For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డు.. దరిదాపుల్లో కూడా ఎవడూ లేడు!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే 9 వేల పరుగుల మైలురాయి అందుకున్న ఏకైక ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీకి దరిదాపుల్లో మరే ఆటగాడు కూడా లేకపోవడం గమనార్హం. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. తన హోమ్ గ్రౌండ్‌లో కోహ్లీ ఈ అద్వితీయమైన ఘనతను అందుకోవడం ప్రత్యేకం.

ఈ మ్యాచ్‌కు ముందు ఈ మైలురాయికి 11 పరుగుల దూరంలో నిలిచిన కోహ్లీ.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఈ ఘనతను అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించేందుకు కోహ్లీ 6732 బాల్స్ ఆడాడు. ఆర్‌సీబీ ఫ్రాంచైజీ తరఫునే కోహ్లీ ఈ 9వేల పరుగులు చేయడం విశేషం.

DC vs RCB Virat Kohli Creates History Becomes the First Cricketer to Score 9 000 IPL Runs

ఇప్పటికే ఐపీఎల్‌లో టాప్ రన్ స్కోరర్‌గా కోహ్లీ కొనసాగుతున్నాడు. అతని తర్వాత రోహిత్ శర్మ 7183 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. శిఖర్ ధావన్(6769), డేవిడ్ వార్నర్(6565), కేఎల్ రాహుల్(5580) తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసింది. 81 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి ఐపీఎల్ చరిత్రలోనే రెండో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్(33 బంతుల్లో 3 ఫోర్లతో 30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(3/5), జోష్ హేజిల్‌వుడ్(4/12) ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించగా.. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ, రసిక్‌ధార్ సలామ్ తలో వికెట్ తీసారు.

అనంతరం ఆర్‌సీబీ 6.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 23 నాటౌట్), దేవదత్ పడిక్కల్(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) అజేయంగా నిలవగా.. జాకోబ్ బెతెల్(11 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 20) దూకుడుగా ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో కైల్ జెమీసన్(1/42) ఒక్కడే ఒక వికెట్ తీసాడు.

Story first published: Tuesday, April 28, 2026, 0:30 [IST]
Other articles published on Apr 28, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+