న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Playing XI: కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ.. రాహుల్‌కు నో చాన్స్! బంగ్లాతో తొలి వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే!

India Playing XI vs Bangladesh for 1st ODI: Virat, Rohit Re-entry, No chance for KL Rahul

హైదరాబాద్: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా తొలి సమరానికి సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మిర్పూర్ వేదికగా ఆదివారం జరిగే తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌తోనే రీఎంట్రీ ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా ఈ సిరీస్ నుంచే సన్నాహకం మొదలు పెట్టనుంది.

దాంతో ఈ సిరీస్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. న్యూజిలాండ్ పర్యటనలో ఆడిన సూర్యకుమార్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నారు. దాంతో టీమిండియా తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఓపెనర్లుగా రోహిత్, ధావన్..

ఓపెనర్లుగా రోహిత్, ధావన్..

బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలోనూ టీమిండియా ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్‌తోనే బరిలోకి దిగనుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఆడటం ఖాయం. న్యూజిలాండ్ సిరీస్‌లో ధావన్ పర్వాలేదనిపించాడు. వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవాలంటే అతను స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సిందే.

లేకుంటే యువ ఆటగాళ్లు ఆ స్థానాన్ని కైవసం చేసుకుంటారు. టీ20, టెస్ట్ ఫార్మాట్‌కు పక్కనపెట్టిన ధావన్‌ను ప్రపంచకప్ కోసమే వన్డే ఫార్మాట్ ఆడిస్తున్నారు. మరో ఓపెనర్‌గా బరిలోకి దిగే రోహిత్ శర్మ సైతం భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైన రోహిత్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ సిరీస్‌లో పాత రోహిత్‌లా చెలరేగి జట్టు‌కు శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది.

పంత్‌కు అగ్ని పరీక్ష

పంత్‌కు అగ్ని పరీక్ష

కేఎల్ రాహుల్‌కు జట్టులో చోటు దక్కడం కష్టమే. మిడిలార్డర్‌లో ఆడించాలనుకుంటే శ్రేయస్ అయ్యర్‌పై వేటు వేయాల్సిన పరిస్థితి. అయితే అయ్యర్ వన్డేలో నిలకడగా రాణిస్తున్న నేపథ్యంలో రాహుల్‌ బెంచ్‌కే పరిమితం కావచ్చు. ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ ఆడటం ఖాయం. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్.. బంగ్లాదేశ్‌పై చెలరేగుతాడని ఆశిస్తున్నారు. వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ బరిలోకి దిగడం ఖాయం. న్యూజిలాండ్ పర్యటనలో దారుణంగా విఫలమైన పంత్‌కు ఈ సిరీస్ అగ్నిపరీక్ష. ఇక్కడ రాణిస్తేనే జట్టులో కొనసాగగలడు.

షమీ, సిరాజ్ రీఎంట్రీ..

షమీ, సిరాజ్ రీఎంట్రీ..

ఆరోస్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, ఏడో స్థానంలో మరో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆడటం ఖాయం. సుందర్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. అక్షర్ పటేల్ టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమయ్యాడు. యుజ్వేంద్ర చాహల్ జట్టులో లేని కారణంగా అతనికి తుది జట్టులో చోటు దక్కనుంది. షెహ్‌బాజ్ అహ్మద్ మరోసారి వేచి చూడక తప్పదు. మహహ్మద్ షమీ, సిరాజ్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో దుమ్మురేపిన సిరాజ్‌‌కు తుది జట్టులో చోటు దక్కనుంది. దీపక్ చాహర్ కూడా బరిలోకి దిగనున్నాడు. మరోసారి కుల్దీప్ సేన్‌కు నిరాశే ఎదురుకానుంది.

భారత తుది జట్టు(అంచనా)

భారత తుది జట్టు(అంచనా)

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్(కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్

Story first published: Friday, December 2, 2022, 15:20 [IST]
Other articles published on Dec 2, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X