న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు.. ధోనీ, విరాట్, రోహిత్‌కు సాధ్యం కానీ ఘనత!

 IND vs NZ: Hardik Pandya creates unique record, Even Dhoni, Virat and Rohit Failed to achieve this

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఓటమే ఎరుగని భారత కెప్టెన్‌గా రికార్డు సాధించాడు. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. న్యూజిలాండ్ పర్యటనలో మూడు టీ20ల సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న హార్దిక్.. చివరి టీ20 మ్యాచ్ టై అవ్వడంతో ఈ ఘనతను అందుకున్నాడు. మంగళవారం జరిగిన ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ ప్రకారం టై అయిన విషయం తెలిసిందే.

 5 మ్యాచ్‌ల్లో ఓటమే లేదు..

5 మ్యాచ్‌ల్లో ఓటమే లేదు..

ఈ ఏడాదే ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా తాత్కలిక సారథిగా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో గెలిచాడు. తొలి మ్యాచ్‌లో 7 వికెట్లతో గెలిచిన హార్దిక్ సేన.. రెండో మ్యాచ్‌లో 4 పరుగులతో గెలుపొందింది. ఇక వెస్టిండీస్ పర్యటనలో ఓ మ్యాచ్‌కు సారథ్యం వహించిన హార్దిక్ 88 పరుగులతో జట్టుకు విజయాన్నందించాడు. తాజా పర్యటనలో రెండో టీ20ని 65 పరుగులతో గెలిచిన టీమిండియా.. చివరి మ్యాచ్ వర్షం కారణంగా టై చేసుకుంది. దాంతో ఓటమే ఎరుగని కెప్టెన్‌గా హార్దిక్ దూసుకెళ్తున్నాడు.

పూర్తి స్థాయి కెప్టెన్‌గా..

పూర్తి స్థాయి కెప్టెన్‌గా..

టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా వైఫల్యం నేపథ్యంలో స్ప్లిట్ కెప్టెన్సీ విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది. 2024 టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీ20 సారథ్య బాధ్యతలను హార్దిక్ పాండ్యాకు అప్పగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. సెలెక్షన్ కమిటీనీ రద్దు చేసి దరఖాస్తులను ఆహ్వానించింది.. కొత్త కమిటీ నియమాకం తర్వాత ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. రోహిత్ శర్మను వన్డే, టెస్ట్‌లకు పరిమితం చేసి.. టీ20 సారథ్య బాధ్యతలను హార్దిక్‌కు అప్పగించాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.

మా బుడ్డోడితో ఆడుకుంటా..

మా బుడ్డోడితో ఆడుకుంటా..

న్యూజిలాండ్‌ పర్యటనలో టీమిండియా తాత్కలిక సారథిగా తన బాధ్యత ముగిసిందని, ఇంటికెళ్లి కొడుకుతో ఆడుకుంటానని హార్దిక్ పాండ్యా తెలిపాడు.

'మ్యాచ్ పూర్తిగా జరుగుంటే గెలిచేవాళ్లం. ఏదైనా మాకు మంచే జరిగింది. ఓ దశలో ఎదురుదాడికి దిగడమే ఈ వికెట్‌పై బెస్ట్ డిఫెన్స్ అనిపించింది. కివీస్ క్వాలిటీ బౌలింగ్ గురించి మాకూ పూర్తిగా అవగాహన ఉంది. అందుకే ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా ధాటిగా ఆడి 10-15 పరుగులు అదనంగా చేయడం ముఖ్యమని భావించాం. ఇక ఈ సిరీస్ విజయంతో నా పని పూర్తయ్యింది. హాయిగా ఇంటికెళ్లి ఈ విశ్రాంత్రి సమయాన్ని నా కొడుకుతో గడుపుతా'అని హార్దిక్ చెప్పుకొచ్చాడు.

వర్షంతో టై..

వర్షంతో టై..

ఈ మ్యాచ్‌‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు కుప్పకూలింది. డేవాన్ కాన్వే(49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 59), గ్లేన్ ఫిలిప్స్(33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ నాలుగేసి వికెట్లు తీయగా... హర్షల్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది.

161 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 4 వికెట్లకు 75 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 30 నాటౌట్), దీపక్ హుడా(9 నాటౌట్) అజేయంగా నిలిచారు. ఇషాన్ కిషన్(10), రిషభ్ పంత్(11) మరోసారి విఫలమవ్వగా.. శ్రేయస్ అయ్యర్(0) మరో అవకాశాన్ని చేజార్చుకున్నారు. గత మ్యాచ్ సెంచరీ హీరో సూర్యకుమార్ యాదవ్(13) సైతం విఫలమయ్యాడు.

Story first published: Tuesday, November 22, 2022, 20:38 [IST]
Other articles published on Nov 22, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X