న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా బయోపిక్‌లో ఆ ఇద్దరి హీరోల్లో ఎవరైనా సరే: సురేశ్ రైనా

India Batsman Suresh Raina Reveals Two Actors Whom He Would Prefer In His Biopic

న్యూఢిల్లీ: తన బయోపిక్‌లో దుల్కర్ సల్మాన్, షాహిద్ కపూర్‌లలో ఏవరు నటించిన తనకు ఓకేనని టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా తెలిపాడు. కరోనా కారణంగా క్రికెట్ టోర్నీలు నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమైన ఈ వెటరన్ బ్యాట్స్‌మన్.. శనివారం ట్విటర్ వేదికగా చిట్‌చాట్ చేశాడు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చాడు.

ఇద్దరిలో ఎవరైనా ఓకే..

ఈ సందర్భరంగా ఓ యూజర్.. ‘ఒక వేళ నీ బయోపిక్ మూవీ తీయాలనుకుంటే ఏ హీరోను ప్రిఫెర్ చేస్తావ్? లేకుంటే నీవే నటిస్తావా?'అని ప్రశ్నించాడు. దీనికి రైనా దుల్కర్ సల్మాన్, షాహిద్ కపూర్ పేర్లను సూచించాడు. ఈ ఇద్దరిలో ఎవరైనా తనకు ఒకేనని.. మీరు ఎవరిని సజెస్ట్ చేస్తారని ఎదురు ప్రశ్నించాడు. సౌతిండియన్ ఫిల్మ్ హీరో, మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడైన దుల్కర్ సల్మాన్ ‘ఒకే కన్మాని' తెలుగులో ‘ఒకే బంగారం' సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇక బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ జబ్ వీ మెట్, ఉడ్తా పంజాబ్, హైదర్ మూవీలతో అందరి ప్రశంసలు అందుకున్నాడు.

వంటలు వండుతున్నా..

ఇక ఈ లాక్‌డౌన్‌లో కొత్తగా ఏం ట్రై చేస్తున్నావని మరో యూజర్ ప్రశ్నించగా.. రకరకాల వంటలు వండుతున్నానని రైనా సమాధానమిచ్చాడు. ఇక ధోనీ బయోపిక్ హీరో సుశాంత్ రాజ్ పుత్ సింగ్ అకాల మరణం పట్ల రైనా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. 'సుశాంత్ సింగ్ మరణ వార్త షాక్‌కు గురిచేసింది. మహీ బయోపిక్ సందర్భంగా ఎన్నోసార్లు అతన్ని కలిసా. సరదాగా గడిపా. ఓ అందగాడిని కోల్పోయాం. ఎప్పుడూ నవ్వుతూనే ఉండే నటుడు. ఓంశాంతి' అని రైనా ట్వీట్ చేశాడు.

ధోనీ కెప్టెన్ కాకుండా ఆ స్థానంలో ఆడుంటే రికార్డులన్నీ బద్దలయ్యేవి: గంభీర్

రైనా ఆశలపై నీళ్లు చల్లిన కరోనా..

రైనా ఆశలపై నీళ్లు చల్లిన కరోనా..

గతేడాది ఆగస్టులో మోకాలి గాయానికి నెదర్లాండ్స్‌లో రైనా రెండోసారి సర్జరీ చేయించుకున్నాడు. అప్పటి నుంచి క్రికెట్‌‌కు దూరంగా ఉన్న అతను.. లాక్‌డౌన్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఐపీఎల్ 2020 సీజన్‌లో మంచి ప్రదర్శన చేసి టీ20 ప్రపంచకప్‌‌కు టీమిండియాలో చోటు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ కరోనా అతని ఆశలపై నీళ్లు చల్లింది.

భారత్ తరఫున చివరిసారిగా..

భారత్ తరఫున చివరిసారిగా..

ఇప్పటి వరకు భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2006లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన రైనా.. టీ20ల్లో 134.79 స్ట్రైక్‌రేట్‌తో 1,604 పరుగులు చేశాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం రీఎంట్రీ కోసం ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ తహతహలాడుతున్నాడు.

కోహ్లీసేనకు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం లేదు: గంభీర్

Story first published: Sunday, June 14, 2020, 18:53 [IST]
Other articles published on Jun 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X