భారీ షాట్లతో చెలరేగాడు.

భారత్ ఆశించిన స్థాయిలో ఆడలేక

భారత్ ఆశించిన స్థాయిలో ఆడలేక

ఈ జోడీ కేవలం 22 బంతుల్లోనే 50 పైచిలుకు భాగస్వామ్యం నెలకొల్పడంతో 15.2 ఓవర్లలో భారత్ 156/4తో నిలిచి గెలిచేలా కనిపించింది. కానీ.. ఒకానొక దశలో రిషబ్ పంత్ ఔటవగా.. అనంతరం వచ్చిన కృనాల్ పాండ్యా (2: 4 బంతుల్లో) కార్తీక్‌కు చక్కని భాగస్వామ్యం ఇవ్వలేకపోయారు. దీంతో భారత్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఇలా ఒత్తిడికి గురైన దినేశ్ కార్తీక్ కూడా 163 వద్ద ఔటవడంతో భారత్‌కు ఓటమి ఖాయమైంది.

Story first published: Thursday, November 22, 2018, 10:51 [IST]
Other articles published on Nov 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X