పిచ్‌ను చూసి షాకయ్యా.. అది మా అదృష్టం: భువనేశ్వర్ కుమార్
గత మ్యాచ్‌లో 250+ స్కోర్లు నమోదైన వికెట్‌పై బంతి స్వింగ్ అవ్వడం చూసి షాకయ్యానని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) పేసర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. అయితే అదృష్టవశాత్తు ఆరంభంలో వికెట్లు దక్కాయని చెప్పాడు . ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
భువనేశ్వర్ కుమార్(3/5) మూడు వికెట్లతో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ అనంతరం భువనేశ్వర్ కుమార్‌కు పర్పుల్ క్యాప్ వరించింది. ఈ సందర్భంగా మాట్లాడిన భువనేశ్వర్ కుమార్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉందని, కానీ స్వింగ్ లభించిందని చెప్పాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకోవడం వల్లే వికెట్లు లభించాయని తెలిపాడు.
ఈ ఏడాది బంతి స్వింగ్ అవుతోంది..
'ఈ ఏడాది బంతి బాగా స్వింగ్ అవుతోంది. అది బంతి వల్లనా.. వికెట్ల వల్లనా లేక మరేదైనా కారణమా అనేది నాకు తెలియదు. కానీ బంతి స్వింగ్ అయినప్పుడు.. ఆరంభంలోనే కొన్ని వికెట్లు పడగొడితే.. ఈ టోర్నీ చివరి దశలో బౌలింగ్ చేయడం సులువు అవుతుంది.
ఇది బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. బంతి కూడా బ్యాట్‌పైకి ముద్దగా వచ్చింది. కానీ స్వింగ్ లభించింది. నాకు కలిసొచ్చిన రోజుల్లో ఇది ఒకటి. ఎందుకంటే బ్యాటర్లు ఎడ్జ్ ఇచ్చారు, బౌల్డ్ అయ్యారు. ఆరంభ వికెట్లు దక్కడం మా అదృష్టం.

పిచ్‌ను షాకయ్యా..
ఈ పిచ్‌ను చూసి ఆశ్చర్యపోయాను. గత మ్యాచ్‌లో ఈ పిచ్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ దాదాపు 250 ప్లస్ పరుగులు వచ్చాయి. అలాంటి పిచ్‌పై బంతి స్వింగ్ అయిన తీరు చూసి షాకయ్యాం. ఈ స్వింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకున్నాం. వికెట్లు తీసి వారిని త్వరగా ఆలౌట్ చేశాం.
వాతావరణం వేడిగా ఉండటంతో పాటు అలసిపోవడంతోనే నాలుగో ఓవర్ వేయలేదు. తొలి మూడు ఓవర్లతోనే నేను సంతృప్తి చెందాను. నా వయసు దృష్ట్యా నేను మరీ ఎక్కువగా శ్రమపడాలనుకోలేదు.'అని భువనేశ్వర్ కుమార్ చెప్పుకొచ్చాడు.
ఆర్‌సీబీ ఘన విజయం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌటైంది. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్(33 బంతుల్లో 3 ఫోర్లతో 30) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డేవిడ్ మిల్లర్(19), కైల్ జెమీసన్(12)తో సహా బ్యాటర్లంతా విఫలమయ్యారు. సాహిల్ పరఖ్(0), కేఎల్ రాహుల్(1), నితీష్ రాణా(1), సమీర్ రిజ్వీ(0), ట్రిస్టన్ స్టబ్స్(5), అక్షర్ పటేల్(0) తీవ్రంగా నిరాశపర్చారు.
అర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(3/5), జోష్ హేజిల్‌వుడ్(4/12) ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించగా.. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ, రసిక్‌ధార్ సలామ్ తలో వికెట్ తీసారు.
అనంతరం ఆర్‌సీబీ 6.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లీ(15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 23 నాటౌట్), దేవదత్ పడిక్కల్(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) అజేయంగా నిలవగా.. జాకోబ్ బెతెల్(11 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 20) దూకుడుగా ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో కైల్ జెమీసన్(1/42) ఒక్కడే ఒక వికెట్ తీసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications