న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: చెలరేగిన స్పిన్నర్లు.. చేతులెత్తేసిన గబ్బర్ సేన.. లంక ముందు స్వల్ప లక్ష్యం!

IND vs SL: India all out for 225 after batting collapse in 3rd ODI vs Sri Lanka

కొలంబో: స్పిన్నర్లు అకిలా ధనుంజయ(3/44), ప్రవీణ్ జయవిక్రమార్క(3/59) చెలరేగడంతో శ్రీలంకతో జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత్ 43.1 ఓవర్లలో 225 పరుగులకు కుప్పకూలింది. జట్టులో 6 మార్పులు చేసిన గబ్బర్ సేన మూల్యం చెల్లించుకుంది. పృథ్వీ షా(49 బంతుల్లో 8 ఫోర్లు 49), సంజూ శాంసన్(46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 46), సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 7 ఫోర్లతో 40) మినహా అంతా విఫలమయ్యారు. స్పిన్నర్లుకు అండగా పేసర్లు చమీరా(2/55), కరుణరత్నే(1/25) రాణించడంతో గబ్బర్ సేన చేతులెత్తేసింది. కెప్టెన్ డసన్ షనకకు ఓ వికెట్ దక్కింది.

శుభారంభం లేదు..

శుభారంభం లేదు..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ శిఖర్ ధావన్(13) తీవ్రంగా నిరాశపరిచాడు. చమీర బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత అరంగేట్ర ప్లేయర్ సంజూ శాంసన్‌తో కలిసి పృథ్వీ షా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరు తమదైన శైలిలో బౌండరీలు బాదడంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టానికి 66 రన్స్ చేసింది. క్రీజులో కుదరుకున్న ఈ జోడీని కెప్టెన్ డసన్ షనక విడదీశాడు. హాఫ్ సెంచరీ ముంగిట పృథ్వీషాను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. షా రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

47 ఓవర్లకు కుదింపు..

47 ఓవర్లకు కుదింపు..

ఆ కొద్ది సేపటికే హాఫ్ సెంచరీకి చేరువైన సంజూ శాంసన్‌ కూడా క్యాచ్ ఔటయ్యాడు. జయవిక్రమార్క బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్స్ దిశగా బౌండరీకి ప్రయత్నించిన సంజూ.. ఫీల్డర్ ఫెర్నాండోకు చిక్కాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఎల్బీగా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చినా రివ్యూతో బయటపడ్డాడు. ఆ వెంటనే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను నిలిపివేసారు. అనంతరం 47 ఓవర్లకు కుదించి ఆటను రీస్టార్ట్ చేయగా.. సూర్య తన మార్క్ షాట్స్‌తో జోరు కనబర్చాడు. కానీ శ్రీలంక స్పిన్నర్లు చెలరేగడంతో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది.

చెలరేగిన ధనుంజయ..

చెలరేగిన ధనుంజయ..

మనీశ్ పాండేను విక్రమార్క కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ బౌండరీలతో ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. అదే జోరులో జయవిక్రమార్కకు వికెట్ల ముందు దొరికపోయాడు. అంపైర్ నాటౌట్ ఇచ్చినా.. శ్రీలంక రివ్యూకెళ్లి ఫలితం సాధించింది. ఆ కొద్ది సేపటికే క్రీజులో కుదురుకున్న సూర్యను ధనుంజయ ఔట్ చేయడంతో భారత ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. తన మరుసటి ఓవర్‌లోనే ధనుంజయ అరంగేట్ర ప్లేయర్స్ కృష్ణప్ప గౌతమ్(2), నితీశ్ రానా(7) బంతి వ్యవధిలో పెవిలియన్ చేర్చాడు. గౌతమ్‌ను ఎల్బీగా, రానాను కీపర్ క్యాచ్‌గా వెనక్కిపంపాడు. దాంతో భారత్ 195 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ క్లిష్ట స్థితిలో టేలండర్స్ రాహుల్ చాహర్(13), నవ్‌దీప్ సైనీ నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. కానీ కరుణరత్నే అద్భుత షార్ట్ పిచ్ బాల్‌తో రాహుల్ చాహర్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే నవ్‌దీప్ సైనీ కూడా షార్ట్ పిచ్ బాల్‌తో దుష్మంత చమీరా ఔట్ చేయడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది.

Story first published: Friday, July 23, 2021, 20:39 [IST]
Other articles published on Jul 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X