IPL 2026: ఆర్‌సీబీ భారీ విజయం.. రెట్టింపు అయిన రన్‌రేట్!
ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జోరు కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం న్యూఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ సంచలన బౌలింగ్ ప్రదర్శనతో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 6.3 ఓవరల్లోనే లక్ష్యాన్ని ఛేదించడంతో ఆర్‌సీబీ రన్‌రేట్ రెట్టింపు అయ్యింది. ఐపీఎల్ చరిత్రలోనే ఆర్‌సీబీకి ఇది రెండో అతిపెద్ద విజయం.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో 75 పరుగులకు కుప్పకూలింది. భువనేశ్వర్ కుమార్(3/5), జోష్ హేజిల్‌వుడ్(4/12) ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించగా.. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ, రసిక్‌ధార్ సలామ్ తలో వికెట్ తీసారు. ఢిల్లీ బ్యాటర్లలో ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్(33 బంతుల్లో 3 ఫోర్లతో 30) టాప్ స్కోరర్‌గా నిలవగా.. డేవిడ్ మిల్లర్(19), కైల్ జెమీసన్(12) డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. సాహిల్ పరఖ్(0), కేఎల్ రాహుల్(1), నితీష్ రాణా(1), సమీర్ రిజ్వీ(0), ట్రిస్టన్ స్టబ్స్(5), అక్షర్ పటేల్(0) తీవ్రంగా నిరాశపర్చారు.

అనంతరం ఆర్‌సీబీ 6.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 77 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(15 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 23 నాటౌట్), దేవదత్ పడిక్కల్(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34 నాటౌట్) అజేయంగా నిలవగా.. జాకోబ్ బెతెల్(11 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 20) దూకుడుగా ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో కైల్ జెమీసన్(1/42) ఒక్కడే ఒక వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు విఫలమయ్యారు.
ఢిల్లీ కొంపముంచిన పవర్ ప్లే..
బ్యాటింగ్ పవర్ ప్లేలోనే ఢిల్లీ ఓటమికి తలవంచింది. భువ స్వింగ్, హజెల్ వుడ్ లైన్ అండ్ లెంగ్త్‌కు చేతులెత్తేసింది. పవర్ ప్లేలోనే 6 వికెట్లు కోల్పోవడంతో కోలుకోలేకపోయింది. పిచ్ మరీ దారుణంగా లేకపోయినా.. ఢిల్లీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరి మూల్యం చెల్లించుకున్నారు. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా ఉండే ఈ మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.
భువనేశ్వర్ కుమార్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించాడు. పిచ్ మరీ బౌలింగ్‌కు అనుకూలంగా లేదని, బ్యాట్‌పైకి బంతి ముద్దుగా వచ్చిందని చెప్పాడు. స్వింగ్ ఉండటంతో దాన్ని సద్వినియోగం చేసుకున్నామని చెప్పాడు. ఆరంభంలో వికెట్లు దక్కడం తమ విజయానికి కలిసొచ్చిందన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications