Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొలి టీ20లోనే చాహల్ జాబితాలోకి చేరిన కృనాల్

India vs Australia 1st T20 : Australian Batsmen Hit 6 Sixes off Krunal Pandya's Bowling | Oneindia
India vs Australia: Krunal Pandya joins unwanted list after getting hammered at the Gabba

హైదరాబాద్: భారత్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టును వరుణుడు కరుణించాడు. దానికి తోడు ముందుగా బ్యాట్స్‌మెన్‌ చేసిన స్కోరు జట్టుకు బాగా కలిసొచ్చింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభం లభించకపోయినా.. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రెచ్చిపోయి ఆడారు. ముఖ్యంగా మాక్స్‌వెల్‌(46; 24బంతుల్లో 4సిక్సులు), క్రిస్‌ లిన్‌(37; 20బంతుల్లో 1ఫోర్, 4సిక్సులు), మార్కస్‌ స్టోయినిస్‌(33నాటౌట్‌; 19బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సు) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు.

చివర్లో వర్షం రావడంతో మ్యాచ్ తారుమారు

చివర్లో వర్షం రావడంతో మ్యాచ్ తారుమారు

మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 17ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 158పరుగులు సాధించింది. చివర్లో వర్షం రావడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ విధానం ప్రకారం.. మ్యాచ్‌ను 17ఓవర్లకు కుదించి భారత్‌ లక్ష్యాన్ని 174పరుగులుగా సవరించారు. దానిని చేధించేందుకు పోరాడిన టీమిండియా ప్రధాన వికెట్లు కోల్పోవడంతో చేతులెత్తేసింది. దీంతో కేవలం 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

తొలి టీ20: చివరి వరకు ఉత్కంఠ, 4 పరుగుల తేడాతో భారత్ ఓటమి

తొలి రెండు ఓవర్లలో కట్టడి.. తర్వాత

తొలి రెండు ఓవర్లలో కట్టడి.. తర్వాత

ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌గా బరిలోకి దిగిన కృనాల్‌ పాండ్య ఖాతాలో ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది. తొలి రెండు ఓవర్లలో కృనాల్‌.. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేసినా.. మిగిలిన రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తంగా నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసిన కృనాల్‌.. ఒక వికెట్‌ కూడా తీయకుండా 55పరుగులు సమర్పించుకున్నాడు.

భారీగా పరుగులు సమర్పించుకున్న పాండ్యా

భారీగా పరుగులు సమర్పించుకున్న పాండ్యా

ఇక ఎకానమీ కూడా 13.75 వరకు ఉంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో మొత్తం మీద తొమ్మిది సిక్స్‌లు ఉంటే.. కృనాల్‌ బౌలింగ్‌లోనే‌ ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ 6సిక్స్‌లు కొట్టారు. ఇలా టీ20ల్లో ఒక మ్యాచ్‌లో వికెట్లేమీ తీయకుండా భారీగా పరుగులు సమర్పించుకున్న భారతీయ బౌలర్ల జాబితాలో కృనాల్‌ పాండ్య మూడో స్థానంలో నిలిచాడు.

చాహల్‌తో పాటుగా అదే రికార్డు

చాహల్‌తో పాటుగా అదే రికార్డు

అందరికంటే ముందు వరుసలో యుజ్వేంద్ర చాహల్‌(0/64) కొనసాగుతున్నాడు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో చాహల్‌ ఖాతాలో ఈ చెత్త రికార్డు వచ్చి చేరింది. రెండో స్థానంలో భారత మాజీ బౌలర్‌ జోగిందర్‌ శర్మ(0/57) ఉన్నాడు. 2007లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఇది నమోదైంది.

1
43620
Story first published: Thursday, November 22, 2018, 9:08 [IST]
Other articles published on Nov 22, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+