న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మా విజయానికి టర్నింగ్ పాయింటే అదే.. ఇలాంటి మ్యాచ్‌లతోనే దమ్ము ఏంటో తెలిసేది: రోహిత్ శర్మ

IND vs SA: Rohit Sharma says got 5 wickets in quick time and that was the turning point

తిరువనంతపురం: తొలి రెండు ఓవర్లలోనే 5 వికెట్లు తీయడం తమ విజయానికి టర్నింగ్ పాయింటని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ తరహా మ్యాచ్‌లతోనే ఆటగాళ్ల అసలు దమ్ము ఏంటో తెలుస్తుందన్నాడు. సౌతాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన రోహిత్ శర్మ.. బౌలర్ల అద్భుత ప్రదర్శనకు కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ అసాధరణ బ్యాటింగ్‌తో రాణించడంతో ఈ విజయం దక్కిందన్నాడు. పిచ్ బౌలర్లకు ఇంతలా సహకరిస్తుందని తాము కూడా ఊహించలేదన్నాడు.

అసలు దమ్ము ఏంటో తెలుస్తోంది..

అసలు దమ్ము ఏంటో తెలుస్తోంది..

'ఈ వికెట్ చాలా కఠినమైనది. ఇలాంటి మ్యాచ్‌లతో చాలా నేర్చుకోవచ్చు. కఠిన పరిస్థితుల్లో జట్టుకు ఏం కావాలో అనే విషయం ఇలాంటి మ్యాచ్‌ల ద్వారా తెలిసొస్తోంది. ఈ మ్యాచ్‌ను మేం ఆడిన విధానం ఆకట్టుకుంది. పిచ్‌పై గడ్డి ఉండటంతో బౌలర్లకు అనుకూలిస్తుందని ముందే అంచనా వేసాం. కానీ మరీ ఇంతలా 20 ఓవర్ల పాటు బౌలర్లకే అనుకూలిస్తుందని ఏ మాత్రం ఊహించలేకపోయాం. ఇప్పటికీ ఆశ్చర్యకరంగానే ఉంది. ఇరు జట్లు హోరీహోరీగా తలపడ్డాయి. కానీ కాస్త మెరుగ్గా రాణించిన భారత జట్టుకు విజయం దక్కింది.

అదే టర్నింగ్ పాయింట్..

అదే టర్నింగ్ పాయింట్..

ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఐదు వికెట్లు తీయడం మాకు కలిసొచ్చింది. ఇదే మా విజయానికి టర్నింగ్ పాయింట్. స్వల్ప లక్ష్యాన్ని చేధించడం అంతా సులువు కాదు. పరిస్థితులను గౌరవించడం చాలా ముఖ్యం. రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత రాహుల్, సూర్య ఇన్నింగ్స్ నెలకొల్పిన భాగస్వామ్యం విజయానికి బాటలు వేసింది.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

చెలరేగిన బౌలర్లు..

చెలరేగిన బౌలర్లు..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు మాత్రమే చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25), వేన్ పార్నెల్(37 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 24), కేశవ్ మహరాజ్(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/32) మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్(2/24), హర్షల్ పటేల్(2/26) రెండేసి వికెట్లు తీసారు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.

సూర్య సూపర్ ఇన్నింగ్స్..

సూర్య సూపర్ ఇన్నింగ్స్..

అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 16.4 ఓవర్లలో 2 వికెట్లకు 110 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. సూర్యకుమార్ యాదవ్(33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50), కేఎల్ రాహుల్(56 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడా, అన్రిచ్ నోర్జ్ తలో వికెట్ తీసారు.

Story first published: Thursday, September 29, 2022, 7:06 [IST]
Other articles published on Sep 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X