న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022 ముందు టీమిండియాను కలవరపెడుతున్న లోపాలు!

India’s death bowling and fielding still a headache despite T20I series win over Australia

హైదరాబాద్: ఆసియా కప్‌ 2022లో ఘోర పరాభవంతో డీలాపడిన భారత అభిమానులకు.. ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయం జోష్ తెచ్చింది. ఈ మూడు టీ20ల సిరీస్ విజయం ఆనందాన్నిస్తున్నా జట్టు లోపాలు మాత్రం కలవరపెడుతున్నాయి. మెగా టోర్నీకి సన్నాహకంగా భావించిన సిరీస్‌లో సానుకూలంశాలు ఎన్ని ఉన్నాయో లోపాలు అన్నే కనబడుతున్నాయి.

జట్టు బ్యాటింగ్‌కు ఎలాంటి డోకా లేకున్నా.. బౌలింగ్, ఫీల్డింగే మరి దారుణంగా మారింది. ముఖ్యంగా బౌలింగ్ మరీ తీసికట్టుగా మారిపోయింది. డెత్ ఓవర్లలో ధారళంగా పరుగులిస్తున్నారు. పేసర్లు ఏ మాత్రం వికెట్లు తీయలేకపోతున్నారు. ఈ బౌలింగ్‌తోనే మెగా టోర్నీలో రాణించాలంటే మాత్రం రోహిత్ సేన లీగ్ దశ కూడా ధాటదు.

పేలవ బౌలింగ్..

పేలవ బౌలింగ్..

జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్‌ పటేల్ రావడంతో డెత్‌ సమస్య తీరిపోతుందిలే అని భావించిన సగటు క్రికెట్‌ అభిమానికి నిరాశే ఎదురైంది. కీలకమైన ఉప్పల్‌ పోరులోనూ భారత బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చేశారు. మరీ ముఖ్యంగా సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌.. తానేసిన 18వ ఓవర్‌లో ఏకంగా 21 పరుగులు సమర్పించాడు. అంతకుముందు వరకు ఆసీస్ స్కోరు 150 దాటేలా కనిపించలేదు. అదే ఊపులో 19వ ఓవర్‌ వేసిన బుమ్రాకూ ఆసీస్‌ బ్యాటర్లు చుక్కలు చూపించారు. రెండు సిక్స్‌లు సహా 18 పరుగులు ఇచ్చాడు. దీంతో ఆసీస్‌ స్కోరు 180 దాటింది. అందుకే కెప్టెన్‌ రోహిత్ శర్మ కూడా ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేశాడు.

డెత్ బౌలింగ్ దారునం..

డెత్ బౌలింగ్ దారునం..

అయితే టీమిండియాకు కలిసొస్తున్న ఏకైక ఓవర్‌.. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ (20). ఎందుకంటే గత ఆసియా కప్‌లోనూ ఏడు పరుగులను కాపాడేందుకు ప్రయత్నించి మ్యాచ్‌లను చివరి బంతి వరకూ తీసుకెళ్లారు. ఇప్పుడు తాజాగా ఆసీస్‌తో మూడో టీ20లోనూ హర్షల్‌ కేవలం ఏడు పరుగులే ఇవ్వడం గమనార్హం. తొలి టీ20లో భారత బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. 208 పరుగుల భారీ స్కోర్ కాపాడలేకపోయారు. ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్, హర్షల్ పటేల్ పోటాపడి పరుగులిచ్చారు. 8 ఓవర్ల పాటే జరిగిన రెండో టీ20లో బుమ్రా పర్వాలేదనిపించినా హర్షల్ పటేల్ దారుణంగా విఫలమయ్యాడు. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌లో బౌలింగ్ పరంగా తన మార్క్ చూపించలేకపోయాడు. అందుకే రాబోయే సౌతాఫ్రికా సిరీస్‌లోనైనా 'డెత్‌' ఓవర్లపై దృష్టిపెట్టాలి.

చెత్త ఫీల్డింగ్..

చెత్త ఫీల్డింగ్..

బ్యాటింగ్‌, బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌ చాలా కీలకం. భారీ స్కోరు సాధించినా.. భీకరంగా వికెట్లు తీసినా.. ఫీల్డింగ్‌ చెత్తగా ఉంటే ఫలితంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. తొలి టీ20లో 208 పరుగుల భారీ స్కోరు సాధించినా.. టీమిండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఫీల్డింగ్‌ వైఫల్యం. కీలకమైన సమయంలో ధాటిగా ఆడిన కామెరూన్ గ్రీన్, స్టీవ్‌ స్మిత్, మ్యాథ్యూ వేడ్ క్యాచ్‌లను భారత ఫీల్డర్లు నేలపాలు చేశారు. దీంతో బ్యాటర్ల కష్టం వృథా అయిపోయింది. దీంతో మాజీ ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి.. 'ఇదేనా ఫీల్డింగ్‌' అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉప్పల్‌ మ్యాచ్‌లో ఈ ఫీల్డింగే భారత్‌ను కాపాడింది. అక్షర్ పటేల్ వేసిన అద్భుతమైన త్రో.. కీలకమైన మ్యాక్స్‌వెల్‌ వికెట్‌ను అందించింది. అయితే టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా హైదరాబాద్‌కు చెందిన శ్రీధర్ ఉన్నంత కాలం జట్టు ఫీల్డింగ్ ప్రమాణలు అత్యున్నతంగా ఉండేవి. అతని పదవి కాలం అనంతరం జట్టు ఫీల్డింగ్ మరీ ఘోరంగా తయారయ్యింది.

Story first published: Monday, September 26, 2022, 21:53 [IST]
Other articles published on Sep 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X