న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India's squad for Asia Cup 2022: అయ్యర్ ఔట్.. జడేజా డౌట్! 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఇదే!

Indias squad for Asia Cup 2022: Virat Kohli and Kl Rahul set to return; Iyer out

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌కు ముందు ట్రైలర్‌లా జరగనున్న ఆసియాకప్ 2022 టోర్నీకి సమయం ఆసన్నమైంది. దుబాయ్ వేదికగా ఆగస్టు 27 నుంచి ఈ మినీ ప్రపంచకప్‌కు తెరలేవనుంది. మెగా టీ20 టోర్నీకి ముందు జరుగుతుండటంతో ఈ సారి టీ20 ఫార్మాట్‌లో ఆసియాకప్ అలరించనుంది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే కొన్ని దేశాలు తమ జట్లను ప్రకటించగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాత్రం కసరత్తులు చేస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం సోమవారం(ఆగస్టు 8)న చేతన శర్మ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించనుంది. అయితే ఈ జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లపై ఓ లుక్కెద్దాం.

ఓపెనర్లుగా రోహిత్, రాహుల్..

ఓపెనర్లుగా రోహిత్, రాహుల్..

ఇక ఈ టోర్నీ కోసం ఎంపిక చేసే భారత జట్టులో పెద్ద మార్పులేమి ఉండకపోవచ్చు. దాదాపు 80 శాతం జట్టు ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. కొన్ని స్థానాల గురించే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేఎల్ రాహుల్ అందుబాటులోకి వస్తే రోహిత్ శర్మతో కలిసి అతను ఓపెనింగ్ చేయనున్నాడు. రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది.

తాజాగా అతనే రెండు వారాల్లో జట్టుకు అందుబాటులో ఉంటానని ట్వీట్ చేశాడు. వెస్టిండీస్‌తో మూడో టీ20లో వెన్ను గాయానికి గురైన రోహిత్ శర్మ సైతం పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. పైగా ఆసియాకప్ ఇంకా మూడు వారాల సమయం ఉన్న నేపథ్యంలో అతను బరిలో దిగడం ఖాయం.

అయ్యర్ ఔట్.. హుడాకు చాన్స్..

అయ్యర్ ఔట్.. హుడాకు చాన్స్..

సుదీర్ఘ విశ్రాంతి తీసుకున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ టోర్నీతో మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. మూడో స్థానంలో అతను ఆడనుండగా నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. ఇక బ్యాకప్ మిడిలార్డర్ ప్లేయర్‌గా శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడాలో ఒకరు బరిలోకి దిగనున్నాడు. ప్రస్తుత ఫామ్ నేపథ్యంలో దీపక్ హుడాకే ఎక్కువ అవకాశాలున్నాయి.

హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్ బిగ్ హిట్టర్లుగా జట్టులో చోటు దక్కించుకోనున్నారు. అయితే రవీంద్ర జడేజా గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తరుచూ గాయాల బారిన పడుతున్న అతను ఆసియాకప్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఫిట్‌గా ఉంటే మాత్రం అతని స్థానానికి డోకా లేదు.

బుమ్రా సారథ్యంలో..

బుమ్రా సారథ్యంలో..

బౌలింగ్ విభాగంలో యుజ్వేంద్ర చాహల్ ఏకైక స్పిన్నర్‌గా బరిలోకి దిగనుండగా.. మూడో స్పిన్నర్ ఆప్షన్స్‌గా అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లో ఒకరు అవకాశం దక్కించుకోనున్నారు. రవి బిష్ణోయ్ పేరును కూడా పరిశీలించవచ్చు. పేస్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌కు అండగా హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్‌లు జట్టులోకి రానున్నారు. లెఫ్టార్మ్ పేసర్ కావాలనుకుంటే ఆవేశ్ ఖాన్ పేరును పరిశీలించవచ్చు.

భారత జట్టు(అంచనా)

భారత జట్టు(అంచనా)

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్/దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్/ అక్షర్ పటేల్

Story first published: Friday, August 5, 2022, 19:25 [IST]
Other articles published on Aug 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X