న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG:పులి కాస్త పిల్లి.. అదేందో విదేశీ పర్యటనలు అనగానే రోహిత్‌కు బెడ్ రెస్ట్!

IND vs ENG: Why does Rohit Sharma get injured almost every time before an overseas test series?

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న హిట్‌మ్యాన్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. శనివారం నిర్వహించిన యాంటిజెన్‌ పరీక్షల్లో అతడికి వైరస్‌ నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ఆదివారం తెల్లవారుజామున ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం అతను టీమ్‌ బస చేసిన హోటల్‌లోనే ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉన్నట్లు వెల్లడించింది. అయితే, జులై 1 నుంచి ఇంగ్లండ్‌తో ఆడే కీలక టెస్టుకు ముందు అతను వైరస్ బారిన పడటం టీమిండియా క్యాంప్‌లో ఆందోళన నెలకొంది. మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌కు అతను అందుబాటులోకి వస్తాడా? లేదా? అనే సందేహం నెలకొంది.

మ్యాచ్ ఆడటం డౌటే..

మ్యాచ్ ఆడటం డౌటే..

వైరస్ నుంచి కోలుకోవడానికి కనీసం ఏడు రోజుల సమయం అవసరం. ఈ నేపథ్యంలోనే అతను కీలక మ్యాచ్‌లో ఆడటం కష్టంగా మారింది. ప్రస్తుతం లీసెస్టర్‌ జట్టుతో జరుగుతోన్న వార్మప్‌ మ్యాచ్‌లో గురువారం తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసి 25 పరుగులు చేశాడు. కానీ, శనివారం రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా బ్యాటింగ్‌కు రాలేదు. ఈ క్రమంలోనే రోహిత్‌కు పాజిటివ్‌గా తేలడంతో ఇరు జట్లలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. కాగా, గతేడాది పూర్తికావాల్సిన 5 టెస్టుల ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు జరిగాక.. కరోనా కేసుల కారణంగానే ఐదో మ్యాచ్‌ వాయిదా పడింది.

కెప్టెన్‌గా బుమ్రా

కెప్టెన్‌గా బుమ్రా

అప్పుడు కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు మళ్లీ అదే టెస్టుకు ముందు పలువురు భారత ఆటగాళ్లు కొవిడ్‌-19 బారిన పడటం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. అయితే, రోహిత్‌ ఈ టెస్టుకు ముందు కోలుకుంటే కెప్టెన్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. లేకపోతే రిషభ్‌ పంత్‌ లేదా జస్ప్రిత్‌ బుమ్రా కెప్టెన్సీ చేసే వీలుంది. ఈ నేపథ్యంలో రోహిత్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

పులి కాస్త పిల్లి..

పులి కాస్త పిల్లి..

స్వదేశంలో పులిలా చెలరేగే రోహిత్ శర్మ.. విదేశీ పర్యటనల్లో మాత్రం పిల్లిలా మారుతాడు. అతను కెరీర్ గణంకాలను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాకతాళీయమో ఏమో కానీ ఫారిన్ టూర్స్ అనగానే రోహిత్ శర్మకు బెడ్ రెస్ట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. గతంలో అనేక సందర్భాల్లో అతను గాయపడ్డాడు. ఆడిన మ్యాచ్‌ల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనకు ఇలానే గాయంతో దూరమయ్యాడు. ఇప్పుడు కరోనాతో జట్టుకు దూరమయ్యే స్థితిలో నిలిచాడు. ఈ క్రమంలో రోహిత్‌పై అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Story first published: Sunday, June 26, 2022, 10:53 [IST]
Other articles published on Jun 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X