న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs WI: ఏడు సిక్సర్లతో సూర్య విధ్వంసం.. వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యం!

IND vs WI: Surya, Iyer fire India to 184/5 in 3rd T20 vs West Indies.

కోల్‌కతా: సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో ఫోర్, 7 సిక్స్‌లతో 65) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా 185 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సూర్యకు తోడుగా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్(19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 నాటౌట్) రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 184 పరుగులు చేసింది. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 91 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. ఇషాన్ కిషన్(34), శ్రేయస్ అయ్యర్(25) ఫర్వాలేదనిపించగా.. రుతురాజ్ గైక్వాడ్(4), రోహిత్ శర్మ(7) తీవ్రంగా నిరాశపరిచారు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్, షెఫెర్డ్, చేజ్, వాల్ష్, డ్రేక్స్ తలో వికెట్ పడగొట్టారు.

రుతురాజ్ విఫలం..

రుతురాజ్ విఫలం..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఎన్నో ఎదురుచూపుల తర్వాత వచ్చిన బంగారంలాంటి అవకాశాన్ని యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(4) సద్వినియోగం చేసుకోలేకపోయాడు. జాసన్ హోల్డర్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ఇషాన్ కిషన్ ధాటిగా ఆడాడు. రొమారియో షెఫెర్డ్ బౌలింగ్‌లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదాడు. అయ్యర్ కూడా జోరు పెట్టడంతో పవర్‌ప్లేలో టీమిండియా వికెట్ నష్టానికి 43 రన్స్ చేసింది.

వరుస ఓవర్‌లో..

వరుస ఓవర్‌లో..

పవర్ ప్లే అనంతరం వాల్ష్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ఔట్‌గా వెనుదిరగ్గా.. చేజ్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో ఇషాన్ సైతం క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ భారీ సిక్సర్‌తో జోరు కనబర్చగా.. రోహిత్ శర్మ(15 బంతుల్లో 7) మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. డ్రేక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్‌తో కలిసి సూర్య ధాటిగా ఆడాడు.

IND vs WI : Rohit Sharma Lauds Ravi Bishnoi .. 4 Overs 17 Dot Balls | Oneindia Telugu..

సిక్సర్లతో సూర్య వీరవిహారం..

స్లాగ్ ఓవర్లలో ఈ ఇద్దరూ భారీ షాట్లతో విరుచుపడటంతో భారత్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. డ్రేక్స్ వేసిన 19వ ఓవర్‌లో సూర్య ఓ భారీ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా,.. వెంకటేశ్ అయ్యర్ రెండు బౌండరీలు బాదాడు. దాంతో ఈ ఓవర్‌లో 21 పరుగులు వచ్చాయి. షెఫెర్డ్ వేసిన చివరి ఓవర్‌లో సూర్య మూడు భారీ సిక్సర్లతో 21 పరుగులు వచ్చాయి. దాంతో భారత్‌ 184 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఆఖరి బంతికి సూర్య క్యాచ్ ఔటయ్యాడు.

Story first published: Sunday, February 20, 2022, 20:57 [IST]
Other articles published on Feb 20, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X