సంజీవ్ గోయెంకా అతి జోక్యం.. రిషభ్ పంత్ వ్యాఖ్యలు కలకలం
లక్నో సూపర్ జెయింట్స్(LSG) ఓనర్ సంజీవ్ గోయెంకా జట్టులో అతి జోక్యం చేసుకుంటున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జట్టు నిర్ణయాల్లో సంజీవ్ గోయెంకా అతి జోక్యంతోనే ఆ జట్టు వరుస పరాజయాలను ఎదుర్కొంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ ఓవర్‌లో ఓటమిపాలైంది.
అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందిస్తూ రిషభ్ పంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. జట్టు నిర్ణయాల్లో టీమ్‌మేనేజ్‌మెంట్ అతిగా జోక్యం చేసుకుంటుందని పంత్ పరోక్షంగా వెల్లడించాడన అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ను దిగ్వేష్ రతితో వేయించడంపై రిషభ్ పంత్‌ను ప్రశ్నించగా.. మేనేజ్‌మెంట్ సూచనలతో అలా చేయాల్సి వచ్చిందని పంత్ పరోక్షంగా వెల్లడించాడు. 'మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ను కాస్త టర్న్ చేసేందుకు అవకాశం ఉండే సందర్భాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు బౌలర్లు కఠినమైన ఓవర్లు వేయాల్సి వస్తుంది. మేం వికెట్ కోసం చూస్తున్నప్పుడు అతనికి చివరి ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ మాకు ఆశించిన ఫలితం దక్కలేదు. వాస్తవానికి అతనితో మిడిల్ ఓవర్లలోనే వేయించాల్సింది. అది కుదరలేదు. మైదానంలో ఒకేసారి ఎక్కువ ఆలోచనలు చేయడం అంత సులువు కాదు’అని రిషభ్ పంత్ బదులిచ్చాడు.

ఎక్కువ ఆలోచనలు అనే పదం టీమ్ మేనేజ్‌మెంట్ అతి జోక్యాన్ని సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంజీవ్ గోయెంకా అతి జోక్యం అని కొందరంటే సపోర్ట్ స్టాఫ్ అని మరికొందరు అంటున్నారు. సౌతాఫ్రికా దిగ్గజం షాన్ పొలాక్ మాత్రం.. సపోర్ట్ స్టాఫ్‌ను ఉద్దేశించే రిషభ్ పంత్ ఈ వ్యాఖ్యలు చేశాడని తెలిపారు.
'ఇలాంటి మాటలు కెప్టెన్ నుంచి రావడం మంచిది కాదు. ఎందుకంటే నాకు చాలా మంది సలహాలు ఇస్తున్నారని అతను పరోక్షంగా చెబుతున్నాడు. దీని ద్వారా అతను తమ మేనేజ్‌మెంట్ గ్రూప్‌ను ఇబ్బందుల్లోకి నెడుతున్నాడు. బహుశా ఆ జట్టులో వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మనకు తెలియకపోవచ్చు. అదే అసలు సమస్య. చివరి నిర్ణయం ఎవరిదో తెలియదు, అతనితో కలిసి కూర్చుని, వారి అభిప్రాయాలను వివరిస్తూ, అతనితో చర్చలు జరిపేది ఎవరో కూడా మనకు తెలియదు.’అని షాన్ పొలాక్ చెప్పుకొచ్చాడు.
లక్నో జట్టులో జస్టిన్ లాంగర్ (హెడ్ కోచ్), లాన్స్ క్లూస్‌నర్ (అసిస్టెంట్), భరత్ అరుణ్ (బౌలింగ్ కోచ్), కేన్ విలియమ్సన్ (వ్యూహాత్మక సలహాదారు), టామ్ మూడీ (క్రికెట్ డైరెక్టర్) సపోర్ట్ స్టాఫ్ మెంబర్స్‌గా ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications